Asianet News TeluguAsianet News Telugu

today astrology: 24 మే 2020 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. పదిమందిలో గుర్తింపు పెంచుకునే ప్రయత్నం. తమకంటే ఉన్నతులతో ఆచి, తూచి వ్యవహరించాలి. అన్ని పనుల్లో ఒత్తిడి అధికం అవుతుంది.

today dinaphalitahlu 24th may 2020
Author
Hyderabad, First Published May 24, 2020, 7:03 AM IST

డా. ఎస్‌. ప్రతిభ

మేషం :(అశ్విని,భరణి,కృత్తిక 1వపాదం) : లాభాలు సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదర్శవంతమైన జీవితం కోసం ప్రయత్నం చేస్తారు. ఉన్నతాధికారులతో అనుకూలత పెరుగుతుంది. దానధర్మాలు చేస్తారు.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. పదిమందిలో గుర్తింపు పెంచుకునే ప్రయత్నం. తమకంటే ఉన్నతులతో ఆచి, తూచి వ్యవహరించాలి. అన్ని పనుల్లో ఒత్తిడి అధికం అవుతుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పరిశోధకులకు మంచి అవకాశం. పరిశోధనలపై ఆలోచనలు పెరుగుతాయి. ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సంతృప్తి తక్కువగా ఉంటుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. పరామర్శలు చేస్తారు. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సామాజిక అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. నూతన పరిచయస్తులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు బంధువులు పెరుగుతారు. భాగస్వామ్య అనుబంధాలు విస్తరింపచేసుకుంటారు. గౌరవం కోసం పాటు పడతారు.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పోటీలలో గెలుపు సాధిస్తారు. ఆటలు మొదలైన విషయాలపై శ్రద్ద పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొండితనంతో పనులు పూర్తి చేస్తారు. అహంకారం పెరుగుతుంది.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : క్రియేటివిటీ తగ్గుతుంది. ఒత్తిడితో పనులు పూర్తి చేస్తారు.  మానసిక ఘర్షణ పెరుగుతుంది. సంతాన సంబంధ ఆలోచనల్లో బాధ కలుగుతుంది. ప్రణాళికలకు అనుకూలమైన పనులు పూర్తి చేయడంలో శ్రమ అధికం అవుతుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  సౌకర్యాల వలన ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మాతృవర్గీయుల వలన సహకారం కోసం ఎదురుచూపులు. విద్యార్థులకు ఒత్తిడి సమయం. ఇంటి సంబంధ పనులు వాయిదా వేయుట మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గీయులతో అనుబంధాలు పెంచుకుంటారు. రచయితలకు మంచి అవకాశం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మీడియారంగం వారికి కొంత ఒత్తిడి ఏర్పడుతుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వాగ్దానాలు పనికిరావు. మధ్యవర్తిత్వాలు పనికిరావు. నిల్వధనం కోల్పోయే సూచనలు. కుటుంబం సంబంధాల మధ్య బాంధవ్యాలు తగ్గకుండా చూసుకోవాలి. మాట్లాడేటపడు ఆచి, తూచి మాట్లాడాలి. మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఎంతటి కష్టాన్నైనా భరించే శక్తి కలిగి ఉంటారు.  ప్రణాళికలను పూర్తిచేసే ప్రయత్నంలో ఉంటారు.  పనుల ఒత్తిడి అధికం అవుతుంది.  మొండితనంతో పనులు పూర్తిచేస్తారు. ప్రమాదాలకు అవకాశం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతికై ఆలోచిస్తారు. తొందరగా దొరకదు. పాదాల నొప్పులు ఉంటాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రమాదాలకు అవకాశం పెరుగుతుంది.  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

Follow Us:
Download App:
  • android
  • ios