Asianet News TeluguAsianet News Telugu

Today astrology: 17 నవంబర్ 2021 బుధవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ రోజు సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.

Today dinaphalithalu 17th november 2021
Author
Hyderabad, First Published Nov 17, 2021, 4:46 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు వ్యవహారాలలో  ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ధనలాభం. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


  

 

Follow Us:
Download App:
  • android
  • ios