మేషం
ఈ రోజు ఏ పని చేయాలన్నా బద్దకం ఉంటుంది. పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది. తొందరపాటు పనికి రాదు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.

వృషభం
ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చు అధికంగా ఉంటుంది. గృహ సంబంధ విషయాల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తారు.

మిథునం
కొత్త పనులు పారంభించటానికి, వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయటానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ఉద్యోగార్థులు అనుకూల ఫలితం సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

కర్కాటకం
ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగత్త అవసరం. పెట్టుబడులలో అజాగ్రత్త, తొందరపాటు పనికి రాదు. మీ తొందరపాటు వల్ల డబ్బు నష్టపోయే అవకాశముంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వారిపై ఓ కన్నేసి ఉంచండి. మీ మాట తీరు కారణంగా వివాదాల్లో ఇరుక్కునే అవకాశముంది. జాగ్రత్తగా ఉండటం మంచిది.

సింహం
ఈ రోజు ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. రక్తం లేదా ఊష్ణ సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశమున్నది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. విందు వినోదాలు లేదా ఆరోగ్యం విషయంలో అనుకోని ఖర్చు చేయాల్సి వస్తుంది.మీ పిల్లల కారణంగా కొంత ఊరట లభిస్తుంది

కన్య
ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొద్దికాలంగా ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. వాయిదా పడిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. రోజంతా కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఎక్కువ సమయం విశ్రాంతిని కోరుకుంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

తుల
ఈ రోజు ఎక్కువ సమయం ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. వృత్తి పరంగా ఒక శుభవార్త వింటారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది.

వృశ్చికం
ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాదాలు లేదా కోర్టు కేసులు పరిష్కారానికి వస్తాయి. మిమ్మల్ని వ్యతిరేకించిన వారు మనసు మార్చుకొని మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది.

ధనుస్సు
ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలకు, విందు వినోదాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం మెరుగవుతుంది. అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. భూసంబంధ వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ సహాయం అందుతుంది.

మకరం
ఈ రోజు అధిక సమయం గృహ సంబంధ వ్యవహారాలకు కేటాయిస్తారు. మీ వాహనం లేదా ఇంటికి సంబంధించిన మరమ్మతులు పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. అప్పు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లిస్తారు.

కుంభం
ఈ రోజు మీ ఆవేశాన్ని కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. ముఖ్యంగా మీ బంధువులతో లేదా ప్రయాణంలో తోటి ప్రయాణికులతో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మీ ప్రవర్తన కారణంగా వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

మీనం
ఈ రోజు ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవటం మంచిది కాదు. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సంగీతం వినటం లేదా ఏదైనా వినోద కార్యకమంలో పాల్గొనటం మంచిది.