Asianet News TeluguAsianet News Telugu

12 సెప్టెంబర్ 2018 బుధవారం మీ రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today september12th your horoscope
Author
Hyderabad, First Published Sep 12, 2018, 9:40 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అధికారులతో అనుకూలత ఉంటుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు.  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవం వృద్ధి చెందుతుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెడతారు. శారీరక బలం వృద్ధి. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడి సమయం. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. దూరదృష్టి ఉంటుంది. పరిపాలన వ్యవహరాలపై దృష్టి ఉంటుంది. అధికారులతో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శస్త్ర చికిత్సలకు ఆటంకం. ఊహించని ఇబ్బందులు. అనుకోని కష్టాలు వస్తాయి. పరామర్శలపై దృష్టి ఉంటుంది. క్రయ విక్రయాల్లో లోపాలు వస్తాయి. ఇతరులపై ఆధారపడతారు.  వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు అధికంగా దానం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : భాగస్వాములతో విఘాతం. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. పనుల్లో ఆటంకాలువస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు. ప్రమాద సూచన. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శతృవులపై విజయం సాధిస్తారు. పోటీ ల్లో గెలుపు ఉంటుంది. ఋణసంబంధ ఆలోచనల నుంచి విముక్తి. రోగనిరోధక శక్తి అభివృద్ధి. అన్ని రకాల సంపదలతో అనుకూలత. వృత్తివిద్యలపై ఆసక్తి పెరుగుతుంది.  పట్టుదలో కార్య సాధన చేస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికం. సంతానం వల్ల సమస్యలు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. సృజనాత్మకత లోపం. పనుల్లో ఆటంకాలు. ప్రణాళిక అవసరం. పట్టుదలతో కార్యసాధన చేయాలి. పరిపాలనపై దృష్టి ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి. ఆహారంలో జాగ్రత్త అవసరం. తల్లితో ఆత్మీయత అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఒత్తిడి కాలం. అభివృద్ధికై ఆలోచన పెరుగుతుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలపై దృష్టి. ప్రయాణాల్లో అనుకూలత. కమ్యూనికేషన్స్‌ వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో తోటి  వారితో అనుకూలత ఉంటుంది. అన్నిరకాల అభివృద్ధిసూచితం. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాటల్లో కాఠిన్యత పెరుగుతుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబంలో అసౌకర్యం ఉంటుంది. ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఏదోరకమైన ప్రమాదాలు సూచన.  దృష్టి దోష నివారణకై ప్రయత్నం. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం. గుర్తింపుకోసం ఆరాటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రమాదాలకు సూచన. ఏదో కోల్పోయిన భావన ఉంటుంది. కార్యసాధనలో పట్టుదల అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతి లోపం ఉంటుంది. విశ్రాంతికై ప్రయత్నం. పాదాల నొప్పులు ఉంటాయి. దేహసౌఖ్యం కోల్పోతారు. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సమిష్టి ఆదాయాలు. సంఘంలో గౌరవం ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. విశ్రాంతికై ఆరాటపడతారు. కళానైపుణ్యం తక్కువగా ఉంటుంది. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. పార్టీలపై ఆసక్తి పెరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, కందిపప్పు, దానిమ్మ పళ్ళు దానం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios