today astrology: 11 మార్చి 2020 బుధవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతానం వల్ల అనుకూలత. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. దగ్గరి బంధువుల సహకారం. దగ్గరి ప్రయాణాలు. రచనలపై ఆలోచనలు. అతీంద్రియ శక్తులపై ఆలోచన. అనుకున్న పనులు పూర్తి.
డా. ఎస్. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శతృవులపై విజయం సాధిస్తారు. శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. అప్పులుతీర్చే ఆలోచన, ఇచ్చిన అప్పులు వెనక్కి వచ్చే అవకాశం. పోటీల్లో గెలుపు. సౌకర్యాలపై దృష్టి ఉంటుంది. ఆహారంలో అనుకూలత.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సంతానం వల్ల అనుకూలత. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది. దగ్గరి బంధువుల సహకారం. దగ్గరి ప్రయాణాలు. రచనలపై ఆలోచనలు. అతీంద్రియ శక్తులపై ఆలోచన. అనుకున్న పనులు పూర్తి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాతృసౌఖ్యం లభిస్తుంది. ఆహారంపై దృష్టి ఎక్కువ. విద్యార్థులు కష్టపడి చదువుతారు. వాహనసౌకర్యాలు ఉంటాయి. మాతృ వర్గీయులతో అనుకూలత. కొంత అనారోగ్య భావన. నిత్యావసర ఖర్చులపై ఆలోచన. క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : రచనలపై ఆసక్తి. దగ్గరి ప్రయాణాలు. దగ్గరి బంధువుల సహకారం. తోటి వ్యక్తులతో అనుకూలత. మాటల్లో నూతనోత్సాహం. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలిస్తాయి. చదువుపై దృష్టి. సహోద్యోగులతో అనుకూలత.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : నిల్వ ఉన్న ధనం పెంచుకోవాలనే ఆలోచన. కుటుంబంలో సంతోషకరమైన మార్పులు. మాటల్లో అనుకూలత. కంటి సంబంధ అనుకూలతలు. ప్రాథమిక విద్యలపై దృష్టి. అనవసర ఖర్చులు. కొంత జాగ్రత్త అవసరం.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం. వెంటనే అలసి పోతారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో దృష్టి. ఆలోచనల్లో వైవిధ్యం. ప్రయత్నశీలత ఉంటుంది. కష్టసుఖాలు వెంట వెంటనే మారిపోతాయి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అనవసర ఖర్చులపై దృష్టి. నిద్రకు సమయపాలన అవసరం. తెలియని వ్యాధులు. మానసిక ప్రశాంతత కోల్పోవడం, పాదాల సంబంధ నొప్పులు. దేహసౌఖ్యం లోపిస్తుంది. దూర ప్రయాణాలపై దృష్టి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనుకోని ఆదాయాలు. స్త్రీల ద్వారా ఆదాయం. కొంత దురాశ ఏర్పడుతుంది. కళానైపుణ్యం. ఆదర్శవంతమైన జీవితం. అన్నిరకాలఅభివృద్ధులు. ఉపాసనపై ఆలోచన.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంఘంలో గౌరవం కోసం ఆరాటం. గౌరవం లభిస్తుంది. ఇతరులపై దయ చూపడం, వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతి. అధికార కాంక్ష, అధికారిక ప్రయాణాలు, ప్రయాణాల్లో సంతృప్తి. ఊహించని ఇబ్బందులు. జాగ్రత్త అవసరం.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : తీర్థయాత్రలపై దృష్టి. విద్య నేర్చుకోవడం వల్ల గౌరవం పెరుగుతుంది. పరిశోధనలపై ఆసక్తి, దూరదృష్టి, గురువులతో అనుకూలత, న్యాయ విషయాలపై దృష్టి. అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఊహించని ఇబ్బందులు, అనుకోని కష్టాలు, చెడు సహవాసాలు, చెడు పనులపై ఆసక్తి, చెడు మార్గాల ద్వారా ఆదాయంపై దృష్టి, మానసిక ఒత్తిడి, చిత్త చాంచల్యం, ఇతరులపై ఆధారపడడం, ప్రయాణాల్లో జాగ్రత్తలు.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక సంబంధాలపై దృష్టి, సమాజంలో గౌరవం, భాగస్వాములతో అనుకూలత, వ్యాపారంపై దృష్టి, పోయిన వస్తువులు లభించడం, పలుకుబడికోసం ఆరాటం, కళత్రంతో అనుకూలత.