today astrology: 19 మార్చి 2020 గురువారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలకై దుర్వినియోగం అవుతుంది. పరామర్శలు తప్పవు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.
డా. ఎస్. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : విశ్రాంతి లభించదు. పాదాల నొపలు వస్తాయి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. గౌరవఖర్చులు ఉంటాయి. తమకంటే ఉన్నతమైన వారితో సంప్రదింపులు చేస్తారు. గౌరవం కోసం ఆరాటపడతారు. విద్యార్థులకు, పరిశోధకులకు కొంత ఒత్తిడితో కూడిన సమయం.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలకై దుర్వినియోగం అవుతుంది. పరామర్శలు తప్పవు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. అధికారులతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి తప్పదు. భాగస్వాములతో అనుకూలత పెంచుకోవాలి. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పరిశోధకులకు కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వాములతో కలిసి పనిచేస్తారు. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పరామర్శలు చేసే సూచనలు. అధికారులతో అనుకూలత అవసరం. శత్రువులపై విజయం కోసం ఆరాటపడతారు. రుణ సంబంధ ఆలోచనలు ఒత్తిడిని కలిగిస్తాయి. రోగనిరోధకశక్తి పెంచుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. పనుల ఒత్తిడి పెరుగుతుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం మంచిది. సంతాన ఆలోచనల్లో సంతోషం ఏర్పడుతుంది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పోటీల్లో గెలుపు సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. సౌకర్యాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. గృహ సంబంధ నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. క్రియేటివిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సంతాన సంబంధ ఆలోచనల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. వాటికోసం ఆలోచన తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. వాక్ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కమ్యూనికేషన్స్ వల్ల అనుకూలత పెరుగుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. దగ్గరి ప్రయాణాలుంటాయి. విద్యార్థులకు కొంత ఒత్తిడి సమయం. శ్రమకు తగిన గుర్తింపుకోసం ఆరాటపడతారు. అనుకున్న పనులు పూర్తిచేయడంలో ఒత్తడి పెరుగుతుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మధ్యవర్తిత్వాలు పనికిరావు. కుటుంబ సంబంధాల విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. విందులు వినోదాల్లో పాల్గొనాలనే ఆలోచన చేస్తారు. విశ్రాంతికై ప్రయత్న చేస్తారు. విహార యాత్రలు అధికం అవుతాయి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శారీరక శ్రమ అధికం అవుతుంది. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. లాభాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తిచేయాలనే ఆలోచనతో ఉంటారు.