రాత్రి పూట దుస్తులు ఎందుకు ఉతకకూడదు..?

కొందరికి రాత్రిపూట దుస్తులు ఉతికే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని మీకు తెలుసా? అవును, వాస్తు శాస్త్రంలో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు.

Why wo do not wash cloths at niight ram


వాస్తు శాస్త్రంలో, ప్రతి పనిని చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, అవి మనం పాటించాలి. అదే సమయంలో, రాత్రిపూట దుస్తులు  ఉతకకూడదని గ్రంధాలలో చెప్పారు. దీని వెనుక ఉన్న కారణాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం...

వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట దుస్తులు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు. అలా చేయడం శ్రేయస్కరం కాదు. ఎందుకో తెలుసుకోండి.ఒక వ్యక్తి రాత్రిపూట దుస్తులు ఉతికితే భవిష్యత్తులో చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ తప్పు చేయవద్దు.
 

ఇంట్లో ప్రతికూలత
వాస్తు ప్రకారం, రాత్రిపూట దుస్తులు ఉతకడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. అలాగే తడి దుస్తులు  రాత్రిపూట బయట ఆరబెట్టకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అడుగుపెడుతుందట. అంతేకాదు, మరుసటి రోజు ఉదయం ఈ బట్టలు ధరించడం ఒక వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే, చేయాలి అనుకున్న ప్రతి పనికీ అంతరాయం కలిగే అవకాశం ఉంటుందట.


రాత్రిపూట దుస్తులు ఉతకడం వల్ల మనస్సు చంచలంగా మారుతుంది. అంతేకాకుండా, ఒక వ్యక్తి అన్ని సమయాలలో ఒత్తిడికి గురవుతాడు. కాబట్టి రాత్రిపూట దుస్తులు ఉతకడం తప్పు. కొన్ని కారణాల వల్ల మీరు రాత్రిపూట దుస్తులు ఉతకవలసి వస్తే, వాటిని బహిరంగ ప్రదేశంలో అంటే ఆకాశం కింద ఆరబెట్టవద్దు. ఇంటి లోపల ఆరపెట్టుకోవచ్చు. బహిరంగ ప్రదేశంలో ఆరబెట్టడం వల్ల వాటిపై సూక్ష్మక్రిములు వచ్చి చేరుతాయి. లేదా పక్షి మలమూత్రాలు దానిపై పడే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా సమస్య అవుతుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios