Asianet News TeluguAsianet News Telugu

Ugadi 2022: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో వృషభ రాశివారి జాతకం..!

శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో వృషభ రాశి వారి జాతకం ఇలా ఉంది.  వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పెరుగును. బదిలీలు గోచరిస్తున్నాయి. లాభస్థాన ఫలితంగా ప్రభుత్వ సహకారం లభిస్తుంది. శత్రువులను జయిస్తారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. 

Ugadi Horoscope Of Taurus in 2022
Author
Hyderabad, First Published Mar 26, 2022, 3:36 PM IST

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి

వృషభరాశి వారికి శుభకృత్  నామ సంవత్సరంలో ఆదాయం 08 - వ్యయం 08

రాజపూజ్యం: 06 - అవమానం: 06

వృషభరాశి వారికి  శుభకృత్ నామ సంవత్సరంలో 

* గురుగ్రహ ఫలితాలు :- వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పెరుగును. బదిలీలు గోచరిస్తున్నాయి. లాభస్థాన ఫలితంగా ప్రభుత్వ సహకారం లభిస్తుంది. శత్రువులను జయిస్తారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. అన్నీ పనులలో జయం కలుగుతుంది. కొత్త వ్యాపారాలు చేయుటకు అనుకూలంగా ఉంటుంది.   
 
* శని "దేవుని " గ్రహ ఫలితాలు:- నవమ భావంలో శని వలన బంధువుల మరణం  కారణంగా దు:ఖం, దీర్ఘవ్యాదుల బాధలు, కుటుంబ సభ్యులు అంతులేని కోరికలు కోరుతారు. ఋణాల ఒత్తిడి. వృత్తి ఉద్యోగాలలో మార్పులు. ప్రతి పనిలో వ్యతిరేఖతలు ఎదురవుతాయి. నిరుత్సాహం, ధనవ్యయం, మనో:క్లేశం కలుగుతుంది.  

* రాహువు ఫలితం:-ప్రతి కార్యంలో చిక్కులు చికాకులు, రావలసిన డబ్బు సమయానికిరాదు. కంటి సమస్యలు. అధికారులతో అభిప్రాయభేదాలు.  

కేతువు ఫలితం:- శరీర ఆరోగ్యం కుదుటపడుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రతి పనిని బుద్ధి బలంతో సాధిస్తారు. విద్యార్ధులకు అనుకూలం. 

ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి

చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు వున్నాయి

ధన ప్రాప్తి బాగుంటుంది

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది

ఉద్యోగులు శుభ వార్తలు వింటారు

సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో విదేశీయానం అవకాశాలు మెరుగవుతాయి

వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి

తొందరపాటుతనం మానుకోవాలి

పట్టుదలతో పనులు చేయాలి

కొత్త పరిచయాలు మానుకోవడం ఉత్తమం

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు రుద్ర నమక చమక పారాయణం చేయండి. ఈశ్వర ఆరాధన చేయడం మంచిది. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు..   ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు..  మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య 


 

Follow Us:
Download App:
  • android
  • ios