today astrology: 8జులై 2020 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి లాభాలు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆదర్శవంతమైన జీవితంకోసం ఆరాట పడతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పెద్దలంటే గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

today dinaphalithalu 8th july 2020

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని కష్టాలు. శ్రమకు తగిన ఫలితాలకోసం ఎదురుచూపులు చూస్తారు. పరామర్శలు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. అన్ని పనులలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : లాభాలు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆదర్శవంతమైన జీవితంకోసం ఆరాట పడతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పెద్దలంటే గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

మిథునం :(మృగశిర3,4పాదాలు,ఆర్ద్ర,పునర్వసు1,2,3పాదాలు): సంఘంలో కీర్తికోసం ఆరాట పడతారు.వ్యాపారస్తులకు తొందరపాటు పనికిరాదు. శ్రమకు తగిన ఫలితంకోసం ఎదురుచూపులు ఉంటాయి. ఉద్యోగస్తులకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగసంబంధ ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. తోటిఉద్యోగస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. దూర ప్రయాణాలపై ఆలోచన వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎన్ని పనులు చేసినా సంతృప్తి తక్కువగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రావడంలో జాప్యం జరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువౌతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పరామర్శలు చేస్తారు. శ్రమకు తగిన ఆదాయం కోసం ఆలోచిస్తారు.  క్రయవిక్రయాలలో జాగ్రత్తగా ఉండాలి. అహంకారం రాకుండా చూసుకోవాలి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాల్లో లోపం ఏర్పడుతుంది. పనులు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది. నూతన పరిచయస్తులతో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. భాగస్వామ్య వ్యాపారాలు ఒత్తిడికి గురి చేస్తాయి.  అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోటీల్లో గెలుపుకై తపిస్తారు.  ఋణసంబంధ ఆలోచనలు తీరుతాయి. శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. పనులలో ఒత్తిడి అధికం అవుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాలి. గుర్తింపుకోసం ఆరాటం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత శ్రమ ఏర్పడవచ్చు.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సంతానం విషయంలో ఆలస్యం జరుగవచ్చు. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సృజనాత్మకత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు.  క్రియేటివిటీ తగ్గుతుంది. ఆలోచనల వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. గృహ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి.  ప్రయాణాల్లో తొందరపాటు పనికిరాదు. ఊహించని ఇబ్బందులు వస్తాయి.  విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు. ఆహారంలో సమయ పాలన మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సోదరుల సహకారం లభిస్తుంది.  దగ్గరి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. పరామర్శలు అధికం అవుతాయి. ప్రచార ప్రసార సాధనాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది.  పరాక్రమంతో పనులు పూర్తి చేస్తారు.

కుంభం :(ధనిష్ఠ3,4పాదాలు,శతభిషం,పూర్వాభాద్ర1,2,3పాదాలు): వాక్ చాతుర్యం తగ్గుతుంది. మధ్యవర్తి వ్యవహారాలు పనికిరావు. మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పనికిరాదు. కుటుంబ సంబంధాల్లో లోటుపాటు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  నిల్వధనం కోల్పోయి సూచనలు ఉన్నాయి. దానధర్మాలు చేయడం మేలు. గృహ సంబంధ విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శారీరకశ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. అనుకున్న పనులుపూర్తి చేయడంలో ఆలస్యం జరుగవచ్చు. పనులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. పట్టుదలతో పనులు చేయాలి. ప్రయత్నం తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios