మేషం వాక్ చాతుర్యం తగ్గుతుంది. మాట విలువ తగ్గుతుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో గౌరవ హాని ఏర్పడుతుంది. నిల్వ ధనంపై దృష్టి పెరుగుతుంది. కంటి సంభంద లోపాలు పెరిగే ఆలోచన. స్నేహ సంభందాలు విస్తరిస్తాయి. సంపాదనకు ప్రయత్నం చేస్తారు. 

వృషభం శారీరక శ్రమ అధికం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కార్య సాధనలో పట్టుదళ ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు చేస్తారు. శ్రమ కు తగిన గుర్తింపు లభిస్తుంది. చక్కని కృషి శీలత ఉంటుంది.

మిథునం విశ్రాంతికి ప్రయత్నం. నిత్యావసర ఖర్చులు పెరుగుతాయి. అన్నివిధాలా ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. దేహ సౌఖమ్ లోపిస్తుంది. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది.

కర్కాటకం పెద్దల ఆశీసులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. స్త్రీల ద్వారా ఆదాయం పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు పూర్తి చేస్తారు. సంఘ వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది

సింహం వృత్తిలో సంతోషం. అధికారులతో అనుకూలత. అధికార ప్రయాణాలు చేస్తారు. అధిక సంభంద విసయంలో  సంతృప్తి ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకి ఆరాటం పెరుగుతుంది. రాచ కార్యాలపై ద్రుష్టి పెరుగుతుంది. పెద్దలంటే గౌరవం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

కన్య  పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు ఒత్తిడితో కూడిన సమయం. శుభ కార్యాలయంలో పాల్గొనాలనే ఆలోచన . ఆహారంలో జాగ్రత్త అవసరం. శాస్త్ర విజ్ఞానం పెంచుకునే ప్రయత్నం . దూర ద్రుష్టి ఉంటుంది. 

తుల ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం. శ్రమ లేని ఆదాయంపై ద్రుష్టి. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడతారు. ఆకస్మిక ఇబ్బందులు ఉంటాయి.

వృశ్చికం సామాజిక అనుభందాల్లో అనుకూలత. భాగ స్వామ్య సహకారం లభిస్తుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పదిమందిలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలసమయం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనుస్సు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శారీరక శ్రమ అధికం. గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో గెలుపు. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణ సంభంద ఆలోచనలు తీరుతాయి. వృత్తి విద్యాలపై ఆసక్తి పెరుగుతుంది. నష్టవస్తు పరిజ్ఞానం ఉంటుంది.

మకరం సంతాన సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువ. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. ఆత్మీయత తక్కువ అవుతుంది. లలితా కళలపై  ఆసక్తి ఉంటుంది. సంతృప్తి తక్కువ. సృజనాత్మకత  లోపిస్తుంది. కళాకారులకు అనుకూల సమయం.

కుంభం సౌకర్యాలవల్ల ఒత్తిడి పెరుగుతుంది. సుఖం కోసం ఆలోచిస్తారు. మాతృ సౌఖ్యం లోపిస్తుంది. ఆహార విషయంలో గాగ్రత్త అవసరం. అనారోగ్య భావన ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మీనం స్రీలద్వారా సహకారం లభిస్తుంది. పరాక్రమం ఉంటుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. సంభాషణలు అనుకూలిస్తాయి. కమ్యూనికేషన్ వాళ్ళ సంతృప్తి ఏర్పడుతుంది. ప్రచార ప్రసార సాధనాలు లాభిస్తాయి.

డా.ఎస్.ప్రతిభ