Zodiac Signs: హోళీ తర్వాత ఈ 3 రాశుల వారికి కష్టాలు, నష్టాలే..!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పులు అన్ని రాశుల వారికి మంచి, చెడు ఫలితాలను ఇస్తాయి. హోళీ పండుగ తర్వాత రాహు, కేతువు, శని గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంది. ఆ రాశులెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు కేతు, శని గ్రహాలకి శాస్త్రాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మూడు గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిచక్రాల్ని, నక్షత్రాల్ని మారుస్తూ ఉంటాయి. దీనివల్ల 12 రాశుల జీవితాల మీద ప్రభావం పడుతుంది. ఈ సంవత్సరం హోళీ పండుగని మార్చి14న జరుపుకుంటారు. ఆ తర్వాత ఈ మూడు గ్రహాలు కాలానుగుణంగా సంచారిస్తాయి.
పంచాంగం ప్రకారం మార్చి 16, 2025 సాయంత్రం 6:50కి రాహువు పూర్వ భాద్రపద నక్షత్రం నాలుగో పాదంలో, కేతువు ఉత్తర ఫల్గుణి నక్షత్రం రెండో పాదంలోకి మారుతాయి. నెల చివరిలో అంటే మార్చి 29, 2025 రాత్రి 11:01కి శని దేవుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దానివల్ల 3 రాశులవారిపై చెడు ప్రభావం పడుతుంది. ఆ రాశులెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి
జ్యోతిష్యం ప్రకారం రాహు-కేతువు, శని సంచారం వృషభ రాశి వాళ్ల జీవితం మీద చెడు ప్రభావం చూపిస్తుంది. ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి. ఫలితంగా వాళ్ల మనసు బాగోదు. యంగ్ స్టర్స్ కి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కెరీర్ గురించి దిగులు ఉంటుంది. 60 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు కడుపు నొప్పితో బాధపడతారు.
ధనుస్సు రాశి
రాహు, కేతువు, శని కదలికల్లో మార్పుల వల్ల ధనుస్సు రాశి వాళ్లు సమస్యలు ఎదుర్కొంటారు. కెరీర్ లో ఎదగడానికి అవకాశాలు రావు. దీనివల్ల మనసు కలత చెందుతుంది. వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతారు. అప్పు కూడా చేయాల్సి వస్తుంది. పోయిన సంవత్సరం ఏదైనా పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుంచి పెద్దగా లాభం వచ్చే అవకాశం లేదు.
కుంభ రాశి
వృషభం, ధనుస్సు రాశులే కాకుండా రాహు, కేతువు, శని సంచారం కుంభ రాశి వాళ్ల మీద కూడా నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంత బాగుండదు. హోళీ తర్వాత వ్యాపారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు సహా ఉద్యోగులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఆఫీస్ పని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది.