Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 25 ఫిబ్రవరి 2021 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

today dinaphalithalu 25th feb 2021
Author
Hyderabad, First Published Feb 25, 2021, 7:16 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 25th feb 2021

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు.  ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు శ్రమాధిక్యం. కొన్ని పనులు మధ్యలో  వాయిదా. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు. దైవదర్శనాలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో విశేషం. గౌరవం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు అంచనాలు నిజం కాగలవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు రుణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. బంధువులతో విభేదాలు. దైవదర్శనాలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు  ఉద్యోగయత్నాలలో పురోగతి. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కొత్త రుణాల కోసం యత్నాలు. ఆరోగ్యభంగం. పనులల్లో అవాంతరాలు. దైవచింతన. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు పనులు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని  చికాకులు. కళాకారుల ప్రయత్నాలు ముందుకు సాగవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు నూతన పరిచయాలు. గౌరవమర్యాదలు పొందుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.  ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు శ్రమ పెరుగుతుంది.వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఒప్పందాలు వాయిదా. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios