libra: 2020లో తుల రాశివారి ఫలితాలు
చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. పరాక్రమం ఉంటుంది. ఎన్ని పనులు చేసినా వాటిలో అనుకున్నంత గుర్తింపు, కావలసిన విజయం సాధించలేరు. సంతృప్తి కూడా తక్కువగా ఉంటుంది.
వీరికి సహకారం తీసుకోవడం వల్ల కష్టాలు వస్తాయి. పెద్దల సహకారం అంత తొందరగా లభించదు. విద్యార్థులకు ఒత్తిడి కొంత ఎక్కువగానే ఉంటుంది. చదువుకునే సమయంలో సౌకర్యాల వైపు ఆలోచనలు వెళతాయి. దగ్గరి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. పరామర్శలు ఉంటాయి. వీరికి కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. పరాక్రమం ఉంటుంది. ఎన్ని పనులు చేసినా వాటిలో అనుకున్నంత గుర్తింపు, కావలసిన విజయం సాధించలేరు. సంతృప్తి కూడా తక్కువగా ఉంటుంది.
వీరికి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులకు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నత విద్యలపై దృష్టి ఉంటుంది. విశ్రాంతి తక్కువగా ఉంటుంది. వ్యర్థ ప్రయాణాల జోలికి వెళ్ళకూడదు. పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. వీరికి దురాశ ఎక్కువగా ఉంటుంది. వీరికి కర్మ బాగా పెరుగుతుంది. కావున కర్మను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
సౌకర్యాలు ఒత్తిడిని కలిగిస్తాయి. ఉన్న సౌకర్యాలు వీరికి సరిపోవు. కొత్త సౌకర్యాలు కావాలని ఆలోచిస్తూ ఉంటారు. వాటికోసం ప్రయత్నం చేస్తూ నిరాశ నిస్పృహలు పెంచుకుంటారు. తమకు అన్నీ ఆటంకాలే. ఎవరూ సమయానికి ఉపయోగ పడరు. ఏ వస్తువు కూడా తమకు అవసరానికి వినియోగంలోకి రాదు అనే నిరాశ నిస్పృహలు ఎక్కువౌతాయి. వీరు ఎదుటివారు సహకారం అందించినా కూడా తీసుకోవడానికి వీరు అనుకూలంగా ఉండరు. ఎదుటివారు తమ దగ్గర ఏమి ఆశించి సహకారం ఇస్తున్నారో అనే ఆలోచన కొంత పెట్టుకుంటారు.
ముఖ్యంగా పశుపక్షాదులకు ఆహారం పెట్టాలి, అలాగే గురువులకు, పెద్దలను సేవించుకుంటూ ఉండాలి. శివునికి అభిషేకం, అవసరార్థికి అవసరమైన వస్తువులు దానం చేయాలి. వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.