Asianet News Telugu

19నవంబర్ 2019 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

today 19th november 2019 your horoscope
Author
Hyderabad, First Published Nov 19, 2019, 7:20 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మేషం

ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. అనుకోని ప్రయాణం చేయవలసి రావచ్చు. ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన రోజు కాదు.

 

వృషభం

ఈ రోజు మీ మనస్సు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

 

మిథునం

ఈరోజు ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగత్తగా ఉం డటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శేలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.

 

కర్కాటకం

ఈరోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

 

సింహం

ఈరోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

 

కన్య

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

 

తుల

ఈరోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పైఅధికారులను కలవడానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

 

వృశ్చికం

ఈ రోజు మీరు దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి స్నేహితులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గరవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకుంటారు.

 

ధనుస్సు

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూల దినం కాదు.

 

మకరం

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన ఒప్పందాలు పూర్తి చేస్తారు. మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగవుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. బ్యాంకు లేదా బంధువుల నుంచి ఆర్థిక సహాయం అందుకుంటారు.

 

కుంభం

ఈరోజు మీ కుటుంబ వ్యవహారాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. మీ పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. నూతన వ్యాపార ఒప్పందాలకు అనుకూలమైన రోజు కాదు. మీ తొందరపాటు కారణంగా మోసానికి గురయ్యే ఆవకాశముంటుంది.

మీనం

ఈరోజు మీ జీవిత భాగస్వామి స్థిరాస్తులకు సంబంధించి అనుకూలత ఏర్పడుతుంది. మీ వృత్తిలో శ్రమ అధికంగా ఉంటుంది. మీ ఆలోచనలను మీ సహోద్యోగులు తక్కువ చేసి చూసే అవకాశముంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వాహన విషయంగా డబ్బు ఖర్చు చేయటం జరుగుతుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios