మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మాటవిలువ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. నిల్వ ధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పరుచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. శారీరక సౌఖ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. అభిరుచులు మారుతూ ఉంటా యి. ముఖ వర్చస్సు దేహకాంతి పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతి లభిస్తుంది. పనుల ఒత్తిడి తగ్గించు కుంటారు. అనవసర ఖర్చులు చేస్తారు. సుఖంకోసం ఆలోచిస్తారు. దేహసౌఖ్యం లోపిస్తుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు.  విహార యాత్రలు చేయాలనే కోరిక పెరుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం. లాభాలు వచ్చినా సమయానికి ఉపయోగపడవు. ఇతరులపై ఆధారపడతారు. అన్ని రకాలాదాయాలు ఆనందాన్నివ్వవు.  సమిష్టి ఆశయాలకై ప్రయత్నిస్తారు. దానధర్మాలు చేయడం మంచిది. శ్రీమాత్రేనమః జపం మేలు చేస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. చేసే వృత్తుల్లో నైపుణ్యం పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం.  రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెడతారు. పెద్దలంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధకులకు అనుకూల సమయం. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. శుభవార్తలు వినే అవకాశం. విద్య నేర్చుకోవడం ద్వారా గౌరవం పెరుగుతుంది. సజ్జన సాంగత్యం చేస్తారు. దూరదృష్టి పెరుగుతుంది.  సంతృప్తి లభిస్తుంది. శ్రీమాత్రేనమః జపంమంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనుకోని ఆదాయాలు వస్తాయి. అవమానాలను ఎదుర్కొంటారు. చెడు సహవాసం చేసే ప్రయత్నం. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. క్రయ విక్రయాలు చేస్తారు. ఆకస్మిక లాభ నష్టాలు వచ్చే సూచనలు. దానధర్మాలు మేలు చేస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సామాజిక అనుబంధాలు ఒత్తిడిని తీసుకొస్తాయి. నూతన పరిచయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల వైపు ఆలోచన ఉండరాదు. మోసపోయే అవకాశం. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. భాగస్వామ్య అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. పలుకుబడి తగ్గవచ్చు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు రాకపోవచ్చు. ఋణ సంబంధ ఆలోచనల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. స్త్రీలతో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతాన ఆలోచనలు ఫలిస్తాయి. సంతానం వలన సంతోషం కలుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. లలిత కళలపై దృష్టి పెరుగుతుంది. వంశపారంపర్య ఆలోచనలు వృద్ధి చేసుకునే అవకాశం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆహారం వలన అనుకూలత ఏర్పడుతుంది.  సౌకర్యాలపై దృష్టి పెంచుకుంటారు. వాటికోసం తాపత్రయ పడతారు. విద్యార్థులు తక్కువ శ్రమతో ఫలితాల సాధన ఉంటుంది. స్త్రీల ద్వారా అనుకూలతలు పెంచుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : స్త్రీల ద్వారా సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి.  రచనలపైదృష్టి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. పరామర్శలు చేస్తారు.  తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రకటనలపై దృష్టి పెడతారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.