మాట విలువ పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సంబంధాలు అనుకూలత ఏర్పడుతుంది. సహకారం కోసం ప్రయత్నిస్తారు. పోటీల్లో నిలబడడానికి ప్రయత్నిస్తారు. శత్రువులు పెరిగే సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి.

AlsoRead libra: 2020లో తుల రాశివారి ఫలితాలు..

సేవకుల సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలతలు ఏర్పడతాయి. తోటివారి సహకారాలు ఉంటాయి. దొరికిన సహకారం అనుకూలంగా ఉండదు. కొంత అసంతృప్తి ఉంటుంది. వీరు ఊహించిన రీతిలో ఏ పనీ జరుగదు. దగ్గరి ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి పెట్టాలి. సంతాన పరమైన సహకారం లభించదు. సంతానంకోసం ఆలోచించి కొంత ఒత్తిడిని పెంచుకుంటారు. సౌకర్యాలుకూడా ఒత్తిడితో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ఉద్యోగస్తులు ఏవో పనులపై వేరు వేరు ప్రాంతాలకు తిరుగుతూ ఉంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళే చోట కొంత ఒత్తిడి ఉంటుంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తమను తాము నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. వీరికి కొంత బద్ధకం పెరుగుతుంది. లావుగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిని కూర్చోకుండా ఏదైనా పని చేసుకుంటూ ఉండాలి. కూర్చునే పనులకన్నా కూడా తిరిగే పనులు ఎక్కువగా చేయాలి. ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. వీరికి పనులు చేయడం కన్నా కూడా సలహాలు ఇవ్వడం ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది.

మాటలవల్ల ఇబ్బందులు ఉంటాయి. మధ్యవర్తిత్వాలు పనికిరావు. దీనివల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయి. నిల్వ ధనాన్ని కోల్పోతారు.  ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం. శారీరక శ్రమ ఉంటుంది. తాను చేసే పనుల వల్ల తమకే ఇబ్బందులు వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. మాటల్లో నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారు అపార్థం చేసుకుని తమని నిందించే అవకాశం ఉంటుంది. కాబట్టి  జాగ్రత్త పడడం మంచిది.