Asianet News TeluguAsianet News Telugu

Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మీ రాశిఫలాలు ఎలా ఉన్నయ్ అనేది ఇప్పుడు తెలుసుకోండి. ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీకు మంచి జరుగుతుందో తెలుసుకోండి. 
గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ, 
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com
 

ugadi 2022 Horoscope of Subhakruth nama Rashi phalalu full details inside
Author
Hyderabad, First Published Apr 2, 2022, 12:02 PM IST


మేషం
ఆరోగ్యం
మేష రాశివారికి ఈ సంవత్సరం ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 12 నుంచి గురువు పన్నెండవ ఇంటిలో మరియు 13వ తేదీ నుంచి రాహువు జన్మ రాశిలో, కేతువు ఏడవ ఇంటిలో సంచరించడం వలన ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల మరియు మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో అలాగే మానసిక ఆందోళన విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.  ఏ విషయం  లో అయినా ఆవేశానికి గురి కాకుండా శాంతంగా ఉండి మీ మానసిక ఆందోళనలను పెంచుకోకుండా ఉండటం మంచిది.  జన్మస్థానంలో రాహు సంచారం కారణంగా  మానసిక ఆందోళన ఆవేశం పెరిగే అవకాశం ఉంటుంది.  పన్నెండవ ఇంటిలో గురువు  గోచారం కారణంగా రక్తము మరియు, వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాషముంటుంది కనుక, మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా జూలై మరియు జనవరి మధ్య కాలంలో, మీరు శారీరక రుగ్మతలు మరియు మానసిక ఉద్రిక్తతతో బాధపడాల్సి రావచ్చు. ఆరోగ్య విషయంలో ఆవేశానికి లోను కాక పోవటం, ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.  మీ ఆవేశం మీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అన్న విషయాన్ని ఈ సంవత్సరమంతా గుర్తుపెట్టుకోండి. 

ఆర్థిక స్థితి
ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది.  ఈ సంవత్సరం గురువు పన్నెండవ ఇంటిలో సంచరించడం వలన ఆర్ధిక స్థితి లో మార్పులు చోటు చేసుకుంటాయి.  విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం వలన ఆర్థికంగా గా కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంటుంది.  అయితే జూలై వరకు శని గోచారం అనుకూలంగా ఉండటంతో ఈ సమస్య మిమ్మల్ని పెద్దగా బాధించదు.  కానీ జూలై తర్వాత మీ  ఖర్చుల విషయంలో అదుపు లేకపోతే ఆర్థిక సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంటుంది.  అంతే కాక ఇతరుల మాటలు విని లేదా గొప్పలకు పోయి అప్పు తీసుకొని మరీ శుభ కార్యాలు పూర్తి చేయడం లేదా దానధర్మాలు చేయడం చేస్తారు. ఆర్థికంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండాలి అంటే వీలైనంతవరకు గొప్పలకు పోకుండా అలాగే ఒకటికి రెండుసార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయడం మంచిది.  ఎందుకంటే గురు లాభంలో ఉన్నప్పుడు వచ్చిన డబ్బులు లేదా పెట్టుబడుల కారణంగా వచ్చిన లాభాలను అనవసరంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. 


ఉద్యోగం
సంవత్సర ఆరంభంలో బృహస్పతి 12 వ ఇంటికి మారడంతో, వృత్తి విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మొదటి ఇంటిపై రాహువు సంచారం మిమ్మల్ని మరింత మొండివారిగా, అహంభావులుగా మారుస్తుంది. ప్రతి విషయంలో ఎక్కువ పట్టుదలకు పోవటం, పోరాడాలని చూడటం చేస్తుంటారు. ఈ సంవత్సరమంతా శని గోచారం 10 వ మరియు 11 వ ఇళ్లలో ఉండటం వలన వృత్తిలో అభివృద్ధిని, పేరుప్రతిష్ఠలను పొందుతారు. మీరు ఇతరులతో ప్రవర్తించే విధానంలో జాగ్రత్త వహించటం మంచిది. మీకు వచ్చిన విజయాలు మీకు గర్వాన్ని అహంభావాన్ని ఇవ్వటం వలన మీరు ఇతరులతో దురుసుగా ప్రవర్తించే అవకాశముంటుంది. ఇది మీ వృత్తిలో అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యను కలిగిస్తుంది కనుక మీరు మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కొత్త ఉద్యోగం కోసం లేదా, మీ ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు జులై మధ్యన లేదా సంవత్సరం చివరలో అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. విశ్రాంతి లేని మీ పని కారణంగా మీకు చాలా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. మీ అహం కారణంగా  మీరు ఒకేసారి అనేక పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. దాని కారణంగా మీరు వాగ్ధానం చేసిన పనిని సకాలంలో పూర్తి చేయక పోవచ్చు కనుక ఇది మీ కెరీర్ లో మీకు సమస్యను కలిగించవచ్చు. కొన్ని సార్లు మీరు అత్యాశకు లోనవటం మరియు తక్కువ సమయంలో పేరు మరియు కీర్తిని పొందడానికి ప్రయత్నిస్తారు. మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధించడానికి మీరు స్వయంకృషిని నమ్ముకోవాలి తప్ప ప్రయత్నం లేకుండా కేవలం అదృష్టం తో సాధించాలని చూడకండి. 

వ్యాపారం మరియు స్వయం ఉపాధి
ఈ సంవత్సరం శని గోచారం పదవ మరియు పదకొండవ ఇళ్లలో ఉంటుంది. దీని వల్ల మీకు జీవితంలో పురోగతి ఉంటుంది. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాన్ని పొందుతారు మరియు దానిలో  అభివృద్ధిని సాధిస్తారు. అయితే సంవత్సరమంతా  గురువు    పన్నెండవ    ఇంటిలో సంచరించడం,  కేతువు ఏడవ ఇంటిలో సంచరించడం కారణంగా వ్యాపారంలో మరియు  ఆర్థికంగా కొంత సమస్యకు గురయ్యే అవకాశం ఉంటుంది.  భాగస్వాముల మధ్య  మనస్పర్థలు ఏర్పడడం వలన వ్యాపారంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో తిరిగి వత్సరాంతంలో శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది.  వ్యాపార విషయంలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపార విషయంలో  తొందర పడకుండా ఆలోచనతో  ముందడుగు వేయడం మంచిది. రాజకీయాల్లో  ఉన్నవారికి ద్వితీయార్థంలో ముఖ్యమైన స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి మరియు దీనికి సంబంధించి, మీరు కొంతమంది రాజకీయ ప్రముఖులను కలుస్తారు.  కళాకారులు అలాగే  స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.  కొన్ని సార్లు అనాలోచిత చర్యల కారణంగా మంచి అవకాశాలను కోల్పోతారు.  మీ ప్రవర్తన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.  మీరు లేని గొప్పతనాన్ని ఆపాదించు కోవడం కానీ లేదా అహంకారంతో వచ్చిన మంచి అవకాశాలను వదిలించుకోవడం కానీ చేసే అవకాశం ఉంటుంది.  ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయండి. 


కుటుంబం
ఈ సంవత్సరమంతా గురువు, రాహువు మరియు కేతువుల గోచారం అనుకూలంగా లేకపోవడం అలాగే సప్తమ స్థానంపై శని దృష్టి కారణంగా  మీ జీవిత భాగస్వామితో మీకు మనసు పడే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా మీ అతి జాగ్రత్తవల్ల  కానీ, మీ అహంభావం వల్ల  కానీ మీ జీవిత భాగస్వామికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటుంది.  వారిపై పెత్తనం చెలాయించాలని అనుకునే బదులు వారిని అర్థం చేసుకుని మెలగడం మంచిది. గురువు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన మీ సంతానంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  వారి విషయం లో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడటం వలన  కలిగే   అసహనం మీ కుటుంబం పై  చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.  దాని కారణంగా మీ కుటుంబంలో మీ పై ఉన్న గౌరవమర్యాదలు తగ్గటం లేదా మిమ్మల్ని లక్ష్యపెట్టక పోవటం జరగవచ్చు.  వీలైనంత వరకు చెప్పుడు మాటలు  వినకుండా మీ ఆలోచనలను ఇతరులు ప్రభావితం చేయకుండా చూసుకోవడం  వల్ల  మీరు మీ ఇంటిలో ఆనందంగా ఉండగలుగుతారు. సప్తమంలో కేతు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే జూలై వరకు సమయం అనుకూలంగా ఉండటం వలన వారి విషయంలో ఎక్కువ ఆందోళన అవసరం లేదు. ఈ సంవత్సరం కొత్త పరిచయాలు స్నేహాలు ఏర్పడతాయి అలాగే పాత స్నేహితుల్లో   కొంత మందిని  కోల్పోవడం జరుగుతుంది. 


వృషభ
ఉద్యోగం
వృషభ రాశిలో జన్మించిన వారికి, ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది.  ముఖ్యంగా గురు, శని, అలాగే కేతువు గోచారం అనుకూలంగా ఉండటం వలన, మీరు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది.  వృత్తిలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పులను ఈ సంవత్సరం పొందుతారు.  మీరు అనుకున్న  ఏ విధమైన అభివృద్ధిని సాధిస్తారు.  మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది.  అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. పదవ ఇంటిలో గురువు గోచారం కారణంగా  ఏప్రిల్ వరకు వృత్తిలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఏప్రిల్లో గురువు పదకొండవ ఇంటికి రావడంతో   మీరు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.  మీరు చేసే పనికి గుర్తింపు రావడమే కాకుండా గతంలో మిమ్మల్ని విమర్శించిన వారు కూడా మెచ్చుకుంటారు.  మీరు ప్రభుత్వ లేదా ఇతర సంస్థల నుంచి అవార్డులను, రివార్డులను పొందే అవకాశం ఉంటుంది.  గతంలో మీరు కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు రాలేదని బాధపడిన విషయాల్లో ఇప్పుడు అనుకున్న విధంగా గుర్తింపు రావడమే కాకుండా అది మీ వృత్తి అభివృద్ధిలో  తోడ్పడుతుంది.  అయితే రాహు గోచారం అనుకూలంగా లేనందువలన మీకు లభించిన విజయాలను చూసి గర్వం పెరగడం కానీ లేదా కొన్ని విషయాల్లో తల బిరుసు గా ప్రవర్తించడం కానీ చేస్తారు దాని వలన అనుకోని శత్రువులను కానీ సమస్యలు కానీ కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీరు సాధించిన విజయాలు మిమ్మల్ని మరింత ముందుకు పోయేలా చేయాలి తప్ప  వెనకడుగు వేసేలా చేయకూడదు.  మీ  అసహనాన్ని,  కోపాన్ని లేదా మొండి స్వభావాన్ని తగ్గించుకొని వినయంతో వెళ్ళినప్పుడే మరింత మందికి చేరువవుతారు.  ఈ సంవత్సరమంతా  రాహువు 12వ ఇంటిలో సంచరిస్తాడు కాబట్టి  ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.  ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు, లేదా వారి అవసరం కొరకు మీ చుట్టూ చేరే వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా జూలై, డిసెంబర్ మధ్య వక్రగతుడైన శని గోచారం  తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన విదేశీ ప్రయత్నాల విషయంలో  కొంత జాగ్రత్తగా ఉండాలి.  తప్పుడు సమాచారం కారణంగా కానీ లేదా ఇతరులు మోసం చేయడం వల్ల గాని మీరు నష్టపోవడం జరుగుతుంది. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమస్య నుంచి కొంత ఆలస్యంగానైనా బయటపడే అవకాశం ఉన్నది. కొత్త కోర్సులు లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం వలన ఉద్యోగంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది.   12వ ఇంటిలో రాహు గోచారం కారణంగా కొంత బద్ధకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అకారణంగా ముఖ్యమైన పనులను వాయిదా వేయడం చేస్తారు లేదా  అసమర్థులైన వారికి ఆ పనిని అప్పగించి తర్వాత బాధ పడతారు.  ఈ సంవత్సరంలో మీకు వచ్చిన విజయాలను మీరు పూర్తిగా అనుభవించాలంటే ఈ బద్ధకాన్ని అలాగే నిర్లక్ష్యాన్ని వదిలేయడం మంచిది. 

ఆరోగ్యం
 వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయానికొస్తే గురువు మరియు కేతువు గోచారం అనుకూలంగా ఉండటం వలన కొన్ని  చిన్న, చిన్న ఆరోగ్య సమస్యలకు  మినహా, ఈ సంవత్సరం అంతా బాగుంటుంది.   అయితే సంవత్సరమంతా రాహువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి  మెడ,  కడుపు మరియు  నరాలకు  సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. వీలయినంత వరకు శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం వలన చాలావరకు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు వచ్చే అనారోగ్య సమస్యలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉండవు.  ఆరోగ్య సమస్యలు వచ్చిన కొద్ది రోజుల్లోనే తగ్గుముఖం పడతాయి.  అంతేకాకుండా, ఈ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా  మీరు తీసుకునే  జాగ్రత్తలు భవిష్యత్తులో  మిమ్మల్ని పెద్ద అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతాయి.  మంచి ఆరోగ్యపు అలవాట్ల తో పాటుగా దైవారాధన చేయటం వలన ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడకుండా ఉంటారు.

కుటుంబం
కుటుంబ పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు లాభ స్థానంలో సంచరించటం వలన కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.  ఇంటిలో శుభకార్యాలు జరగడం వలన,  బంధుమిత్రుల రావటంతో గతంలో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.  అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన  అపోహలు కూడా తొలగిపోతాయి.  ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అవ్వటం,  అలాగే సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి సంవత్సర ద్వితీయార్ధంలో  సంతానం కలుగుతుంది.  సంవత్సర ద్వితీయార్ధంలో మీ పిల్లలు వారి వారి రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు.  గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.  మీ మిత్రులు మరియు బంధువుల సహకారంతో చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక ముఖ్యమైన సమస్యలు తొలగించుకో కలుగుతారు.  సంవత్సర  ద్వితీయార్ధంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు.  మీ ఆనందం కొరకై మీ శక్తికి మించి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.  ఈ సంవత్సరం  ద్వితీయార్ధంలో ఆధ్యాత్మికంగా మంచి ప్రగతి సాధించడం కానీ లేదా పుణ్య క్షేత్ర సందర్శన కానీ చేస్తారు. అంతేకాకుండా నూతన గృహప్రవేశం కానీ లేదా వాహనం కొనుగోలు చేయడం కానీ చేస్తారు.

ఆర్థిక స్థితి
 వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు గోచారం సంవత్సరమంతా అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు రావడంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి, కొత్తగా పెట్టిన పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటుతో కానీ ఇతరుల మాటలు విని కానీ పెట్టుబడులు పెట్టకండి. గురు గోచారం బాగున్నప్పటికీ రాహు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వచ్చిన లాభాలు అనవసరమైన పెట్టుబడుల కారణంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని దృష్టి ఏడో ఇంటిపై 12వ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉంటుంది కాబట్టి స్థిరాస్తుల కొనుగోలు విషయాల్లో, కొత్త ఒప్పందాలు చేసుకోవడం విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. పన్నెండో ఇంటిపై శని దృష్టి కారణంగా, అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కానీ, పెట్టిన పెట్టుబడి వ్యర్థం అవ్వడం కానీ జరగవచ్చు. మీ పెద్దల లేదా అనుభవజ్ఞుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టడం కానీ లేదా పెట్టుబడి పెట్టే సమయంలో వారి సలహాను కూడా దృష్టిలో పెట్టుకోవడం వలన నష్టాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ సంవత్సరం గృహ, వాహనాదుల కొనుగోలు చేయటం చేస్తారు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే జులై తర్వాత పెట్టడం మంచిది. జూలై వరకు శని మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి, పెట్టుబడుల విషయంలో తప్పుడు సలహాలు పాటించి, లేదా తొందరపడి పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.  

 మిధున రాశి
ఉద్యోగం
ఈ సంవత్సరం మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.   అంతే కాకుండా చేసే పనికి సరైన గుర్తింపు రాకుండా ఉండటం మరియు సహోద్యోగుల నుంచి వ్యతిరేకత కాని సరైన సహకారం అందకపోవడం గాని జరగవచ్చు. ఈ సమయంలో మీ సహనాన్ని పరీక్షించే ఈ విధంగా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది వాటిని మీరు విజయవంతంగా ఎదుర్కొంటారు.  మిమ్మల్ని తక్కువ చేసి చూసే వారిని పట్టించుకోక పోవడం వలన వలన మానసికంగా ప్రశాంతతను పొందుతారు. సంవత్సరమంతా గురు గోచారం మధ్యమంగా ఉండటం వలన, మీ పై అధికారుల సహాయం లభించడమే కాకుండా, దైవానుగ్రహం కారణంగా కూడా, మీకు ఏర్పడిన సమస్యల నుంచి బయట పడగలుగుతారు.  ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి లేదా కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.  విదేశాలలో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది.  సంవత్సరం మధ్యలో శని దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీ పని విషయంలో,  మీ ప్రవర్తనలో, ఇతరుల ప్రభావం అధికంగా ఉంటుంది దానివలన,  మీరు తరచుగా అసహనానికి, కోపానికి గురవుతారు. చేసే పనిలో అడ్డంకులు  ఎదురవడం,  పనులు ఆలస్యంగా జరగటం మొదలైనవి జరిగినప్పటికీ,  మొదలుపెట్టిన పనులను సహనంతో పూర్తి చేయగలుగుతారు.  కొన్నిసార్లు ఇతరుల ప్రలోభాలకు లోనై తప్పులు చేసినప్పటికీ,  తొందరగానే  వాటిని సరిదిద్దుకో గలుగుతారు.  సంవత్సరమంతా రాహుగోచారం అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.  గతంలో ఉన్న మానసిక సమస్యలు,  ఆందోళనలు తొలగిపోయి ఉత్సాహంతో  పనులు పూర్తి చేయగలుగుతారు.   పదవ గురువు గోచారం కారణంగా  వృత్తి లో మార్పులు చోటు చేసుకుంటాయి.  పదోన్నతి పొందడం కానీ,  వేరే వృత్తిలోకి మారడం కానీ జరుగుతుంది.  దీని వలన గతంలో ఉన్న పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది.  విశ్రాంతి సమయం దొరుకుతుంది.  గతంలో ఏర్పడిన  అవమానాలు కానీ,  పుకార్లు కానీ తొలగిపోయి మీ నిజాయితీ నిరూపించబడుతుంది.  మీ సహోద్యోగులు సహాయ సహకారాలు తిరిగి పొందగలుగుతారు.  జూలై తర్వాత వక్రగతుడైన శని  అష్టమ స్థానంలో తిరిగి సంచరించడం వలన వృత్తిలో కొన్ని మార్పులు చోటు చేసుకొని అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది.  అయితే ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు.

ఆర్థిక స్థితి
 మిధున రాశిలో జన్మించిన వారికి, సంవత్సరమంతా రాహువు 11వ ఇంటిలో సంచరించటం.  ధన స్థానంపై గురు దృష్టి ఉండటం వలన ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.  డబ్బు ఖర్చు చేసినప్పటికీ తగినంత ఆదాయం ఉండటం వలన ఆర్థిక పరిస్థితి దిగజారి పోదు.  అయితే శనిగోచారం అనుకూలంగా లేకపోవటం వలన తొందరపడి  పెట్టుబడి పెట్టి వాటి వలన ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడుల విషయంలో  ఆచితూచి అడుగు వేయడం మంచిది.   గతంలో మీరు పెట్టిన పెట్టుబడి నుంచి ఈ సమయంలో మంచి లాభాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండగలుగుతారు.  అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఇల్లు కాని, వాహనం కానీ, కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ జూలై మధ్యలో శని గోచారం కూడా కొంత అనుకూలంగా ఉండటం వలన గతంలో నష్ట పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.  ఈ సంవత్సరం ప్రయాణాల కారణంగా కూడా మీరు డబ్బు ఖర్చు చేస్తారు. లాభ స్థానంలో రాహు సంచారం ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా ఆర్థికంగా మెరుగైన పరిస్థితిని పొందుతారు.  గతంలో చేసిన అప్పులు కానీ,  లోన్లు కానీ ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో తీర్చ గలుగుతారు.
 
ఆరోగ్యం
 ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంత మెరుగుగా ఉంటుంది. సంవత్సరమంతా రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ, వాటిని తట్టుకునో శక్తిని కలిగి ఉంటారు. అష్టమ శని కారణంగా ఎముకలు మరియు మూత్ర పిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.  గురు దృష్టి రోగస్థానంపై ఉండటం వలన పైన చెప్పిన సమస్యల్లో చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టక పోవచ్చు.  సంవత్సరమంతా రాహుగోచారం 11వ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన అది మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది.  ద్వితీయార్ధంలో అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ, అది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేయదు. ఆరోగ్య విషయంలో, ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తలు పాటించడం,  బయట  భోజనాలు ఎక్కువ చేయకపోవడం, అలాగే శారీరక వ్యాయామాలు,  యోగా, ధ్యానం మొదలైనవి చేయటం వలన మిమ్మల్ని మీరు  రక్షించుకో గలుగుతారు.

కుటుంబం
కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరమంతా రాహు గోచారం అనుకూలంగా ఉండటం అలాగే గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన, కుటుంబంలో వృద్ధి జరుగుతుంది, అలాగే ఇంటిలో శుభకార్యాలు జరగడం వలన  గతంలో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి.  మీ మాటకు విలువ పెరగడమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పొందుతారు.  మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగు పడుతుంది.  మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ప్రథమార్ధంలో మీ సోదరులు  లేదా మీ బంధువుల కారణంగా ఒక సమస్య నుంచి బయట పడగలుగుతారు.  మీ కుటుంబ సభ్యులతో కలిసి  విహారయాత్ర కానీ,  ఆధ్యాత్మిక ప్రదేశ  సందర్శనం కానీ చేస్తారు.  ఏప్రిల్ మరియు జులై మధ్యలో శని గోచారం తొమ్మిదవ ఇంట్లో ఉండటం వలన మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పంచమ స్థానం పై కేతు గోచారం కారణంగా సంతానం కు ఆరోగ్య సమస్యలు కానీ లేదా మనస్పర్థలు గాని  వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ స్థానంపై గురు దృష్టి కారణంగా ఈ సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా తగ్గిపోతాయి. 


కర్కాటక రాశి
 ఉద్యోగము
కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  సంవత్సరమంతా  గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో మరియు వ్యక్తిగత జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు.  ఉద్యోగ పరంగా ఈ సంవత్సరం మధ్యలో మరియు వత్సరాంతంలో కొంత వ్యతిరేక ఫలితాలను పొందుతారు.  ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగంలో ఎక్కువ పని ఒత్తిడి అలాగే చేసిన పనికి సరైన గుర్తింపు లేకపోవడం జరుగుతుంది.  అయితే గురు గోచారం అనుకూలంగా ఉండటం, పదవ ఇంటిలో రాహువు అనుకూలంగా ఉండటం వలన ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు.  ఏడవ ఇంటిలో శని గోచారం  వలన  మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు,  చిరాకు కలిగించే వారు మీ వృత్తి ప్రదేశంలో  ఎక్కువ అవుతారు.  మీ పనికి  బదులు తమ పనిని పూర్తి చేసేలా లేదా మీ సహాయాన్ని ఎక్కువగా వాడుకునేలా మీ పైన  ఒత్తిడి పెంచుతారు.  మీరు వారికి సహాయం చేసినప్పటికీ వారి నుంచి ఎటువంటి కృతజ్ఞత లభించదు అంతేకాకుండా సమయం వచ్చినప్పుడు మీ గురించి చెడుగా చెప్పడం కానీ మీ వృత్తి అభివృద్ధిలో ఆటంకాలు కల్పించడం కానీ చేస్తారు. అయితే సంవత్సరమంతా గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు చెడు చేసే వారిని గుర్తించి వారిని పక్కన పెట్టడం వలన  వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు.  ముఖ్యంగా  గత సంవత్సర కాలంగా మీరు చేసిన పనికి గుర్తింపు లేక ఇబ్బంది పడినప్పటికీ,  ఈ సంవత్సరం  ఆ గుర్తింపు లభించడమే కాకుండా, గతంలో మీరు పైన కష్టానికి ఫలితం కూడా లభిస్తుంది. ఈ సంవత్సరం  విదేశాల్లో ఉద్యోగానికి ప్రయత్నించే వారికి అనుకూలమైన ఫలితం లభిస్తుంది.  కొత్త ప్రాజెక్టులు కానీ,  లేదా కొత్త ఉద్యోగం రావడం కానీ జరుగుతుంది.  దాని వలన మీరు ఆశించిన విజయాలను పొందుతారు.  మీ హోదా లో అభివృద్ధి జరుగుతుంది అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు పొందారు. ఇతరులు చేయని లేదా ఇతరులచే సాధ్యం కాని పనులు చేయటం వలన మీరు మీరు మీ వృత్తిలో అనూహ్యమైన అభివృద్ధిని సాధిస్తారు అంతేకాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు. 

ఆర్థిక స్థితి
 ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.  సంవత్సరమంతా గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం గత సంవత్సరంకంటే ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది.  శని గోచారం కారణంగా కుటుంబ సభ్యుల విషయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పటికీ, ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగా  ఇబ్బందిగా ఉండదు. సంవత్సరమంతా గురుగోచారం 9వ ఇంటిలో ఉండటం వలన అదృష్టం కలిసివచ్చి పెట్టిన పెట్టుబడి నుంచి ఆదాయం రావటం, అలాగే వారసత్వ సంబంధించి ఆదాయం కానీ, ఆస్తిపాస్తులు కానీ, కలిసి రావడంతో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.  అయితే కోర్టు కేసులు గాని లేదా ఇతర వివాదాల కారణంగా ఆర్థికంగా కొంత నష్టపోవాల్సి కూడా ఉంటుంది.  అంతే కాక మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యల కారణంగా లేదా తండ్రిగారి ఆరోగ్యసమస్య వలన డబ్బులు ఖర్చు  చేయాల్సి వస్తుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వాహనం కానీ,  గృహ గృహం కానీ, ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  దైవ కార్యక్రమాలకు కానీ,  శుభకార్యముల విషయంలో కానీ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యం
 ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ప్రథమార్థం కొంత సామాన్యంగా,  ద్వితీయార్ధం వ్యతిరేకంగా ఉంటుంది.  సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఎముకలు,   వెన్నెముక సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.  అయితే సంవత్సరమంతా గురు  గోచారం అనుకూలం గా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ సరైన సమయంలో వైద్యం అందడంతో వచ్చిన ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయట పడగలుగుతారు.  అయితే  మానసికంగా ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు.  ముఖ్యంగా చికిత్స విషయంలో వివిధ రకాల వైద్య పద్ధతులను పాటిస్తూ తొందరగా సమస్య తగ్గాలనే ఆత్రుత  కలిగి ఉంటారు. అలాగే వ్యసనాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళనల కారణంగా వ్యసనాలకు బానిసలుగా అవటం కానీ, కొత్త వ్యసనాలు ఏర్పడటం కాని జరగవచ్చు. ఈ సమయంలో మానసికంగా దృఢంగా ఉండటం అలాగే దైవారాధన చేయటం వలన ఈ సమస్యకు గురి కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. 

కుటుంబం
 కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది.  సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కుటుంబ విషయాల్లో సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహనలోపం ఏర్పడటం,  మనస్పర్థలు ఏర్పడటం దాని కారణంగా  ప్రశాంతత లోపించడం జరుగుతుంది.  ప్రతి విషయంలో మీ మాటకు, మీ పనికి ఎవరో ఒకరు అడ్డుతగలడంతో చికాకుకు  లోనవుతుంటారు.  అంతేకాకుండా మీరు చెప్పిన మాటలు లెక్క చేయకుండా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ,  మీ మాటలు పట్టించుకోకుండా వారు అనుకున్న పనులు చేయడం కానీ చేస్తారు.  దాని వలన ఇంట్లో ఒంటరి అయ్యాననే భావన మీ లో ఏర్పడుతుంది. దీని కారణంగా కొంత అసంతృప్తి కి మానసిక ఆందోళన కి గురవుతారు.  సంవత్సరమంతా తొమ్మిదవ  ఇంటిలో గురువు గోచారం కారణంగా మీకు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వచ్చి గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.  మీ తండ్రిగారి నుంచి కానీ,  కుటుంబ పెద్దల నుంచి కానీ సహాయ సహకారాలు అందుతాయి.  దాని వలన స్థిరాస్తి కొనుగోలు కానీ,  వాహన కొనుగోలు కానీ చేస్తారు.  అంతేకాకుండా మీ పిల్లల వలన కూడా మీ ఆనందం రెట్టింపవుతుంది.  వారి రంగాల్లో వారు సాధించిన విజయాలు మీకు గర్వ కారణం అవుతాయి.  మీ జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోయి ఇంటిలో ప్రశాంతత ఏర్పడుతుంది.  ఒకవేళ మీరు వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లు అయితే ఈ సమయంలో వివాహ యోగం ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో శనిగోచారం ఇంట్లో ఉన్నప్పుడు మీ తండ్రిగారికి అనారోగ్యం ఏర్పడటం కానీ ఈ కుటుంబంలో పెద్దలకు ఆరోగ్య సమస్యలు రావడం కానీ జరుగుతుంది.  అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరగానే ముగిసిపోతుంది.  నాలుగవ ఇంట్లో కేతు గోచారం కారణంగా ఇంటికి సంబంధించి మరమ్మతులు చేయడం కానీ లేదా కొత్త ఇంటికి మారటం కాని చేస్తారు.  సంవత్సరమంతా గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగానే సామరస్య పూర్వంగా పరిష్కారం అవుతాయి. వీటి గురించి ఎక్కువ ఆందోళన పడవలసిన అవసరం లేదు.


సింహరాశి 

సింహ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది,  అలాగే ద్వితీయార్ధంలో కొన్ని ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 
ఉద్యోగం
వృత్తి పరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది.  సంవత్సరం ప్రథమార్ధంలో వృత్తిలో అభివృద్ధి చూడగలుగుతారు.  శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.  మీరు చేసే పనులకు మీ పై అధికారుల మరియు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి.  మీ ఆలోచనలు,  ప్రణాళికలు మీ వృత్తిలో అభివృద్ధికి కారణం అవుతాయి. మీకు చెడు చేయాలనే ఆలోచన ఉన్న వారు కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండి పోతారు. ఈ సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం, సంవత్సరం మధ్యలో మరియు చివరలో శనిగోచారం అనుకూలంగా లేకపోవటం వలన మీ పై అధికారులకు  గతంలో మీపై ఉన్న ప్రేమాభిమానాలు, గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది.  మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావడం సమయానికి పనులు పూర్తి కాక పోవడం వలన మీ పై అధికారుల కోపానికి గురవుతారు.  అంతేకాకుండా రావలసిన ప్రమోషన్ కానీ,  వృత్తిలో మార్పు ఆగిపోవడం లేదా వాయిదా పడడం జరుగుతుంది. మీపై ఈర్ష్య కారణంగా సహోద్యోగులు లేదా రహస్య శత్రువులు మీ గురించి చెడుగా ప్రచారం చేయడం కానీ మీకు హాని చేయాలని చూడటం కానీ చేసే అవకాశం ఉంటుంది.  గతంలో చేసిన విధంగా ఇప్పుడు చేపట్టిన పనులు చేయలేకపోవడంతో  మీరు పనిచేసే ప్రదేశంలో నిరాదరణకు గురవుతారు. అయితే జూలై నుంచి మళ్లీ శని గోచారం అనుకూలంగా రావడం వలన వృత్తిలో ఉండే సమస్యలు తొలగిపోతాయి.  అంతేకాకుండా ఈ సమయంలో వేరే ప్రదేశంలో పని చేయడానికి వెళ్ళవలసి వస్తుంది.  మీకు ఇష్టం కాకపోయినప్పటికీ ఈ పని చేయవలసి వస్తుంది. వృత్తిలో మార్పు కోరుకునేవారు ఆచితూచి అడుగేయటం మంచిది.  ముఖ్యంగా ఏప్రిల్  మరియు జూలై మధ్యలో అలాగే జనవరి తర్వాత  వృత్తి విషయంలో  ఎటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది.  ఈ సంవత్సరం పదోన్నతి కారణంగా పని ఒత్తిడి పెరగడమే కాకుండా ఆ పదోన్నతి ఆర్థికంగా పెద్దగా ఉపయోగపడేదిగా ఉండదు.  అయితే ఈ మార్పు భవిష్యత్తుకు సహాయకారిగా  ఉంటుంది. సంవత్సరమంతా  కేతు గోచారం మూడవ ఇంటిలో  అనుకూలంగా ఉండటం వలన మీకు వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి అవకాశాలు వస్తాయి.  అలా వచ్చిన అలా వచ్చిన సమస్యలను  ధైర్యంగా ఎదుర్కొన గలుగుతారు. 

కుటుంబం
 ఈ సంవత్సరం కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం, సంవత్సర ఆరంభంలో మరియు అంత్యంలో శనిగోచారం అనుకూలంగా లేకపోవటం వలన కుటుంబంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడటం లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరగడం జరగవచ్చు.  మానసికంగా మీలో అశాంతి,  అపనమ్మకం ఎక్కువ అవుతాయి దాని కారణంగా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది.  మీ మాటకు విలువ ఇవ్వడం లేదనే భావన మీ లో ఎక్కువ అవుతుంది. దాని కారణంగా మీ కుటుంబ సభ్యుల పై ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావటం వలన ఇంటిలో ప్రశాంతత లోపిస్తుంది. ఈ సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండి మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలన మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలను  పొందే అవకాశం ఉంటుంది. 
జులై తర్వాత గురు గోచారం అనుకూలంగా లేనప్పటికీ,  శని గోచారం బాగుండటం వలన కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి.   మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి లభిస్తుంది.  అలాగే మీ వారసత్వ  ఆస్తులు కానీ,  కోర్టు తదితర వివాదాల కారణంగా ధనా దాయం కానీ లభిస్తుంది. మీ సంతానం కారణంగా మీకు ఆనందం లభిస్తుంది. వారు వారి, వారి రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. 

ఆర్థిక స్థితి
 ఈ సంవత్సరం సింహ రాశి వారికి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఆర్థికంగా సమస్యాత్మకంగా ఉంటుంది. ఆదాయమున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండటం వలన అప్పు చేయాల్సివచ్చే అవకాశముంటుంది.. అయితే ఆరవ ఇంటిలో శని గోచారం అనుకూలంగా ఉన్న సమయంలో గతంలో మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడమే కాకుండా మీరు చెల్లించాల్సిన  బ్యాంకు లోన్ లు కానీ,  అప్పులు కానీ తిరిగి చెల్లించ గలుగుతారు.  ఏప్రిల్ -  జూలై మధ్యలో తిరిగి సంవత్సరాంతంలో శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి.  చెల్లించవలసిన దానికంటే ఎక్కువ చెల్లించాల్సి రావడం అలాగే ఫైన్ లు టాక్స్ ల రూపంలో కూడా డబ్బులు చెల్లించాల్సి రావడం వలన ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురికావలసి వస్తుంది.  ముఖ్యంగా అష్టమ స్థానంలో గురువు గోచారం ఆర్థిక విషయాలలో  జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.  ఈ సమయంలో  తొందరపడి పెట్టుబడులు పెట్టడం చేయకండి.  ఇప్పుడు వచ్చే అవకాశాల్లో చాలా మటుకు నష్టం చేసేవే అవుతాయి తప్ప మీకు ఆర్థికంగా లాభం చేకూర్చవు.  వీలైనంతవరకు ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, డబ్బు జాగ్రత్తగా ఖర్చు చేయడం మంచిది. 

ఆరోగ్యం
 సింహ రాశి వారికి ఈ సంవత్సరం ఈ విషయంలో సామాన్యంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు  గోచారం, సంవత్సర ఆరంభంలో శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కాలేయం,  ఎముకలు,  వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది.  ఇవే కాకుండా మూత్రపిండాలు మరియు  గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం.  జూలై నుంచి మళ్ళీ శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.  అష్టమ గురువు కారణంగా మీ  ఆహార అలవాట్లను,  జీవనశైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు మానసిక ఒత్తిడి తగ్గడానికి అలాగే ఆరోగ్యంగా ఉండడానికి యోగా, ధ్యానం లాంటి వాటిని ప్రతిరోజు చేయడం మంచిది. 

కన్యారాశి
కన్యారాశి జాతకులకు ఈ సంవత్సరం  వృత్తి విషయంలో అనుకూలంగా ఉంటుంది.  ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  
ఉద్యోగం
వృత్తి పరంగా  సంవత్సరమంతా  గురు గోచారం, సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శనిగోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. గురువు ఏడవ ఇంటిలో అనుకూలంగా సంచరించటం వలన వృత్తిలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి.  ముఖ్యంగా  సంవత్సర ఆరంభం నుంచి జూలై మధ్యకాలంలో తిరిగి జనవరి తర్వాత గురు మరియు శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పదోన్నతి కానీ అనుకున్న ప్రదేశానికి బదిలీ కానీ అవుతుంది.  అంతేకాకుండా మీ విలువ మీ సహోద్యోగులు గుర్తించడం, వారి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది.  ఈ సమయంలో మీకు అవార్డులు కానీ లేదా ప్రశంసలు కానీ లభిస్తాయి.  విదేశీ ప్రయాణం గురించి  ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది.   అయితే రాహు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తాకడం కానీ,  అవమానాలు  ఎదురవడం కానీ జరగవచ్చు.  ఈ సమయంలో అత్యాశతో కానీ, ముందు వెనుకా ఆలోచించకుండా ఎటువంటి పనులు, ముఖ్యంగా మీ శక్తికి మించిన పనులు చేయడానికి ఒప్పుకోకండి.  దాని వలన ఆ పని కాకపోవడమే కాకుండా మీకు అవమానం ఎదురయ్యే అవకాశం ఉంది.   అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యాత్మక సమయాల్లో మీ మిత్రులు కానీ, సోదరులు కానీ సహాయం చేసి  ఆ  సమస్యను దూరం చేసే అవకాశం ఉంటుంది. జూలై తరువాత జనవరి వరకు శని గోచారం ఐదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో మార్పు విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అన్ని విధాల అర్హత ఉన్నప్పటికీ వృత్తిలో మార్పు విషయంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.  కాబట్టి సూర్య గోచారం అనుకూలంగా ఉన్న నెలల్లో ఈ విషయంలో ప్రయత్నం చేయటం మంచిది. తొందరపడి మాట ఇవ్వడం వలన తర్వాత ఇచ్చిన మాటను నెరవేర్చలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. 

కుటుంబం
 కుటుంబ విషయంగా  ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో అనుకూలమైన  పరిస్థితులు నెలకొంటాయి,  కుటుంబ వృద్ధి జరుగుతుంది.  అంతేకాక కుటుంబంలో  ఉన్న సమస్యలు తొలగిపోతాయి.  అయితే  గురు గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ శని గోచారం సంవత్సరం మధ్యలో సామాన్యం గా ఉండటంవల్ల కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది.  మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు  రావటం దాని వలన కొంత మానసిక చింత ఏర్పడటం జరుగుతుంది. ముఖ్యంగా మీ సంతానం యొక్క ఆరోగ్య  విషయంలో ఈ సమయంలో కొంత జాగ్రత్త అవసరం.  సంవత్సర ఆరంభంలో తిరిగి సంవత్సరం మధ్యలో గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.  ఇంటిలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.  ఈ సమయంలో  చాలా కాలం నుంచి వివాహం కాకుండా ఎదురుచూస్తున్న వారికి వివాహ ప్రాప్తి ఉంటుంది.  అలాగే సంతాన విషయంలో ఆలస్యం అయిన వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంటుంది. గురు గోచారం బాగున్నప్పటికీ సంవత్సరమంతా రాహు గోచారం  8వ ఇంటిలో ఉండటం వలన  కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న, చిన్న మనస్పర్థలు ఏర్పడటం,  చెప్పుడు మాటలు కారణం ఇద్దరి మధ్య అవగాహనా రాహిత్యం ఏర్పడి గొడవలు రావడం జరగవచ్చు.  అయితే ఈ సమయంలో అనవసర ఆవేశానికి లోను కాకుండా ఆలోచించి మాట్లాడటం కానీ,  నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తే చాలా మటుకు సమస్యలు  తొలగిపోతాయి.  అంతేకాకుండా మీ మిత్రులు మరియు బంధువులు సహాయం వలన మీ మధ్య ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోతాయి.  ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు కు వెళ్లే అవకాశం ఉంటుంది.  

ఆర్థిక స్థితి 
కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది.  అయితే సంవత్సరం మధ్యకాలంలో లాభ స్థానం శని దృష్టి ఉండటం వలన ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ వచ్చిన లాభాలను సరిగా వినియోగించుకోలేక పోవడం జరగచ్చు.  ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.  ఈ సమయంలో శని దృష్టి సప్తమ స్థానంపై మరియు లాభ స్థానంపై ఉండటం వలన లాభాల శాతం తగ్గే అవకాశం ఉండటం కానీ లేదా అనుకున్న సమయానికి పెట్టుబడి నుంచి ఆదాయం రాకపోవడం కానీ జరగవచ్చు. కాబట్టి ఈ సమయంలో  వచ్చిన డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేయడం మంచిది.  అలాగే సంవత్సరమంతా  రాహు గోచారం 8వ ఇంటిలో ఉండటం వలన విలాసాలకు,  అవసరం లేకపోయినా గొప్పలకు పోయి డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.   గురు గోచారం సంవత్సరం అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ వచ్చిన ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకొనట్లయితే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలకు మరియు  ఆరోగ్య విషయంలో కూడా ఈ సంవత్సరం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.  మీ వృత్తి/వ్యాపారాల కారణంగా  ఈ సంవత్సరం మంచి ఆదాయం ఉంటుంది.  ఇల్లు,  వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.  రాహు గోచారం ఎనిమిదవ ఇంటిలో  ఉండటం వలన తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశ ఈ సమయంలో  ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా డబ్బు సంపాదించవచ్చు అని మిమ్మల్ని ప్రలోభపెట్టే వారు కూడా ఉంటారు. వారి మాటలు నమ్మి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వాటికి లొంగకుండా సంపాదన విషయంలో మీ శ్రమను నమ్ము కోవడం మంచిది.

ఆరోగ్యం
 కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో లో అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురు గోచారం మధ్యమంగా ఉండటం వలన ఆరోగ్యం బాగుంటుంది.  అయితే రాహుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన ఉదర సంబంధ మరియు నరముల సంబంధ ఆరోగ్యసమస్యలు బాధించే అవకాశం ఉంటుంది. అయితే ఇవి మిమ్మల్ని అంతగా బాధించేవి కావు కాబట్టి వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. శని  దృష్టి ఏడవ,  మూడవ, మరియు  పదకొండవ ఇళ్లపై ఉంటుంది కాబట్టి చేతులు,  కాళ్లు మరియు  జననేంద్రియాలకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్య ఉండే అవకాశం ఉంటుంది. సంవత్సర ఆరంభంలో గురువు మరియు శని  గోచారం అనుకూలంగా  మారుతుంది కాబట్టి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాహు గోచారం కారణంగా మానసిక ఆందోళనకు కూడా ఏర్పడే అవకాశముంటుంది. అంతే కాకుండా ఈ సంవత్సరం మీ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన ఈ సమస్యలు మళ్లీ, మళ్లీ రాకుండా ఉంటాయి.  ముఖ్యంగా మీ ఆహారపు అలవాట్లను కొంత మార్చుకోవాల్సి ఉంటుంది.  సమయానికి భోజనం చేయడం అలాగే చిరుతిండ్లు తగ్గించడం వలన గ్యాస్టిక్ సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. గురు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన మీ ఆరోగ్య సమస్యలకు తగిన చికిత్స లభించి తొందరగా ఆరోగ్యవంతులవుతారు. 

 

తులారాశి
కుటుంబం
 ఈ సంవత్సరం తులా రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురుగోచారం, సంవత్సరం మధ్యలో శని గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.  ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ఫలితం రావడం లో ఆలస్యం అవటమే కాకుండా దానికి తగిన గుర్తింపు కూడా రాకపోవచ్చు.  దానివలన మీరు నిరాశా నిస్పృహలకు, అసహనానికి గురి అవుతారు.  వృత్తిలో అభివృద్ధి వచ్చినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతుంటారు. అయినప్పటికీ మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తారు.  దాని కారణంగా కుటుంబ జీవితానికి దూరం అవుతారు.  సంవత్సరం ఆరంభంలో మరియు చివరలో శని ఐదవ ఇంటిలో సంచరించటం వలన ఈ పరిస్థితులలో కొంత అనుకూలమైన మార్పు వస్తుంది.  గతంలో ఉన్న పని ఒత్తిడి తగ్గి కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.  అయితే గతంలో చేసిన కొన్ని పనుల కారణంగా ఉద్యోగంలో మార్పు జరుగుతుందేమో అనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఆలస్యం తగ్గినప్పటికీ ఈ సమయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశాలు కూడా తగ్గుతాయి.  దాని వలన వృత్తిలో అభివృద్ధి కొరకు కొంత కష్టపడాల్సి ఉంటుంది.  అంతేకాకుండా మీ సహోద్యోగులు కానీ,  మీకు నష్టాలు చేయాలనుకునేవారు కానీ ఈ సమయంలో మీ గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది.  అటువంటి వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేయకూడదు.  జూలైలో శని గోచారం తిరిగి నాలుగో ఇంటికి రావటం వలన కొంతకాలంగా  తక్కువగా ఉన్న పని ఒత్తిడి మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది.  మీరు ఈ సమయంలో పేరు ప్రతిష్టల కొరకు పని చేసే అవకాశం ఉంటుంది.  చేసే ప్రతి పనికి గుర్తింపు రావాలని బలమైన కోరికతో పని చేయడం వలన పని పై శ్రద్ధ తగ్గి ఇతర విషయాలపై శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది.  ఫలితం పై దృష్టి పెట్టకుండా మీరు చేసే పని నిజాయితీగా చేయడం వలన ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. 

ఆర్థిక స్థితి
 ఈ సంవత్సరం తులా రాశి వారికి ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. సంవత్సరమంతా గురుగోచారం మధ్యమంగా ఉండటం వలన డబ్బు వచ్చినప్పటికీ అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయటం వలన ఆర్థికంగా ఇబ్బందిపడే అవకాశముంటుంది.  జన్మరాశిలో కేతుగోచారం కారణంగా అనవసరమైన ఖర్చులకు,  గొప్పలకు పోయి ఎక్కువడబ్బు ఖర్చుచేస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా  పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా  జాగ్రత్త అవసరం. సంవత్సర ఆరంభంలో శని దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన లాభాలు తగ్గుతాయి అంతేకాకుండా పెట్టుబడులు ద్వారా వచ్చే లాభాలు కూడా  గతంలో వచ్చినట్టుగా కాకుండా కొంత తగ్గుతాయి. తిరిగి జులై నుంచి జనవరి మధ్యలో  శని గోచారం నాలుగు ఇంటికి మారటం వలన ఖర్చులు తగ్గుముఖం పడతాయి.  ఈ సమయంలో ఆరోగ్య విషయంలో,  కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది.  అంతేకాకుండా శుభకార్యాలకు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు పెడతారు. ఈ సంవత్సరమంతా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

కుటుంబం
కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురుగోచారం మరియు రాహుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు పని ఒత్తిడి కారణంగా ఎక్కువ సమయం కుటుంబంతో గడిపే అవకాశం ఉండదు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యులతో  భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.  అనవసరమైన అపోహల కారణంగా వారితో సమస్యలు ఏర్పడవచ్చు. అయితే గురు   దృష్టి కుటుంబ స్థానంపై ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు.  ఈ సంవత్సరం  మీరు ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది.  దాని కారణంగా కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండటం జరుగుతుంది. అలాగే ఏడవ ఇంట రాహువు  గోచారం కారణంగా భార్యాభర్తల మధ్య లో అవగాహన లోపిస్తుంది. సంబంధం లేని విషయాల గురించి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే అహంభావం కారణంగా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహకారం వలన ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. సంవత్సర ఆరంభంలో  మీ సంతానానికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా వారి కారణంగా ఇబ్బందులు రావడం కానీ జరుగుతుంది. దాని కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు.  అంతేకుండా కుటుంబ సభ్యుల విషయంలో ఎక్కువ ఆందోళన పడటం అతి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది.  దాని కారణంగా కుటుంబ సభ్యులకు మీ పై కొంత చికాకు ఏర్పడటం కానీ లేదా కోపానికి రావడం కానీ జరుగుతుంది.  మీ రాశి పై కేతు గోచారం కారణంగా ఇలాంటి భయాలు, ఆందోళనలు ఎక్కువ ఉంటాయి కానీ వీటి విషయంలో ఆందోళన అవసరం లేదు.  చాలా వరకు అవి కేవలం భయాలు గానే ఉంటాయి తప్ప నిజాలు కావు.

ఆరోగ్యం
 తులా రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురు మరియు రాహు గోచారం అనుకూలంగా లేకపోవటం, సంవత్సరం మధ్యలో శనిగోచారం కూడా అనుకూలంగా లేకపోవటం వలన ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో అలాగే పని విషయంలో కొంత జాగ్రత్త అవసరం మీ ఉద్యోగం కారణంగా విశ్రాంతి లేకుండా పని చేయాల్సి రావడం అలాగే సమయానికి భోజనం చేయకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  మెడ,  కడుపు,  వెన్నెముక సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సంవత్సరమంతా కేతువు గోచారం జన్మరాశిపై ఉండటం కారణంగా ఈ సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.  డిప్రెషన్ కానీ,  ఒంటరితనం అనే భావన కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన మీ కుటుంబం యొక్క సహకారంతో మీ  మానసిక ఆరోగ్య సమస్యల నుంచి బయట పడగలుగుతారు. ఈ సమయంలో వీలైనంతవరకూ ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవడం వలన మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంతగా మీ ఆరోగ్యం బాగుంటుంది. 


వృశ్చిక రాశి
ఉద్యోగం
 ఈ సంవత్సరం, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి, ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో శని గోచారం, సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా ఉండటం వలన మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొన్నిసార్లు వృత్తి విషయంలో ఎక్కువగా ఆందోళనకు, భయానికి గురవటం వలన ఎక్కువగా శ్రమించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేయకండి. అది మీ వృత్తిలో మీ సహోద్యోగులతో సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం, సంవత్సరమంతా గురు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు వృత్తి విషయం లో ఉండే ఆందోళన తొలగిపోవడమే కాకుండా పదోన్నతి లభిస్తుంది. కొత్త ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వారికి, ఉద్యోగంలో మంచి మార్పు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా దాని ద్వారా లాభాలు కూడా అందుకోగలుగుతారు. మీ ఆలోచనలకు, మీ ప్రణాళికలకు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం అనుకూలంగా లేక పోవటం వలన వృత్తిలో అభివృద్ధి తో పాటుగా పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. జూలైలో శని తిరిగి మూడవ ఇంటికి రావడంతో ఈ పని ఒత్తిడి తగ్గి వృత్తిలో అనుకూలమైన సమయం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా సంవత్సరమంతా రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీ సహోద్యోగులు నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. గతంలో మీకు చెడు చేయాలని చూసిన, లేదా చెడు చేసిన వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పొందుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అలాగని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ సంవత్సరం విదేశీ యానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి సంవత్సర మధ్యలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది. 

 ఆర్థిక స్థితి
 మీకు ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.  సంవత్సరం మధ్యలో శని గోచారం బాగుండటం సంవత్సరమంతా గురు మరియు రాహు గోచారం బాగుండటం వలన మీ ఆదాయం మెరుగు పడుతుంది.  అంతేకాకుండా గతంలో చేసిన అప్పులు తీర్చగలుగుతారు.  ఈ సమయంలో ఖర్చులు ఉన్నప్పటికీ వాటికి తగిన ఆదాయం సమకూర్చుకో గలుగుతారు. గురు గోచారం ఐదవ ఇంట్లో ఉండటం పెట్టిన పెట్టుబడుల వలన ఆర్థిక లాభాలు పెరుగుతాయి.  గురు దృష్టి లగ్నం పై,  లాభ స్థానం పై మరియు  భాగ్య స్థానంపై ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది.  మీరు పెట్టిన పెట్టుబడి నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. ఇల్లు కాని,   వాహనం కానీ కొనాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు  తీసుకునే నిర్ణయాలు కానీ,  చేసే ఆలోచన కానీ సరైన ఫలితాలనిచ్చే ఆర్థికంగా సాధించేలా చేస్తుంది.  గతంలో ఏర్పడిన నష్టాలకు తగిన ఆదాయం రావడంతో ఆ నష్టాలు  పూరించబడతాయి. రాహు గోచారం ఆరవ ఇంట అనుకూలంగా ఉండటం వలన కోర్టు కేసులలో,  వారసత్వ  వివాదాలలో  విజయం సాధించడం వలన  ధన లాభం కానీ,  స్థిరాస్తులు కానీ లభిస్తాయి.  బ్యాంకు లోను కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ,  ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ ఈ సమయంలో వారి అవసరాలకు తగిన డబ్బు లభిస్తుంది. కేతు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.  అలాగే ఆరోగ్య విషయంగా కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. 

