Asianet News TeluguAsianet News Telugu

today horoscope: 09 ఫిబ్రవరి 2021 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికిఈ రోజు ప్రయాణాలలో మార్పులుంటాయి.మిత్రులతో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఋణ ఒత్తిడి అధికమై నూతన ఋణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి

today dinaphalithalu 09th feb 2021
Author
Hyderabad, First Published Feb 9, 2021, 7:15 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today dinaphalithalu 09th feb 2021

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు బంధు, మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపైశ్రద్ధ చూపుతారు.వృత్తి, వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ప్రయాణాలలో మార్పులుంటాయి.మిత్రులతో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఋణ ఒత్తిడి అధికమై నూతన ఋణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. విమర్శాత్మక ధోరణి మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భూ సంబంధిత క్రయములో లాభంఉంటుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడిని అధిగమిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో ఆకస్మిక విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. వృత్తి,వ్యాపారాలలో చిక్కులు ఉంటాయి. ఉద్యగమున ఆలోచనలు కలిసి రావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు బంధు వర్గీయులు మీ మాటతో విబేదిస్తారు. ముఖ్యమైన పనులలో స్వంత ఆలోచనలు కలిసిరావు. కుటుంబ సంబంధిత బాధ్యతలుపెరుగుతాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. రాజకీయ సంబంధిత సమావేశాలకు హాజరవుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు కలుగుతాయి అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కుటుంబ సంబంధిత ఒత్తిడులు పెరుగుతాయి. అతి కష్టం మీద కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. బంధువులతో క్రయవిక్రయాల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరంగా నష్ట సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు సమాజంలో పెద్దవారి నుండి ప్రశంసలు పొందుతారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఖర్చులను మించిన ఆదాయం కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు నూతన కార్యక్రమాలకు వేసిన ప్రణాళికలు తారుమారు అవుతాయి. ఇతరులనుండి విమర్శలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమవుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి బంధు వర్గం వారితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ఆదాయంబాగుంటుంది.ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. రుణబాధల నుండి బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్యసమస్యలు తొలగుతాయి. సంతానం విద్యా విషయాల సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరులతో వివాదాలపై పైచేయి సాధిస్తారు. నూతన ఉద్యోగ లబ్ధి కలుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూరప్రాంత మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి వాహన కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో లభించిన అవకాశాలు జారవిడవకుండా చూసుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios