ప్రేమ విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పలేరు. దీంతో.... వీరు తమ ప్రేమను చెప్పుకోలేక ప్రేమలో విఫలమౌతారు. దీంతో... తాము ప్రేమ విషయంలో లక్ లేదు అని ఫీలౌతూ ఉంటారు. 

ప్రేమ దక్కించుకోవడం అంత సులువేమీ కాదు. ప్రేమ విషయంలో అందరికీ అదృష్టం ఉండదు. కొందరు ప్రేమను దక్కించుకోవడానికి యుద్దాలు చేయడానికైనా వెనకాడరు. కానీ... కొందరు కనీసం మనసులోని ప్రేమను కూడా బయటపెట్టనివ్వరు. ఈ కారణంతోనే వారు ప్రేమను దక్కించుకోరు. జోతిష్యశాస్త్రం ప్రకారం... ఈ కింది రాశులవారికి ప్రేమ విషయంలో లక్ ఉండదు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం....


1.మిథున రాశి...
మిథున రాశివారు డబుల్ మైండెడ్ గా ఉంటారు. పైకి ఒకలా కనిపిస్తారు... మనసులో మరోటి పెట్టుకుంటారు. మనసులో మాటను తొందరగా బయటపెట్టలేరు. వీరు ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకోలేరు. వీరు ఎక్కువగా ప్రజల నుంచి మద్దతు కోరుకుంటారు. ప్రేమ విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పలేరు. దీంతో.... వీరు తమ ప్రేమను చెప్పుకోలేక ప్రేమలో విఫలమౌతారు. దీంతో... తాము ప్రేమ విషయంలో లక్ లేదు అని ఫీలౌతూ ఉంటారు.

2.తుల రాశి...
ఈ రాశివారికి ఏ విషయంలో ఏది తప్పో, ఏది ఒప్పో తేల్చుకోలేరు. ప్రతి విషయంలోనూ గొడవ చేస్తారు. వీరి జీవితంలోకి ప్రేమ వచ్చినా... వారితో సఖ్యతగా ఉండటం కూడా వీరికి రాదు. వీరు అందరితోనూ గొడవలు పడుతూనే ఉంటారు. అందుకే ఈ రాశివారు ప్రేమకు అనర్హులుగా నిలుస్తారు.

3.వృశ్చిక రాశి...

ఈ రాశివారు తమను తాము కొంచెం ఎక్కువగా అనుమానించుకుంటారు. వారు తమను తాము విమర్శించుకుంటారు. మనసులో బాధనే పెట్టుకొని బతుకుతూ ఉంటారు. ఈ రాశివారు ఎమోషన్స్ తో బాధపడుతూ ఉంటారు. వీరు ప్రేమలో పడినా.. ఈ రాశివారు వెంటనే విడిపోతూ ఉంటారు. 

4.మకర రాశి...
వారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడానికి సహాయపడే విలువలు, నైతికతలను కలిగి ఉంటారు. వారు సౌకర్యవంతమైన జీవనశైలిని పొందగలరని నిర్ధారించడానికి వారు చాలా కష్టపడి పని చేస్తారు. ప్రేమను ఎలా స్వీకరించాలో వారికి తెలియదు. అందుకే వీరికి లక్ ఉండదు.


5.మీన రాశి...

ఈ రాశివారికి రిలేషన్స్ కి ఎక్కువ విలువ ఇచ్చారు. అందువల్ల, వారు తమను ఏ విధంగానైనా బాధపెట్టే ఎలాంటి సంబంధం నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి, వారు తమంతట తాముగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రాశివారు ప్రేమను తొందరగా యాక్సెప్ట్ చేయలేరు. 

ఈ రాశులు ప్రేమను హృదయపూర్వకంగా స్వీకరిస్తారు

మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం ప్రేమను దాని స్వచ్ఛమైన రూపంలో స్వీకరిస్తారు. వారు ప్రేమలో పడటానికి లేదా గాయపడటానికి భయపడరు. ప్రేమలో పడటం, విడిపోవటం, నొప్పి మొదలైనవన్నీ మనిషిలో భాగమని వారు నమ్ముతారు.