today astrology: 01 మే 2020 శుక్రవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపుకై ప్రయత్నాలు అధికం చేస్తారు. రుణ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గతుంది. పెంచుకునే ప్రయత్నం అవసరం. పట్టుదలతో కార్యసాధన అవసరం. పట్టుదలను పెంచుకోవాలి.
డా. ఎస్. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనుకోని కష్టాలు వస్తాయి. పనులలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. లేని పోని కొత్త కొత్త సమస్యలు వస్తాయి. సమస్యలను ఎదుర్కొనే శక్తిని పెంచుకోవాలి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనవసరఖర్చులు చేస్తారు. విశ్రాంతి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పాదాల నొప్పులు వస్తాయి. పనుల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలపై చింతన బాగా పెరుగుతుంది. కాని ప్రయాణాల విషయంలో ముఖ్యంగా వ్యాపారస్తులు జాగ్రత్త వహించాలి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు చేయరాదు. వ్యాపార ప్రయత్నాలు ఆచి, తూచి నిర్ణయించాలి. సంఘంలో గౌరవంకోసం పాటుపడతారు. గౌరవం పెంచుకునే దిశగా ప్రయత్నం సాగించాలి. ఉన్నతులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పరిశోధకులకు ఆసక్తి పెరుగుతుంది. పరిశోధనలపై ఆలోచన పెంచుకుంటారు. వ్యాపార ధోరణిని పెంచుకుంటారు. వ్యాపార పనులపై ఆలోచన పెరుగుతుంది. తొందరపాటు పనికిరాదు. ఎన్ని పనులు చేసినా సంతృప్తి తక్కువగా ఉంటుంది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆచి, తూచి వ్యవహరించాలి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు పెరుగుతాయి. నూతన పరిచయాలతో కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. భాగస్వాముల విషయంలో జాగ్రత్త అవసరం. మోసపోకుండా జాగ్రత్త వహించాలి. వ్యపారస్తులు తమ ప్రయత్నాలలో కొంత ఒత్తిడి ఎక్కువౌవుతుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపుకై ప్రయత్నాలు అధికం చేస్తారు. రుణ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గతుంది. పెంచుకునే ప్రయత్నం అవసరం. పట్టుదలతో కార్యసాధన అవసరం. పట్టుదలను పెంచుకోవాలి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంతానం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడిని పెంచుకుంటారు. క్రియేటివిటీని కోల్పోతారు. పనులలో ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా కార్యరూపణ కనిపించదు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సౌకర్యాల వలన ఒత్తిడి అధికం అవుతుంది. సౌకర్యాలకోసం ఆలోచనలు తగ్గించుకోవాలి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాల్లో కొంత ఆలోచన అవసరం. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : కమ్యూనికేషన్స్ విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. దగ్గరి ప్రయాణాలపై ఆశ పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆస్తులను పెంచుకునే ఆలోచన చేస్తారు. వాక్ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు పెరుగుతాయి. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. చమత్కారమైన మాటలు వస్తాయి. సంతృప్తికర వాతావరణం పెరుగుతుంది.