Asianet News TeluguAsianet News Telugu

వినాయకచవితి.. గణనాథుడిని పూజించాల్సిన 21పత్రాలు ఇవే

భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక మండలం తూర్పు ఆకాశంలో ఉదయిస్తుంది. కావుననే ఆరోజున వినాయక వ్రతం చేసు కుంటాం. 21 పత్రాలు.

vinayaka chavithi special article
Author
Hyderabad, First Published Sep 2, 2019, 6:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక మండలం తూర్పు ఆకాశంలో ఉదయిస్తుంది. కావుననే ఆరోజున వినాయక వ్రతం చేసు కుంటాం. 21 పత్రాలు.

1. మాచీపత్రం : దీనిని మాచిపత్రి అంటారు. దీని కషాయం దద్దుర్లు తగ్గించడానికి పనిచేస్తుంది. కుష్టువ్యాధిని కూడా నివారిస్తుంది.

2. బృహతీపత్రం : దీనిని వాకుడాకు అంటారు. ఇది ఉబ్బసం, శ్వాసకోసం, క్షయ మొదలైన వాటిని తగ్గించడానికి వాడతారు.

3. బల్వపత్రం : దీనిని మారేడు పత్రి అంటారు. ఇది శివునికి మిక్కిలి ప్రీతి పాత్రమైనది. దీని పండ్ల గుజ్జు బంకలా ఉంటుంది. చాటలకు పూయడానికి వాడతారు.

4. గరిక : ఇది ఎత్తుగా పెరిగే గడ్డి. ఇది ముఖ్యంగా గ్రహణం సమయంలో ఉపయోగిస్తారు. దీనిలో చాలా రకాల ఓషధీ గుణాలు ఉన్నాయి.

5. దుత్తూరు పత్రం : దీనిని ఉమ్మెత ఆకు అంటారు. ఇందులో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్ఠం. ఇది గడ్డలకు వాడడం వలన అవి పగిలిపోయి చీము కారిపోవడానికి ఉపకరిస్తుంది.

6. బదరీ పత్రం : దీనిని రేగి ఆకు పాంరు. ఇది జీర్ణకోశ వ్యాధులను నివారించడంలో ఉపయోగపడుతుంది. రక్త దోషాలను నివారిస్తుంది.

7. అపామార్గ పత్రం : దీనిని ఉత్తరేణి ఆకు అంటారు. ఇది పిం జబ్బులకు మంచి మందులా ఉపయోగపడతుంది.

8. తులసీ పత్రం : దీనిలో విష్ణు తులసి, కృష్ణ తులసి అని ఉంటాయి. ఇది అజీర్ణవ్యాధులకు, కడుపునొప్పికి, చర్మ రోగాలను నివారించడానికి ఉపయోగపడుతుంది.

9. చూతపత్రం : గృహాలంకరణ మొదలు, సర్వమంగళ కార్యాలలో దీనిని తోరణంగా ఉపయోగిస్తారు. దీనినే మామిడాకు అంటారు.

10. కరవీర పత్రం : దీనినే గన్నేరు ఆకు అంటారు. ఇది కంతులను కరిగిస్తుంది. గడ్డలను రానీయకుండా చేస్తుంది.

11. విష్ణుక్రాంత : ఇది గడ్డి నేలల పైకి పాకుతూ పెరుగుతుంది. దీని కషాయం పైత్య జ్వరాలకు ఉపయోగిస్తారు.

12. దాడిమీపత్రం : దీనిని దానిమ్మ పత్రం అంటారు. ఇది వగరుగా ఉండే మంచి ఔషధం. జీర్ణకోశ వ్యాధుల్లో దీనిని ఉపయోగిస్తారు.

13. దేవదారు పత్రం : దీని లేత చిగుళ్ళు మేహశాంతిని కలిగిస్తాయి.

14. మరువక పత్రం : దీనిని మరువం అని కూడా అంటారు. స్త్రీలు తలలో పూలతోపాటుగా మాలగా కట్టి దీనిని ధరిస్తారు.

15. సింధూర పత్రం : దీనిని వావిలాకు అంటారు. దీని కషాయం జ్వరాలకు, కీళ్ళవాపులకు ఉపయోగిస్తారు.

16. జాజి ఆకులు : ఇవి వాతానికి, పైత్యానికి ముందుగా ఉపయోగపడుతాయి. జీర్ణాశయ మలాశయ రోగాలకు చక్కి మందు.

17. గండకీ పత్రం : దీనిని వినాయక పత్రం అని కూడా అంటారు. ఇది కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది.

18. శమీపత్రం : దీనినే జమ్మి ఆకు అని అంటారు. ఇది కఫాన్ని హరిస్తుంది. కుష్టువ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. ఈ ఆకునే విజయదశమి రోజున బంగారం అనే పేరుతో పిలిచి అందరికీ ఇచ్చి నమస్కారం చేస్తారు.

19. అశ్వత్థ పత్రం : దీనిని రావి ఆకు అంటారు. ఇది జ్వరాలకు, నోటి పూతలకు మందుగా ఉపయోగపడుతుంది.

20. అర్జున పత్రం : దీనిని మద్దియాకు అంటారు. ఇది చెవి నొప్పులను తగ్గిస్తుంది. దీని ఆకుల రసం రుమాటిక్‌  నొప్పులకు ఉపయోగిస్తారు.

21.అర్కపత్రం : దీనిని జిల్లేడు అని అంటారు. దీని ఆకులతో క్టుటిన విస్తరిలో భోజనం చేస్తే విషాన్ని హరిస్తుందని ఆయుర్వేద గ్రంథం చెబుతోంది. తగిన వైద్యుని సలహా లేకుండా జిల్లేడు ఆకులను అజాగ్రత్తగా వాడతారు.

పూజలో ఉపయోగించే ఈ 21 పత్రాలు మంచి ఔషధీయ గుణాలు ఉన్నాయనడంలో ఎలాటి సందేహంలేదు.  ఆనాటి మన సామాజిక స్థితుగతులను జ్ఞప్తికి తీసుకుంటే ఈ పత్రాల ప్రాధాన్యం తెలుస్తుంది. పూర్వం రోజుల్లో చెరువులు, బావులు, నదులు వర్షాధారం. ఇవి మాత్రమే అందరికీ అందుబాటులో ఉండేవి. అక్కడక్కడ నదులే కదా ! ఈ జలాశయాల్లోని నీళ్ళు శుభ్రపడానికి ఉపయోగపడే విధంగా వినాయక పూజకు ఈ 21 ఔషధీ పత్రాలను నిర్ణయించి వాటిని జలాశయాల్లో నిమజ్జనం జరిగే విధంగా పూజా విధానాలను రూపొందించారు.

వీటిలో గరిక చాల ప్రధానమైనది. ఈ గరిక గురించిన వివరాలు తరువాత ....

ఏషియానెట్ రీడర్‌లకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

Follow Us:
Download App:
  • android
  • ios