నేడే చంద్రగ్రహణం, కనిపించే సమయాలు ఇవే..!

భారత్ లో ఎలాగూ కనపడదు కాబట్టి, ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక గ్రహణం నీడ పడితే కడుపులో ఉండే బిడ్డకు హాని జరుగుతుంది, అంగవైకల్యంతో పుడతారు అలాంటి అపోహలు నమ్మవద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Will Lunar Eclipse be visible from India ram


గ్రహణాలు ప్రతి వ్యక్తిపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయని కొన్ని సంవత్సరాలుగా  జ్యోతిష్కులు విశ్వసిస్తున్నారు. మే 5 అంటే ఈ రోజు  చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. దీనిని పెనుంబ్లార్ లూనార్ అని పిలుస్తారు.

భారత కాల మానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.42 నిమిషాల నుంచి రాత్రి 1.04 గంటల వరకు గ్రహణం కాలం ఉంటుంది. అయితే, ఇది భారత దేశంలో ఎక్కడా కనిపించే అవకాశం లేదు. భారత్ లో కనపడుతుందని వస్తున్న వార్తలు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం ఆఫ్రికా, ఆస్ట్రేలిలయా, అట్లాంటిక్ వంటి దేశాల్లో కనిపించే అవకాశం ఉంది. భారత్ లో ఎలాగూ కనపడదు కాబట్టి, ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక గ్రహణం నీడ పడితే కడుపులో ఉండే బిడ్డకు హాని జరుగుతుంది, అంగవైకల్యంతో పుడతారు అలాంటి అపోహలు నమ్మవద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుట్టబోయే బిడ్డకులకు గ్రహణానికి ఎలాంటి సంబంధం ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

సూర్యుడు, చంద్రుడికి మధ్యలో భూమి రావడాన్ని చంద్రగ్రహణం అంటారు. ఇలా భూమి.. సూర్యచంద్రుల మధ్యలోకి వచ్చినప్పుడు సూర్య రశ్మి చంద్రుడిపై పడదు. దీని వల్ల మనకు చంద్రుడు కనపడడు. దీనినే మనం చంద్ర గ్రహణం అంటారు. గ్రహణం చాలా అరుదు ఎందుకంటే ఇది ప్రకృతిలో పెనుంబ్రాల్ ఉంటుంది. కనీసం రెండు దశాబ్దాల వరకు పునరావృతం కాదు. చంద్ర గ్రహణాలు సంపూర్ణంగా లేదా పాక్షికంగా ఉండవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios