Asianet News TeluguAsianet News Telugu

21నవంబర్ 2019 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పెట్టుబడులు ఇబ్బందికి గురిచేస్తాయి. పనుల్లో చిత్తచాంచల్యం. కార్య సాధనలో పట్టుదల అవసరం. ఆలోచనలకు అనుగుణంగా ఆశయాల మార్పు. అనారోగ్య సమస్యలు. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. భాగస్వాములతో జాగ్రత్త. తొందరగా మోసపోయే అవకాశాలు ఏర్పడతాయి.

today 21st november 2019 your horoscope
Author
Hyderabad, First Published Nov 21, 2019, 8:27 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) : ఆకస్మిక లాభాలు వస్తాయి. శ్రమలేని సంపాదన పై దృష్టి ఉంటుంది. క్రయ విక్రయాలపై దృష్టి ఉంటుంది. ఆరోగ్య లోపాలు నివారణ. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదనకు యత్నం. ఇతరులపై

ఆధారపడతారు. కళాకారులకు కొంత ఒత్తిడితో కూడిన సమయం ఏర్పడుతుంది.

వృషభం : (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) : పెట్టుబడులు ఇబ్బందికి గురిచేస్తాయి. పనుల్లో చిత్తచాంచల్యం. కార్య సాధనలో పట్టుదల అవసరం. ఆలోచనలకు అనుగుణంగా ఆశయాల మార్పు. అనారోగ్య సమస్యలు. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. భాగస్వాములతో జాగ్రత్త. తొందరగా మోసపోయే అవకాశాలు ఏర్పడతాయి.

మిథునం : (మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కళాత్మక భావనలపై దృష్టి పెరుగుతుంది. కళారంగం వారికి పోటీలు అధికంగా ఉంటాయి. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు ఉంటాయి. పోటీల్లో గెలుపుకై శ్రమ అవసరం. గుర్తింపుకోసం ఆరాటపడతారు. ఋణ సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం : (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : కళారంగం వారి ఆలోచనలకు అనుకూలమైన కార్యాచరణ. మానసిక ప్రశాంతత. సృజనాత్మకత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులకు ఆనందకర వాతావరణం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచల్లో సంతృప్తి లభిస్తుంది. సంతానం వలన సమస్యలు తగ్గుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఒత్తిడి, శ్రమతో సౌకర్యాలు లభిస్తాయి. సంతృప్తి ఉంటుంది. మాతృసౌఖ్యం ఉంటుంది. మృష్టాన్న భోజనంపై దృష్టి ఉంటుంది. సుగంధ ద్రవ్యాలకై ఆలోచిస్తారు. అన్నిరకాల అభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాల్లో సంతృప్తి లభిస్తుంది. సౌకర్యాల వలన కొంత జాగ్రత్త అనంతరం సంతోషం లభిస్తుంది.

కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : స్త్రీల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. రచలపై దృష్టి సారిస్తారు. సమీప వ్యక్తులు బంధువులతో అనుబంధాలు పెరుగుతాయి. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి. విహారయాత్రలు చేసే ఆలోచన. అడ్వర్టైజ్ మెంట్లకు అనుకూల సమయం. విద్యార్థులు తక్కువ శ్రమతో లాభాలు.

తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తులవైపు దృష్టి ఉంటుంది. బంధాలు, బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం : (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పట్టుదలతో కార్యచరణ ఉంటుంది. పనుల్లో ప్రణాళికలు ఉంటాయి. ఆలోచనలను అనుగుణంగా మార్పు ఉంటుంది. సమిష్టి ఆదాయాలు. కృషి శీలత ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కళారంగంలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఒక్కోసారి వస్తుంది. ఒక్కోసారి రాదు.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) : విశ్రాంతి లభిస్తుంది. విలాసాలకోసం ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలపై ఆలోచిస్తారు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. సుఖం కోసం ఆలోచిస్తారు. సుఖ సంతోషాలపై ఆలోచిస్తారు. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేస్తారు.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సమిష్టి ఆశయాలపై దృష్టి ఉంటుంది. సమిష్టి ఆదాయాలపై దృష్టి పెడతారు. కళాకారులకు మంచి అభివృద్ధి లభిస్తుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. అన్ని విధాలా ఆదాయాలు. ఉపాసన పై దృష్టి పెడతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారాదుల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యనిర్వహణలో సంతోషం.

కుంభం : (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సామాజిక అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి పై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. చేసే అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. ఇతరులపై ఆధారపడతారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి అధికంగా ఏర్పడుతుంది.

మీనం : (పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విద్యార్థులకు కష్టకాలం. ఉన్నత విద్యలకై ప్రయత్నం. ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. దూరదృష్టి ఉంటుంది. చేసే పనుల్లో జాగ్రత్త అవసరం. పరిశోధకులకు ఒత్తిడి ఉంటుంది. చేసే అన్ని పనుల్లోనూ సంతృప్తి తక్కువగా ఉంటుంది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios