Asianet News TeluguAsianet News Telugu

చెడు దృష్టి మన మీద పడకుండా ఉండాలంటే..!

ఆ చెడు దృష్టి నుంచి మిమ్మల్ని , మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఈ కింది చిట్కాలు ఫాలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం..
 

Tips To Drive Away From Buri Nazaar
Author
Hyderabad, First Published Mar 29, 2022, 3:36 PM IST

మనం ఏ పని చేసినాన.. మనపై చెడు దృష్టి మనపై పడకుండా ఉండేలా చూసుకోవాలంటూ మన పెద్దలు చెబుతూ ఉంటారు. నిత్యం మన చుట్టూ.. ఆత్మల దృష్టి మనవైపు ఉంటుందట. వాటినే ప్రతికూల, దుష్టశక్తులు అని కూడా అంటారు. ఆ దృష్టి మన మీద పడితే.. జరగాల్సిన పని జరగకుండా ఆగిపోతుందట. మరి ఆ చెడు దృష్టి నుంచి మిమ్మల్ని , మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఈ కింది చిట్కాలు ఫాలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం..


చెడు కన్ను , ఆత్మల విషయానికి వస్తే  జీలకర్ర మనకు అద్భుతమైన రక్షకుడిగా ఉంటాడట.  కాబట్టి, మీరు రక్షించాలనుకుంటున్న వస్తువు లేదా వస్తువుతో కొంత మొత్తంలో జీరాను ఉంచాలి.

జీరాను ఉప్పుతో కలపండి. మీ ఇల్లు లేదా ఆఫీసు నేలపై వేయండి. ఇది దుష్ట ఆత్మలు మీ ప్రైవేట్ ప్రదేశంలోకి ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తుంది లేదా తొలగిస్తుంది. మీరు జీలకర్ర, ఉప్పు కలిపి ఉంచిన ప్రదేశంలోకి అసలు ఎలాంటి దుష్ట ఆత్మలు ప్రవేశించకుండా ఉంటాయట.

జీలకర్రను అగరబత్తులతో కాల్చండి. అలా కాల్చడం వల్ల వచ్చిన సువాసన మీ ఇల్లు ,కార్యాలయంలో వ్యాపించనివ్వండి. ఇది పర్యావరణాన్ని ప్రశాంతపరుస్తుంది. మీ స్థలంలో ఉన్న  దుష్టశక్తుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

కొత్తగా పెళ్లయిన జంటలు లేదా చాలా కాలంగా కలిసి ఉన్నవారు కొద్దిగా జీలకర్రను ఉప్పును కొద్దిగా బ్యాగ్‌లో (కొంచెం చిటికెడు మాత్రమే) కలుపుకుని, ఆ బ్యాగ్‌ని ఎల్లవేళలా తీసుకెళ్లవచ్చు. ఇది ఏ ప్రతికూల ఆత్మలు లేదా చెడు కన్ను వారి వివాహ బంధంలోకి ప్రవేశించకుండా ఉంటాయి. దంపతుల మధ్య విభేదాలు రాకుండా ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios