Asianet News TeluguAsianet News Telugu

ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు.!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  ఉద్యోగమనందు పని  ఎక్కువగా నుండును. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించవలెను. ఊహించని ప్రయాణాలు ఏర్పడతాయి .

Today dina Phalithalu of 26th march 2023 ram
Author
First Published Mar 26, 2023, 5:24 AM IST

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:     
 
తేది : 26 మార్చి 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రం
ఋతువు : వసంత ఋతువు
పక్షం : శుక్లపక్షం                                                                                       
వారము: ఆదివారం
తిథి :   పంచమి రాత్రి 7.07 ని. వరకు
నక్షత్రం :    కృత్తిక సాయంత్రం 4.32 ని. వరకు  
వర్జ్యం:       లేదు
అమృత ఘడియలు:.  మధ్యాహ్నం 2.04నిల 3.42 ని. వరకు    
దుర్ముహూర్తం:సా.04.30ని. నుండి సా.05.18ని. వరకు                               
రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                
  యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.                                                                              

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
సాంఘికముగా నిందారోపణలు ఏర్పడగలవు.ఉద్యోగులు ఉద్యోగమునందు కొంత ఇబ్బంది పడతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసర  ప్రయాణాలు వలన అలసట శారీరక బలహీనత ఏర్పడను. ప్రభుత్వ అధికారులతోటి కలహాలు ఏర్పడవచ్చును.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. సమాజమునందు చేదు అనుభవాలు మరియు ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం.  మానసికంగా శారీరకంగా బలహీన పడతారు. ఈరోజు ఈరాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
చిన్న చిన్న విషయాలలో పొరపాటులు ఇబ్బందులు ఎదురవుతాయి. పగ ప్రతీకారం కోపం వాటికి దూరంగా ఉండటం మంచిది. సమాజము నందు లౌక్యంగా వ్యవహరించవలెను.ప్రభుత్వం అధికారుల  స్నేహం వలన ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును.ఉద్యోగమనందు పని  ఎక్కువగా నుండును. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించవలెను. ఊహించని ప్రయాణాలు ఏర్పడతాయి . అనుకున్న పనులు మందకోడిగా సాగటం వలన మానసిక ఆందోళన పెరుగును. ఈరోజు ఈరాశి వారు ఓం షణ్ముఖయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
చేయి వ్యవహారములు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకొనవలెను. ఉద్యోగమునందు అసంతృప్తి వాతావరణ ఏర్పడుతుంది. సమాజము నందు నిందారోపణలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించవలెను. సామాజిక పరిస్థితుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. కొన్ని సంఘటనలు మానసికంగా ఆవేదన ఉద్రేకతులకు దారితీయును. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. దూరాలోచనలకు దుష్ట సాంగత్యం మునకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈరాశి వారు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఉద్యోగాలపరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. చేయి వ్యవహారములు లో కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ప్రభుత్వ సంబంధిత పనులలో కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. ఈరోజుఈ రాశి వారు ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
బంధువుల తో ఏర్పడిన వివాదాలు పరిష్కారమగును. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబవనందు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ప్రత్యర్ధులపై పై చేయి సాధిస్తారు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఈరోజు ఈరాశి వారు ఓంశశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి . ఓం త్రివిక్రమాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నిష్కారణంగా కొంతమందితో విభేదాలు ఏర్పడతాయి. కీలకమైన సమస్యల వలన ఆందోళనగా ఉంటుంది. ఆత్మీయులు తోటి సఖ్యతగా ఉండవలెను. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులయందుచేసే ప్రయత్నాలు పట్టుదలతోటి చేస్తే సఫలీకృతం అవుతాయి.మిత్రులు నమ్మకద్రోహం చేసే అవకాశం .ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించడం  కష్టంగా నుండును. తేజ వ్యవసాయ వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకొని వలెను. ఈరోజు ఈరాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం గృహ సంబంధమైన పనులు కలిసి వస్తాయి. అనుకోకుండా కొన్ని అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఎంత బయటా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగులకు సహోదయోగుల ఆదరాభిమానాలు పొందుతారు. శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించును. సామాజిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈరోజు ఈరాశి వారు ఓంఅష్టలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అభివృద్ధి కొరకు చేయినూతన విధానాలు వలన మంచి ఫలితాలు పొందవచ్చు . వృత్తి వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. కీలకమైన సమస్య పరిష్కారం అవుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధి కొరకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మానసిక ప్రశాంతత సంతృప్తి కలుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం త్రిపురాంతకాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
సామాజిక పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదురవుతాయి. సమస్యల వలన మానసిక వేదనకు గురి అవుతారు. ఈరోజు మీ అంచనాలు తల క్రిందలు అవుతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది. ఆదాయం తగ్గి అనుకోని ఖర్చులు పెరగవచ్చు. వృత్తి వ్యాపారాలు వ్యవహారాలు కలిసి రాకపోవచ్చు. బంధుమిత్రులతో విరోధములు చికాకులు ఏర్పడను. ప్రయాణమందు జాగ్రత్త అవసరము. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండను. ఈరోజు ఈ రాశి వారు ఓం నీలకంఠాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆర్థికస్వల్ప లాభాలు.చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత. మనస్సు నందు ఆందోళన. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు. ఉద్యోగస్తులకు పై అధికారుల మూలంగా చికాకులు. చేయు వ్యవహారములు నందు బుద్ధి స్థిరత్వం లేకపోవడం వలన కొత్త సమస్యలు ఏర్పడగలవు. ఈరోజు ఈరాశి వారు ఓం కీర్తి లక్ష్మీనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

శుభవార్త వింటారు.కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. విందు  వినోదాలలో పాల్గొంటారు.విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విలాస వందవైన వస్తువుల కొరకు అధిక ఖర్చు చేస్తారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలుకీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.వ్యాపారాలు లాభసాటిగా మార్చేందుకు చేయి కృషి ఫలించును . శారీరిక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. ప్రయత్నించిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. ఈరోజు ఈరాశి వారు ఓం రాజ్యలక్ష్మి నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ఆర్థిక సహాయం అందుతుంది. చిన్న చిన్న సమస్యలే అని నిర్లక్ష్యం చేయకూడదు. సమస్యల యందు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగ్గ ధన లాభం కలుగుతుంది. చేయు పని యందు ఆవేశం తగ్గించుకొనివ్యవహరించవలెను.  నూతన వస్తు వాహన సౌఖ్యం లభించును. సంతాన అభివృద్ధి ఆనందం కలుగజేస్తుంది.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సమాజం నందు పెద్దవారి యొక్క పరిచయాలు పెంచుకుంటారు. ఈరోజు ఈరాశి వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Follow Us:
Download App:
  • android
  • ios