8సెప్టెంబర్ 2019 ఆదివారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి గృహం ద్వారా ఆనందాన్ని పొందుతారు. వాహనం సమయానికి లభిస్తుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలు సంతోషాన్ని ఇస్తాయి. మృష్టాన్న భోజనంపై దృష్టి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొాంరు.

today 8th september 2019 your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పరామర్శలు చేస్తారు. సంతాన సౌఖ్యం లభిస్తుంది. సంతానం ద్వారా ఆనందం పెరుగుతుంది. మానసిక ప్రశాంతతకై ప్రయత్నం చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. ప్రణాళికలకు అనుగుణంగా  పనులు పూర్తి చేసుకుాంరు. చేసే పనుల్లో సంతృప్తి, సంతోషం కనబడతాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : గృహం ద్వారా ఆనందాన్ని పొందుతారు. వాహనం సమయానికి లభిస్తుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాలు సంతోషాన్ని ఇస్తాయి. మృష్టాన్న భోజనంపై దృష్టి పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొాంరు. సంతృప్తి లభిస్తుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అడ్వర్‌టైజ్‌ మెంట్ల ద్వారా ఆనందం కలుగుతుంది. ప్రకటనలు ఉపయోగిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. విహార యాత్రలపై దృష్టి పెరుగుతుంది.విద్యార్థులకు అనుకూల సమయం. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు ఉపయోగపడతాయి.  అన్ని పనులను చక్కపెడతారు. పెండింగ్‌ పనులు తమ మాటల ద్వారా పూర్తి చేస్తారు. చురుకుగా పనులను పూర్తిచేస్తారు. ఆదాయం పెంచుకునే మార్గాలు చూస్తారు. స్థిరాస్తులు, బంగారం మొదలైన వాిపై దృష్టి పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శరీరం పనులకు అనుకూలంగా ఉంటుంది. అలంకరణపై దృష్టి పెడతారు. తమను తాము అందంగా చూసుకునే ప్రయత్నం చేస్తారు. చిత్త చాంచల్యం పెరుగుతుంది. పనుల్లో నెమ్మదత్వం పెరుగుతుంది.  ఎక్కువ శ్రమకు ఇష్టపడకపోవచ్చు. సౌఖ్యంగా కాలం గడపాలనే ఆలోచన పెరుగుతుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  విశ్రాంతి లభిస్తుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలకై వెచ్చిస్తారు. ప్రయాణాల్లో ఆసక్తి పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొాంరు. విహాయ యాత్రలపై దృష్టి పెరుగుతుంది. ఉన్న ధనాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేయాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అన్ని రకాల లాభాలు విస్తరిస్తాయి. లాభాలు సంతృప్తికరంగా ఉంాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. స్త్రీలతో అనుకూలత ఏర్పడుతుంది. కళాకారులకు అనుకూలమైన సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. చేసే అన్ని పనుల్లో గుర్తింపు లభిస్తుంది. శ్రీమాత్రేనమః జపం.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : గౌరవం పెంచుకుాంరు. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతికోసం ఆలోచనలు వస్తాయి. ప్రమోషన్స్‌లపై దృష్టి సారిస్తారు. తక్కువ శ్రమ ఎక్కువ గుర్తింపు  వస్తుంది. ప్రయాణాల్లో అనుకూలత లభిస్తుంది. తమ చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యతిరేకతలను అధిగమిస్తారు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విద్యార్థులకు అనుకూల సమయం. పరిశోధనలపై ఆసక్తి చూపుతారు. నూతనాంశాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో సౌకర్యాలకోసం ఎదురు చూపులు ఉంాయి. కొంత వరకు సంతృప్తితో కూడిన జీవితం ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆకస్మిక లాభాలకై ప్రయత్నిస్తారు. పరామర్శలు ఉంాయి. శ్రమలేకుండా విస్తరణ విషయంలో దృష్టి సారిస్తారు. అనుకోని ప్రయాణాలపై ఆలోచన పెరుగుతుంది. ఊహించని ఇబ్బందులు వస్తాయి. ఎన్ని వచ్చినా వాిని తట్టుకుని నిలబడగలుగుతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామజపం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. పనులలో ఆటంకాలు కలుగుతాయి. చిత్త చాంచల్యం అధికం అవుతుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు కొంత ఒత్తిడితో కూడిన సమయం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పోీల్లో గెలుపుకోసం కొంత శ్రమ పడాల్సి ఉంటుంది.ఋణ సంబంధాలు ఇబ్బందిని కలిగిస్తాయి. శత్రువులతో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. ఏవైనా వ్యవహారాలు చేసేవి పోస్ట్‌పోన్‌ చేసుకోవడం మంచిది. ఏ పని చేసినా ఆచి, తూచి వ్యవహరించాలి. మొండితనంతో పనులు పూర్తి చేయరాదు.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios