Asianet News TeluguAsianet News Telugu

Today astrology: 16 నవంబర్ 2021 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. 

Today dinaphalithalu 16th november 2021
Author
Hyderabad, First Published Nov 16, 2021, 5:17 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు పనులలో జాప్యమే. దూర ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యయప్రయాసలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహార విజయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య భంగం. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలలో లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు ఆటుపోట్లు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు.  వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ వివాదాలు పరిష్కారం. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త ఆశలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు వ్యయప్రయాసలు. రాబడికి మించి ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు.  దూర ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు బదిలీలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఆర్థిక  ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులతో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపార విస్తరణ యత్నాలు వాయిదా. ఉద్యోగ మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆసక్తికర సమాచారాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా సమస్యలు.  బంధువర్గంతో  విరోధాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు స్థాన చలనం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు నూతన ఉద్యోగయోగం. మిత్రుల నుంచి కీలక సమాచారం. రాబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు కీలక సమాచారం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios