26అక్టోబర్ 2018 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

today 26th oct2018 your horoscope

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటం. పోటీ ల్లో విజయాలకై తపిస్తారు. శత్రువుల వల్ల అనుకోని కష్టాలు వస్తాయి. ఋణాల వల్ల ఆటంకాలు కలుగుతాయి. రోగనిరోధకశక్తి తగ్గుతుంది. శారీరక వ్యాయామాలు అవసరం. అన్యమనస్కంగా ఉంటారు. ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. లక్ష్మీ పూజ చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సృజనాత్మక పెరుగుతుంది. సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రణాళికా బద్ధమైన పనులు చేస్తారు. ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాతృసౌఖ్యం లభిస్తుంది. ఆహారంలో సంతోషం ఉంటుంది. ప్రయాణాల్లో సౌకర్యాలు ఉంటాయి. ఆరోగ్యంపైన దృష్టి ఉంచడం మంచిది. సుగంధ ద్రవ్యాలకై వెచ్చిస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి. విష్ణు స్తుతి ఉపయోగకరమైనది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ప్రయాణాల్లో సంతోషం లభిస్తుంది. విహార యాత్రలపై దృష్టి పెడతారు. దగ్గరి ప్రయాణాలకై ప్రయత్నిస్తారు. తోి వర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ వల్ల అనుకూల ఏర్పడుతుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. చిత్త చాంచల్యం కనిపిస్తుంది. లక్ష్మీ ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మాట విలువ పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. నిల్వ ధనం పై దృష్టి పెడతారు. ధన సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. సంతోషకరమైన వాతావరణంతో ఉంటారు. లక్ష్మీ పూజ శుభ ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన జీవితం గడుపుతారు. ఆలోచనలు అనుగుణంగా పనులు మార్చుకుటాంరు. చక్కి రూపం ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఆశయ సాధన చేస్తారు. కష్టసుఖాలు సమానంగా ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణం శుభం చేకూరుస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. విలాస యాత్రలపై దృష్టి ఉంటుంది. విలాసవంతమైన ఖర్చులు చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. చేసే పనుల్లో సంతోషం లభిస్తుంది. అన్ని విధాల ఖర్చులు చేస్తారు. దానధర్మాలకు ఖర్చు పెట్టడం మంచి ఫలితాలనిస్తుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సమిష్టి ఆశయాలపై దృష్టి ఉంటుంది. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. సమిష్టి ఆదాయాలు వస్తాయి. అన్ని రకాల లాభాలు చేకూరుతాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. కంపెల్లో వాటాలకై ప్రయత్నిస్తారు. సాత్విక ఉపాసనపై దృష్టి ఉంటుంది. విష్ణుసహస్రనామ పారాయణం మంచి ఫలితాలనిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంఘంలో గౌరవం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులతో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగులతో మైత్రి లభిస్తుంది. చేసే వృత్తుల్లో సంతోషం అభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ఆలోచనలో ఉంటారు. శారీరక వృద్ది ఉంటుంది. విష్ణుసహస్రనామ పారాయణం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది. బంధువులతో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన తగ్గుతుంది. సజ్జన సాంగత్యం కొంత ఉపకరిస్తుంది. జాగ్రత్తలు అవసరం. విష్ణుసహస్రనామ పారాయణం, విష్ణుస్తుతి బాగా ఉపకరిస్తాయి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకోని లాభాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు తొలిగే సూచనలు కనిపిస్తాయి. శ్రమలేని ఆదాయం వస్తుంది. అనుకోని ఖర్చులు పెడతారు. ఇతరులపై ఆధారపడతారు.  క్రయ విక్రయాలపై దృష్టి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజిక అనుబంధాల్లో మార్పు ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. భాగస్వాములతో అననుకూలత ఉంటుంది. పలుకుబడికోసం ఆరాటపడతారు. వ్యాపారస్తులకు జాగ్రత్త అవసరం. సుగంధద్రవ్యాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనుల్లో ఆలస్యం ఉంటుంది. విష్ణు స్తుతి అనుకూలిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios