Asianet News TeluguAsianet News Telugu

శ్రీ శోభకృత్ నామ సంవత్సర: మకర రాశి వారి తెలుగు పంచాంగ సంవత్సర ఫలాలు

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ప్రకారం కుంభ రాశి వారికి ఈ ఏడాది  వ్యాపారం నందు పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు.కొన్ని సంఘటనలు వలన భయాందోళనలు చెందుతారు 

Ugadi 2023 telugu panchangam rasi phalalu of Aquarius
Author
First Published Mar 21, 2023, 3:03 PM IST


కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  ఈ సంవత్సరంలో  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి   ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ సంవత్సర ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
ఆదాయం:-11
వ్యయం:-5
రాజపూజ్యం:-2
అవమానం:-6

గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి ద్వితీయ స్థానం నందు సంచరించి ఏప్రిల్ 21 నుండి తృతీయ స్థానం నందు సంచరించును.

శని:- ఈ సంవత్సరం అంతా జన్మరాశి నందు సంచరించిను.( ఏలినాటి శని)

రాహు:-సంవత్సర ప్రారంభం నుండి తృతీయ స్థానం నందు సంచరించి అక్టోబర్ 31 నుండి ద్వితీయ స్థానము నందు సంచారం.

కేతువు:-సంవత్సర ప్రారంభం నుండి భాగ్యస్థానమునందు సంచరించి అక్టోబర్ 31 నుండి అష్టమ స్థానము నందు సంచరించును.
ఏలినాటి శని ప్రభావం చూపుతుంది.  ఆచితూచి మాట్లాడడం వలన అన్ని విధాలుగా బాగుంటుంది. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు . మనసునందు  ఆందోళనగా ఉంటుంది. బంధువుల తోటి మనస్పర్ధలు రాగలవు. తలపెట్టి పనులలో ఆటంకాలు.  దురాలోచనలకు దూరంగా ఉండండి.  ఇతరులతోటి వాదనలు తగ్గించుకోవాలని. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా మెలగండి.  చేయ వృత్తి  యందు సామాన్యంగా ఉంటాయి . వ్యాపారం నందు పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు.కొన్ని సంఘటనలు వలన భయాందోళనలు చెందుతారు . మీరు నమ్మిన వారవలనే మీకు మెసగించ బడతారు.  కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. వివాహ శుభ కార్యక్రమాలలో నిరాశ ఏర్పడును .  గృహ స్థిరాస్తి సంబంధించిన విషయాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగము నందు అధికారులతోటే సమస్యలు పెరగగలవు. చేతి వృత్తి వారు రాణిస్తారు.చేయపనయందు శారీరక శ్రమ పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగును. తలపెట్టిన పనులలో అవాంతరాలు ఏర్పడగలవు. సంవత్సర ప్రధమార్ధంలో రాహుబలం చేత శుభ ఫలితాలు పొందగలరు. నవంబర్ నుండి కొద్దిగా ఇబ్బందులు ఎదురవగలవు కావున ఈసంవత్సరం ఈ రాశి వారు మే నెలలో గురు శని గ్రహ జప దానములు ఏకాదశరుద్రాభిషేకము మరియు సుందరకాండ పారాయణ చేయవలెను. నవంబర్ యందు రాహు కేతు జపదానములు చేయుట ఉత్తమం. అలాగే శనివారములు నియమాలు చేయుట మంచిది.


 
 ఈ రాశివారి మాసవారీ ఫలితాలలోకి వెళితే... 
  

మే
చేయ పనులలో అనవసరమైన పట్టుదల వదిలినట్టయితే పనులు సజావుగా సాగును. మిత్రుల వలన అపకారం జరిగే అవకాశం. బందు వర్గం తోటి భిన్నాభిప్రాయాలు రాగలవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. సంతానం తోటి విరోధం. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మనసునందు భయాందోళనగా ఉండుట. ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడగలవు.

జూన్
బంధు వర్గం తోటి సహాయ సహకారాలు లభిస్తాయి. చేయ పనులలో బుద్ధి కుశలత ఏర్పడి  పనులన్నీ సకాలంలో పూర్తగును. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదయాత్రలో చేస్తారు. ఉద్యోగమునందు అనుకూలమైన అధికార వృద్ధి కలుగును. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ప్రతి సమస్యను  పరిష్కరించి కోని ముందుకు సాగుతారు.

జూలై
సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభించును. మనసునందు ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు యందు లాభం చేకూరుతుంది. చేయ వ్యవహారము నందు విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. గృహవనందు శుభకార్యా చరణ. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

ఆగస్టు
శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. వృత్తి  వ్యాపారాలు సంతృప్తికరంగా నుండును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలం అగును. జీవిత భాగస్వామితోటే అకారణంగా విరోధం ఏర్పడవచ్చు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణ. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తిగాక చికాకు పుట్టించును.

సెప్టెంబర్
పనులలో ఆతురత. సమాజము నందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. మానసిక వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. శారీరకంగా మానసికంగా బలహీనత. ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారమునందు ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది.

అక్టోబర్
మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. అనారోగ్య భయాలు ఏర్పడతాయి. సంతానక మూలక లాభాలు పొందగలరు. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందగలరు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరం.

నవంబర్
గృహమున శుభకార్యము నిర్వహిస్తారు.అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. సంతాన వృద్ధి. ఆర్థిక ఆరోగ్య విషయాల యందు అనుకూలంగా నుండును. విద్యార్థులు పరీక్షల యందు ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. మిత్రుల తోటి చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడగలరు. వృత్తి వ్యాపారములు రాణించగలవు.

డిసెంబర్
అన్ని విధాల లాభం చేకూరును. కుటుంబమునందు సంతోషకరమైన విషయాలతోటి ఆనందకరముగా ఉండును. చేయ పని యందు ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పూర్తి చేయవలెను. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడుపుతారు. మన శాంతి లభిస్తుంది.

జనవరి
వృత్తి వ్యాపారములు లాభసాటిగా ఉండును. ఉద్యోగ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలించెను. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు.

ఫిబ్రవరి
సమాజము నందు అవవాదములు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థిక సమస్యలు పెరుగును. బందువర్గముతోటి మాట పట్టింపులు రావచ్చు. శత్రు బాధలు. గృహమునందు ప్రతికూలత వాతావరణ. మానసిక ఉద్రేకత పెరుగుట. అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. ఉద్యోగము నందు అధికారులతో సమస్యలు ఏర్పడగలరు. భూ గృహ కొనుగోలు చేస్తారు.

మార్చి
గ్రహ సంచారముఅనుకూలంగా లేదు. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామి తోటి అకారణ కలహము ఏర్పడవచ్చు. సమాజము నందు ప్రతికూలత వాతావరణం. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఋణము చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతోటి విరోధం ఏర్పడవచ్చు. ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
 

Follow Us:
Download App:
  • android
  • ios