కుటుంబం
 ఈ సంవత్సరం, కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు గోచారం ఐదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం, సంవత్సరం మధ్యలో శనిగోచారం, సంవత్సరమంతా రాహు  గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి.  భార్యాభర్తల మధ్య,  కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపోహలు  తొలగిపోయి గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ సంతానం అభివృద్ధి లోకి వస్తుంది.  మీ పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి.  ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అవటం,   సంతానం కానీ వారికి సంతానం అవటం జరుగుతుంది.  కుటుంబ పరంగా  కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ ఉన్నవారికి ఈ సంవత్సరం లో విజయం లభిస్తుంది.  సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం నాలుగవ ఇంటిలో  ఉండటం వలన కుటుంబంలో సమస్యలు రావడం కానీ, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం దెబ్బతినటం కానీ జరగవచ్చు. అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరగానే తగ్గిపోతాయి. మీలో ఆధ్యాత్మికత, దైవ చింతన ఈ  సంవత్సరంలో ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, గురు దర్శనం కానీ చేసుకుంటారు.  అంతే కాకుండా, ఈ సమయంలో మీరు గురు ఉపదేశం పొందడం కానీ,  లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ చేస్తారు. 

ఆరోగ్యం
 ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.  గత సంవత్సర కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శారీరక,  మానసిక ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి.  సంవత్సరమంతా గురు మరియు  రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఉండవు.  సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన, కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎముకలు, ఊపిరితిత్తులు మరియు ఉదరానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. కేతు గోచారం కారణంగా  కొన్నిసార్లు శారీరక ఆరోగ్య సమస్యల కంటే,  మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడతాయి.  ముఖ్యంగా లేని భయాలను ఊహించుకోవటం,  లేని రోగాలు ఉన్నవిగా భావించి భయపడటం చేస్తారు.  అంతే కాకుండా ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవడం వలన అనవసరమైన సమస్యలకు లోనవుతారు.  కాలేయం,  వెన్నెముక,  మూత్రపిండాలు మొదలైన సంబంధించి సాధారణ సమస్యలు ఈ సమయంలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమస్యలను పెద్దగా ఊహించుకొని,   ఎక్కువ మందులు వాడటం కానీ,  ఎక్కువమంది వైద్యులను సంప్రదించడం కానీ చేస్తారు.  దాని వలన అనవసరమైన ఆందోళనకు గురి అవుతారు. సంవత్సరమంతా గురు దృష్టి లగ్నం పై ఉండటం, రాహు గోచారం 6వ ఇంట ఉండటం వలన మీలో ధైర్యం పెరగడమే కాకుండా,  మానసిక ఆందోళనలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.  సరైన వైద్యం అందడం కానీ,  సరైన సలహాలు పాటించడం కానీ చేయడం వలన తొందరగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిగతా సంవత్సరమంతా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా బాధించవు .

 

ధను రాశి
ఉద్యోగం
ధనూ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం సామాన్య ఫలితాలను ఇస్తుంది.  గురు  గోచారం సంవత్సరమంతా 4 వ ఇంటిలో ఉండటం, రాహు గోచారం ఐదవ ఇంట ఉండటం వలన వృత్తి విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటారు.  శని గోచారం రెండవ మరియు మూడవ ఇంట ఉండటం, కేతు గోచారం 11వ ఇంట ఉండటం వలన ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో మరియు  కుటుంబ విషయం గా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వృత్తి పరంగా  కొంత ఉంటుంది.  ఈ సంవత్సరమంతా   గురు గోచారం  4వ ఇంట ఉండటం వలనవృత్తిలో శ్రమ అధికంగా ఉంటుంది. చాలా సార్లు చేసిన పనులనే మళ్లీమళ్లీ చేయాల్సిరావటం, ఎంత పని చేసినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవటం వలన మానసిక ఒత్తిడికీ, నిరాశా, నిస్పృహలకు లోనవుతారు.  ఉద్యోగంలో కానీ, ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ వచ్చిన మార్పు మీకు కొంత ఇబ్బందిని, పని ఒత్తిడిని  ఇస్తుంది. మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన మార్పు కనక మీరు అక్కడ మనస్ఫూర్తిగా పని చేయలేక పోవచ్చు.  అంతేకాకుండా సహోద్యోగుల సహకారం కూడా లేకపోవడం వలన ఒంటరితనం ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం మధ్యలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. సంవత్సర ఆరంభంలో శనిగోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఉత్సాహంగా మీపని మీరు చేసుకోగలుగుతారు.. మీరు పట్టుదలగా ఉంది ప్రయత్నం చేస్తే ఉద్యోగులతో ఉన్న సమస్యలు తొలగిపోయి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. అంతే కాకుండా మీరు తిరిగి గతంలో ఉద్యోగం చేసిన ప్రాంతానికి రావడం కానీ, లేదా చేసే బాధ్యతల్లో మార్పులు రావటం వలన వృత్తిలో ఉండే ఒత్తిడి కొంత తగ్గుతుంది. ఈ సమయంలో గతంలో వాయిదా పడిన పనులు  పూర్తి అవడం కానీ, గతంలో ఆగిపోయిన పదోన్నతి తిరిగి రావటానికి కానీ  జరుగుతుంది. సంవత్సరం మధ్యలో శని గోచారం తిరిగి రెండవ ఇంటికి మారటం, అలాగే గురు గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన  మీ ఉద్యోగంలో తిరిగి ఒత్తిడి పెరగడం జరుగుతుంది.  ఈ సమయములో మీ స్థాయికి మించిన పనులను చేయకుండా ఉండటం మంచిది. గొప్పలకు పోయి ఇలాంటి పనులు చేయడానికి ముందుకు వచ్చి ఆ తర్వాత వాటిని చేయలేక ఇతరుల దృష్టిలో  తక్కువ కావడం జరగవచ్చు. రాహువు గోచారం ఐదవ ఇంట్లో ఉండటం వలన కొన్నిసార్లు అత్యుత్సాహంగా ఉండటం, కొన్ని సార్లు  నిరుత్సాహంతో ఉంటారు.  మానసిక ఒత్తిడి కారణంగా  పనులు వాయిదా వేయాలని చూస్తుంటారు.  చేసే పనికి  కొన్నిసార్లు గుర్తింపు రాకపోవడంతో ఆ పని మానేయాలని ఆలోచిస్తారు.  ఈ సమయంలో వీలైనంతవరకూ  మీ పై మీరు నమ్మకం కలిగిఉండి  పని చేయడం వలన విజయం సాధిస్తారు. కొన్నిసార్లు ఒకే పనిని చాలా సార్లు చేస్తే కానీ  పూర్తవక పోవచ్చు కాబట్టి అటువంటి సందర్భాల్లో నిరాశకు లోను కాకుండా పని చేయటం వలన ఆ పని పూర్తి చేయగలుగుతారు. 

ఆర్థిక స్థితి
 ఈ సంవత్సరం ధను రాశి వారికి ఆర్థికంగా  సామాన్యంగా ఉంటుంది. శని మరియు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం ఆర్థిక అభివృద్ధి తగ్గుతుంది. రెండవ ఇంటిని  శని గోచారం కారణంగా ఆదాయం తగ్గి పోవడం కానీ లేదా ఖర్చు పెరగడం కానీ జరగవచ్చు.  సంవత్సరమంతా  గురు గోచారం నాలుగవ ఇంట్లో ఉండటం వలన కుటుంబ కారణాల రీత్యా కాని,  కోర్టు కేసులు లేదా వివాదాల కారణంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.  సంవత్సరం మధ్యకాలంలో వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.   గొప్పలకు పోయి వినోద కార్యక్రమాలకు,  వ్యసనాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలయినంత వరకు ఈ సమయంలో గొప్పలకు పోకుండా,  ఇతరుల మాటలకు లొంగకుండా ఉండటం మంచిది. 

ఆరోగ్యం 
ధను రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురుగోచారం, సంవత్సరం మధ్యలో శని గోచారం రెండవ ఇంట ఉండటం వలన  నేత్ర సంబంధ,  ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.   ఈ సమస్యలు అధిక శ్రమ కారణంగా,  మరియు  సమయానికి భోజనం చేయకపోవడం వలన వచ్చే అవకాశం ఉంటుంది.  మీ రాశ్యాధిపతి అయిన గురు గోచారం సంవత్సరమంతా అనుకూలంగా ఉండదు కాబట్టి ఆరోగ్య విషయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.  సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం, సంవత్సరమంతా కేతుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య పరంగా  పెద్దగా సమస్యలు  ఉండవు. సంవత్సరం మధ్యలో శని మరియు గురువు గోచారం  బాగుండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.  విశ్రాంతి లేకుండా పని చేయడం,  ఎక్కువ ప్రయాణాల కారణంగా  సరైన ఆహారం తీసుకోకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా ఎముకలు,  దంతములు,  కాలేయము మరియు మోకాళ్ల కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు  మిమ్మల్ని బాధించే అవకాశం ఉంటుంది కాబట్టి  తగిన విశ్రాంతి తీసుకోవడం,  సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం మంచిది .

కుటుంబం
 ధను రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురు గోచారం మరియు సంవత్సరం మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మొదట్లో శని మరియు కేతు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి జరుగుతుంది. అయితే   ఈ సంవత్సరం మధ్యలో శని గోచారం కుటుంబ స్థానంలో ఉండటం వలన కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది.  మీ మాటకు విలువ తగ్గడం కానీ,  మీరు చెప్పిన విషయాలు కుటుంబ సభ్యులు పాటించకపోవడం కానీ జరగవచ్చు.  అంతేకాకుండా కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ సమయంలో అనవసరమైన వివాదాలు పోకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది. ఎందుకంటే మీకు ఆవేశాన్ని మరియు కోపాన్ని కలిగించే సంఘటనలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది.  మీ ఆవేశాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే కుటుంబ సభ్యులతో వివాదాలు పెరగడం కానీ, వారికి దూరం అవ్వటం కానీ జరగవచ్చు.  సంవత్సరం మధ్యలో శని గోచారం  అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి.  కుటుంబ సభ్యులతో వివాదాలు బంధువుల సహాయంతో తొలగిపోతాయి.  అయితే ఈ సమయంలో గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు ఉద్యోగ రీత్యా కాని ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరమంతా కేతు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే తగ్గుముఖం పడతాయి.  అలాగే అయిదవ  ఇంటిలో రాహు గోచారం కారణంగా, సంతానం మంచి అభివృద్ధిలోకి వచ్చినప్పటికీ, వారికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 

 

మకర రాశి
మకర రాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురువు, శని, రాహువు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు.
ఉద్యోగం
 మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరం మధ్యకాలంలో శని దృష్టి మూడవ మరియు పదవ ఇంటిపై ఉండటంవల్ల వృత్తిలో అనుకోని మార్పులతో పాటు పని ఒత్తిడి కూడా పెరుగుతుంది.  చిన్న చిన్న పనులు కూడా ఎక్కువ శ్రమతో చేయవలసి వస్తుంది.  మీరు చేసే పనికి గుర్తింపు వచ్చినప్పటికీ సమయానికి పూర్తిచేయక పోవటం వలన ఆ గుర్తింపుకు  విలువ లేకుండా పోతుంది.  ఈ సమయంలో రాహు గోచారం కూడా సామాన్యం గా ఉండటం వలన మీ నిర్ణయాల్లో అలసత్వం కారణంగా అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన వృత్తిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న పై అధికారులు కాకుండా కొత్తవారు రావడం లేదా  మీరు కొత్త ప్రదేశంలో పని చేయడం లేదా కొత్త ఉద్యోగం చేయడం వలన పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది.  కొన్నిసార్లు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది.  ఈ సమయంలో ఇంటికి దూరంగా పని చేయాల్సి ఉంటుంది. సంవత్సర ఆరంభంలో, చివరలో శని దృష్టి పదవ ఇంటిపై లేకపోవడం వలన వృత్తిలో కొంత ఒత్తిడి తగ్గినప్పటికీ అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది.  అంతేకాకుండా ఎంత  పని చేసినప్పటికీ సరైన గుర్తింపు లభించక పోవటం వలన  అసహనానికి,  నిరాశా నిస్పృహలకు లోనవుతారు. ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు కొరకు కానీ,   ఉద్యోగం చేసే ప్రదేశంలో మార్పు కొరకు కానీ ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం లభించక పోవచ్చు.  అయితే కేతువు గోచారం మధ్యమంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ మీ పట్టుదలతో, ఓపికతో ఒత్తిడిని కొంత తగ్గించుకోగలుగుతారు. రాహు గోచారం  నాలగవ  ఇంటిలో ఉండటం వలన మిమ్మల్ని ఉపయోగించుకొని లాభపడే వారు ఎక్కువవటమే కాకుండా, మీరు చేసిన సాయానికి కృతజ్ఞతలు కూడా వారు మీపై చూపించరు. సంవత్సరమంతా గురు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వలన మిత్రులు, శ్రేయోభిలాశుల సహాయంతో వృత్తిలో కొంత అభివృద్ధిని చూస్తారు. ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా ఉండటమే కాకుండా వృత్తిలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే  సంవత్సరం మధ్యకాలంలో శని దృష్టి  పదవ ఇంటిపై ఉండటం వలన వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కుంటారు. మీరు చేసే పని నిజాయితీగా చేయడం, ఎవరి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు  లొంగకుండా ఉండటం వలన వృత్తిలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా  ఎదుర్కోగలుగుతారు.   ఏలినాటి శని సమయంలో వచ్చే ప్రతి సమస్య మీకు భవిష్యత్తులో వచ్చే విజయాలను  ఇవ్వటానికి తప్ప మిమ్మల్ని నష్ట పెట్టడానికో, కష్టపెట్టడానికో కాదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.  ఈ సమయం అంతా కూడా మిమ్మల్ని మరింత నిపుణులుగా,  శక్తివంతులుగా చేసి మీలో ఉన్న లోపాలను  తొలగించేదిగా ఉంటుంది.  కాబట్టి ఈ సమయంలో వచ్చే ప్రతి అడ్డంకిని సహనంతో,  ధైర్యంతో ఎదుర్కొని ముందడుగు వేయడం మంచిది. 

ఆర్థిక స్థితి
 ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా సామాన్య ఫలితాలను ఇస్తుంది.   సంవత్సరం మధ్యలో శని గోచారం రెండవ ఇంట ఉండటం వలన ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.  ఆకస్మికంగా ఖర్చులు పెరగడమే కాకుండా,  మీరు గతంలో తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో శని దృష్టి లాభ స్థానం పై ఉండటం రావలసిన లాభాల్లో కానీ,  ఆదాయంలో కానీ తగ్గుదల ఉంటుంది.  అంతేకాకుండా రావాల్సిన డబ్బులు సమయానికి రాకుండా ఆలస్యంగా వస్తాయి.  ఈ సంవత్సరమంతా గురు దృష్టి లాభ స్థానం పై ఉండటం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు కొంత తగ్గుతాయి.  ఈ సంవత్సరం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టడం కానీ,  స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ మంచిది కాదు.   సంవత్సరం మధ్యలో శని దృష్టి లాభ స్థానం పై ఉండక పోవడం వలన ఆదాయంలో కొంత పెరుగుదల చూస్తారు.  అయితే ఈ సమయంలో విలాసాల కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి  ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.  ఈ సమయంలో మీరు చేసే దుబారా ఖర్చు భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడటం మంచిది. 

కుటుంబం
 కుటుంబ పరంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఇంటిలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావటం కానీ,  మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండవలసి రావటం కానీ జరగవచ్చు.  మీ మిత్రుల నుంచి కానీ,  కుటుంబ సభ్యుల నుంచి కానీ మీరు ఆశించిన సహాయం రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు.  అంతేకాక  మీ మాటకు విలువ తగ్గడం కానీ,  మీరు చెప్పే వాటిని మీ కుటుంబ సభ్యులు సరిగ్గా పాటించకపోవడం కానీ జరగవచ్చు.  దాని వలన మీరు నిరుత్సాహానికి,  అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం మధ్యలో  శని గోచారం కుటుంబ స్థానంపై నుంచి లగ్నం పైకి మారటంతో కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి.  ఆ సమయంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మీ స్నేహితుల సహకారంతో తొలగించుకో గలుగుతారు.  మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ సమయంలో నాలుగవ ఇంటిలో రాహువు గోచారం కారణంగా మీరు ఉద్యోగ రీత్యా కాని ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండవలసి రావడం కానీ,  ఇంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడటం కానీ జరగవచ్చు.   కేతువు గోచారం   పదవ ఇంటిలో ఉండటం వల్ల మీరు చేసే పనులకు గుర్తింపు రావడం లేదన్న బాధకు గురయ్యే అవకాశం ఉంటుంది.  ఈ సమయం లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ,  యజ్ఞ, యాగాది క్రతువులు నిర్వహించడం కానీ చేస్తారు.  అంతేకాకుండా  సామాజికసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

ఆరోగ్యం
 మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది.  ఏల్నాటి శని సమయం అవటం, గురుగోచారం కూడా సామాన్యంగా ఉండటం వలన శారీరకంగా, మానసికంగా ఏదో ఒక సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంవత్సర ఆరంభంలో శని గోచారం రెండవ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్య విషయాలు లో మార్పులు చోటు చేసుకుంటాయి.  ఎముకలు,  దంతాలు,  చేతులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు,  గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.  అయితే గురు దృష్టి లాభ స్థానంలో అనుకూలంగా ఉండటం వలన సరైన వైద్యం లభించి ఈ ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.  ఈ సంవత్సరంలో రాహు గోచారం కొంత వ్యతిరేకంగా ఉండటం వలన మానసికంగా ఒత్తిడికి గురవడం,  నిద్రలేమి ఎక్కువ ఉండటం,  దాని కారణంగా జీర్ణ శక్తి తగ్గటం జరుగుతుంది.  ఈ సమయంలో  మానసిక ఒత్తిడి తగ్గటానికి,  ఆరోగ్య సమస్యలు తగ్గటానికి సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం మంచిది.  దీనితో పాటుగా శారీరక వ్యాయామాలు చేయడం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.  సంవత్సరం మధ్యలో శని గోచారం తిరిగి జన్మరాశికి మారటం వలన శారీరక ఆరోగ్య విషయంలో కొంత మార్పు ఏర్పడుతుంది.  అయితే మానసికంగా మాత్రం ఏదో తెలియని బాధ,  ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.  ఈ ప్రభావం తగ్గటానికి మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలా చేసుకోవడం మంచిది.  

 

కుంభరాశి
 కుంభ రాశి వారికి ఈ సంవత్సరం,  గత సంవత్సరంతో పోలిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది.  వృత్తి పరంగా, ఆర్థికంగా,  మరియు ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది.
 ఉద్యోగం
 కుంభ రాశిలో జన్మించిన వారికి, ఈ సంవత్సరం ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన  మీ వృత్తిలో పదోన్నతి రావటమే కాకుండా గత కొద్ది కాలంగా పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది.  ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది.  తిరిగి మీ కుటుంబం తో కలిసి  ఉండే అవకాశం లభిస్తుంది.  గురు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీరు చేసిన కారణంగా గుర్తింపును,  పై అధికారులు ప్రశంసలను పొందుతారు.  మీరు పనిచేసే చోట ఆదర్శ వంతులుగా  కొనియాడబడతాడు.   రాహు గోచారం మూడవ ఇంటిలో ఉండటంతో మీలో ఉండే  నిరాశా, నిస్పృహలు తొలగిపోయి, ఉత్సాహంగా మీ పని చేయగలుగుతారు.  ఉద్యోగ విషయంలో  గతంలో ఉండే భయం తొలగి  పోతుంది.  దానివలన ధైర్యంగా మీ బాధ్యత నెరవేర్చ గలుగుతారు.  గతంలో మీ సహోద్యోగులతో ఉన్న  మనస్పర్థలు తొలగిపోతాయి.  వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.  విదేశాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది.  విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది.  సంవత్సరం మధ్యలో శనిగోచారం తిరిగి 12వ ఇంటికి రావటం వలన చేసే పనిలో ఆసక్తి తగ్గడం కానీ, బద్ధకం పెరగడం కానీ జరగవచ్చు.  ఈ సమయంలో మీరు బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని వీడి పని చేయడం వలన గతంలో సంపాదించిన పేరు నిలబెట్టుకో గలుగుతారు.  ఈ సమయంలో కొన్నిసార్లు మీకు మంచి అవకాశాలు దగ్గరగా వచ్చి మీ నిర్లక్ష్యం కారణంగా కానీ,   బద్ధకం వలన కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. శని దృష్టి రెండవ ఇంటిపై ఉండటం వలన మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.  మీరు చెప్పే మాటలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవడం కానీ, లేదా విలువ ఇవ్వకపోవడం కానీ జరగవచ్చు. అలాగే పని విషయంలో తొందరపడి మాట ఇచ్చి తర్వాత బాధ పడటం జరగవచ్చు.  గురు గోచారం  ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ శ్రేయోభిలాషుల వలన కానీ,  మీ పై అధికారుల వల్ల కానీ ఊహించని లాభాలు పొందుతారు. 

ఆర్థిక స్థితి
 ఈ సంవత్సరం, కుంభ రాశిలో జన్మించిన వారికి, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.  సంవత్సరమంతా  ప్రధాన గ్రహాల గోచారం  అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి లో అనుకూలమైన మార్పులు జరుగుతాయి.  గురువు గోచారం రెండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం, రాహు గోచారం మూడవ ఇంట ఉండటం అలాగే శని దృష్టి సంవత్సర ఆరంభంలో మరియు చివరలో ధన స్థానము పై ఉండకపోవడంతో  ఆర్థికంగా అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ ఖర్చులు తగ్గటమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బులు సమయానికి రావడం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా వారసత్వ వివాదాలు కానీ, కోర్టు కేసులు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం డబ్బు కానీ,   స్థిరాస్తులు కానీ లభిస్తాయి, మీ ఉద్యోగంలో అభివృద్ధి కారణంగా కూడా ఆదాయం జరుగుతుంది.  గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి ఆదాయం లభించడంతో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.  ఈ సమయంలో ఇల్లు కాని,  వాహనాలు కొనుగోలు చేస్తారు.  సంవత్సరం మధ్యలో శని దృష్టి  రెండవ ఇంటిపై  పడటం వలన, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే గురువు మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉండటం వలన పెరిగిన  ఖర్చులను తట్టుకునే ఆదాయాన్ని కూడా సమకూర్చుకోగలుగుతారు.  ఈ సమయంలో డబ్బు  అప్పు ఇవ్వడం కాని, గొప్పలకు పోయి విలాసాల కొరకు డబ్బులు ఖర్చు పెట్టడం కానీ మంచిది కాదు. దానివలన ఇచ్చిన డబ్బు తిరిగి రాక పోగా ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

కుటుంబం 
కుటుంబ పరంగా ఈ సంవత్సరం కుంభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు  గోచారం బాగా ఉంటుంది కాబట్టి  కుటుంబ పరంగా సమస్యలు లేకుండా ఉంటుంది.  గురు గోచారం రెండవ ఇంటిలో ఉండటం వలన కుటుంబ వృద్ధి జరుగుతుంది.  మీ కుటుంబంలో  వివాహం కాని వారికి వివాహం జరగటం కానీ,  సంతానం కలగని వారికి సంతానం అవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సంవత్సరం ఆరంభంలో మరియు చివరలో  శని దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువులలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండటం కానీ, లేదా వారితో మీకు మనస్పర్థలు రావడం కాని వచ్చు.  సంవత్సరమంతా రాహువు మూడో ఇంటిలో ఉండటం వలన మీరు కొత్త ఇంటికి మారడం కానీ, కొత్త ప్రదేశంకు మారడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా గతంలో ఉన్న మానసిక సమస్యలు తగ్గుతాయి. మీరు ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు.  మీ తోబుట్టువులతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.  సంవత్సరం మధ్యకాలంలో శనిగోచారం 12వ ఇంట ఉండటం వలన ఈ సమయంలో కోర్టు కేసులు కానీ,  వారసత్వ వివాదాలు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. మాట విషయంలో  జాగ్రత్త అవసరం.  మీ మాట కారణంగా మీ కుటుంబ సభ్యుల మనసు నొచ్చు కోవడం కానీ, లేదా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటం కానీ జరగవచ్చు.  మీ కుటుంబంలో పెద్దవారి జోక్యంతో ఈ సమస్యలు తొందరగానే   తగ్గిపోతాయి.

ఆరోగ్యం
 ఈ సంవత్సరం కుంభ రాశి వారికి ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన గతంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.  మీ ఉద్యోగం కారణంగా లేదా మీ కుటుంబం కారణంగా ఏర్పడిన మీ మానసిక  సమస్యలు  కూడా దూరమవుతాయి. శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఎముకలు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం ఉండే అవకాశమున్నది. అయితే సంవత్సరమంతా గురువు, మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికి వాటిని తట్టుకోగలిగే మానసిక, శారీరక శక్తిని కలిగి ఉంటారు. 
 
 

మీన రాశి
 ఉద్యోగం
 ఈ సంవత్సరం, మీన రాశిలో జన్మించిన వారికి, మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.  ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో శని గోచారం పదకొండవ ఇంట్లో ఉండటం వలన వృత్తిపరంగా ఈ సమయంలో అనుకూలిస్తుంది.  ఈ సమయంలో మీరు చేసే పనులు విజయవంతం అవడం వలన మీరు వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు.  మీ పై అధికారుల నుంచి కానీ,  సహోద్యోగుల నుంచి కానీ సహాయ సహకారాలు అందుకుంటారు.  ఆయితే సంవత్సరమంతా గురు, రాహు మరియు కేతు గోచారం సామాన్యంగా ఉండటం వలన వృత్తి పరంగా అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి.  వృత్తిలో శ్రమ అధికంగా ఉండటం, మీకు ఇష్టం లేకున్నప్పటికీ కొంతకాలం దూరప్రాంతంలో కానీ విదేశాల్లో పని చేయవలసి రావచ్చు. విదేశీ యానం చేసినప్పటికీ ప్రారంభంలో అక్కడి పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం వలన కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది.  అయితే సంవత్సరం మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మిత్రులు కానీ,  సహోద్యోగుల గాని సమయానికి సహాయం చేసి మీకు ఉన్న సమస్యలు తొలగిస్తారు. సంవత్సరం ఆరంభంలో మరియు చివరలో శని గోచారం తో పాటుగా సంవత్సరమంతా గురు, రాహువు మరియు కేతువుల గోచారం కూడా అనుకూలంగా ఉండకపోవడంతో ఈ సమయంలో వృత్తి పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కుంటారు. ముఖ్యంగా మీరు గతంలో చేస్తానని ఒప్పుకున్న బాధ్యతలను,  పనులను సరిగా పూర్తి చేయడంలో విఫలం అవుతారు.  దాని కారణంగా మీ పై అధికారుల కోపానికి గురవుతారు.  అంతేకాకుండా ఈ సమయంలో చాలా పనులు వాయిదా పడటం కానీ ఆగిపోవడం కానీ జరగటంతో కొంత ఇబ్బందికి గురవుతారు. అనవసరమైన మాటల కారణంగా అవమానాలకు గురవటం కానీ, గౌరవమర్యాదలు కోల్పోవటం కానీ జరిగే అవకాశముంటుంది. మీకు ఈ సంవత్సరం ఏల్నాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా పనుల విషయంలో వాయిదాలు వేయకుండా నిజాయితీగా ఉండటం అలాగే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించటం చేయండి. మాటలకంటే ఎక్కువ చేతలకు ప్రాధాన్యం ఇవ్వటం వలన మీకు వచ్చే సమస్యలను దూరం చేసుకోగలుగుతారు.
 
ఆర్థిక స్థితి
 ఈ సంవత్సరం మీన రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది.  ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం శని గోచారం, సంవత్సరమంతా గురు మరియు రాహు,కేతువుల గోచారం అనుకూలంగా లేకపోవడంతో ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.  ఎంత కష్టపడ్డా  ఆదాయంలో పెద్దగా అభివృద్ధి ఉండకపోవచ్చు.  ఒక్కోసారి ఆదాయం వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వచ్చిన డబ్బు పోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు  అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం మంచిది.  ఇంటిలో శుభకార్యాల కొరకు కానీ,  ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు.  అలాగే కొంత డబ్బు విలాసాల కొరకు కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.  సంవత్సరం మధ్యలో శని గోచారం పన్నెండవ ఇంట ఉండటంతో ఖర్చు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవడంతో మిత్రుల నుంచి కానీ,  ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బు అప్పు తీసుకొని అవకాశం ఉంటుంది.   రాహు గోచారం  రెండవ ఇంట ఉండటంతో ఈ సమయంలో ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.  కొన్ని సార్లు గొప్పలకు పోయి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి,  ఇతరుల మాటలను పొంగిపోయి డబ్బు ఖర్చు చేసుకోకుండా పొదుపు చేయడం మంచిది. ఈ సమయంలో  కుటుంబ సభ్యుల కొరకు కూడా డబ్బు ఖర్చు చేస్తారు.  ఈ సమయంలో ఆదాయం కూడా  బాగానే ఉన్నప్పటికీ  ఖర్చు ఎక్కువ ఉండటం వలన వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేసుకోలేకపోతారు.  ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో  డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకునే వారు కానీ,  ఇల్లు కాని,  స్థిరాస్తులు కానీ కొనుగోలు చేద్దామనుకునే వారు ఆలోచించి డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది. గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండే సమయంలో పెట్టుబడి పెట్టడం వలన నష్టాలు  తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యం
 మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది.  సంవత్సరమంతా గురువు, రాహువు మరియు కేతువు  అనుకూలంగా లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే ఈ సంవత్సరం మద్య కాలం శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే అవి నయమవుతాయి.  సంవత్సరమంతా గురు గోచారం జన్మరాశి పై ఉండటం వలన ఆరోగ్య విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకుండా, విశ్రాంతి లేకుండా ఎక్కువ పని చేయడం వలన వెన్నెముక, కాలేయం, మరియు మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో శని మరియు రాహువు గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం వలన ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా రాహు గోచారం కారణంగా దంతాలు,  మెడ,  తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.  సంవత్సరం మధ్యకాలంలో శని గోచారం 11 ఇంట్లో ఉండటం వలన ఈ ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.  ఈ సంవత్సరం అంతా కూడా సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం, మరియు ఎక్కువ శారీరక శ్రమ చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. 

కుటుంబ జీవితం
 మీన రాశిలో  జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది.  సంవత్సరం మధ్యకాలంలో లాభ స్థానంలో  శని గోచారం కారణంగా మీ ఇంటిలో పెద్ద వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  గతంలో వారి ఆరోగ్యం కారణంగా మీకున్న మానసిక ఆందోళన తగ్గుతుంది.  సంవత్సరమంతా గురు గోచారం ఒకటవ ఇంట్లో ఉండటం,   రాహు గోచారం   కుటుంబ స్థానంలో ఉండటం కేతు గోచారం అష్టమ స్థానంలో ఉండటం వలన ఈ సమయంలో కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అవగాహన రాహిత్యం ఏర్పడటం కానీ,  వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ జరుగుతుంది.  మీరు చేస్తానని చెప్పిన పని చేయకుండా కేవలం మాట వరకే ఉండటంతో వారు మీ మాట పై నమ్మకం ఉంచరు. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉండాల్సి వస్తుంది.  భార్య భర్తలు మనస్పర్థలు ఏర్పడటం కాని,   అపార్థాలు  ఏర్పడటం కానీ జరగవచ్చు.  ఈ సమయంలో మీరు వీలైనంత వరకు ఓపికగా ఎదుటి వారికి అర్థమయ్యేలా మాట్లాడి  సమస్యను పరిష్కరించడం మంచిది.  అహంకారానికి పోవడంవలన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios