Asianet News TeluguAsianet News Telugu

ఈ వారం( నవంబర్2 నుంచి నవంబర్8 వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మకర, కుంభ మీన రాశుల వారు ఈ వారం రోజులు అన్నదానం, తెల్లని వస్త్రాలు దానం చేస్తూ మానసిక ప్రశాంతతను పెంచుకునే ప్రయత్నం అధికంగా చేయాలి. ఏవైనా కొత్త పనులు ప్రారంభించే ముందు ఒకిరెండు సార్లు ఆలోచించి ఇతరులతో సంప్రదించి పనులు మొదలు పెట్టడం మంచిది.

this week(nov2nd to nov8th) your horoscope
Author
Hyderabad, First Published Nov 2, 2018, 10:22 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : మానసిక ఒత్తిడి ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సృజనాత్మకత తగ్గుతుంది. పోటీల్లో గెలుపుకై ఒత్తిడితో పనిచేస్తారు. శత్రువులపై విజయ సాధన చేయాలనే తపన పెరుగుతుంది. అనుకున్న పనులు ఒత్తిడితో పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు పెంచుకునే ప్రయత్నం. విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. అనుకున్న పనులు పూర్తి చేసే ప్రయత్న అధికంగా ఉంటుంది. లక్ష్మీ ఆరాధన, సూర్యారాధన, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు కనపడతాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నంలో అధిక శ్రమ పడతారు. సృజనాత్మకతను కోల్పోయే సూచనలు. కళాకారులు ఒత్తిడి గురి అవుతారు. సంతాన సమస్యలు పెరిగే సూచనలు. శత్రువులపై విజయం సాధించే ప్రయత్నం చేస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుల బాధలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సూర్యారాధన, లక్ష్మీ ఆరాధన శుభ ఫలితాలిస్తాయి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మాతృవర్గీయుల సహకారంపై దృష్టి పెడతారు. కమ్యూనికేషన్స్‌ అనుకూలించే సూచనలు ఉంటాయి. విద్యార్థులకు కొద్ది శ్రమతో అధిక ఫలితాలు సాధిస్తారు. రచనారంగంపై ఆసక్తి పెరుగుతుంది. సౌకర్యాలపై దృష్టి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆరోగ్యంపై దృష్టి అవసరం. ఆహారంలో సమయపాలన మంచిది. సంతాన సమస్యలు పెరిగే సూచనలు ఉంటాయి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. లక్ష్మీ ఆరాధన, సూర్యారాధన, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తే సూచనలు ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. చిత్త చాంచల్యాన్ని తగ్గించాలి. ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు కనపడుతున్నాయి. సహకారం వల్ల సంతృప్తి లభిస్తుంది. ప్రచార, ప్రసార సాధనాల్లో అనుకూలతలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూల సమయం ఉంటుంది. గృహ నిర్మాణ విషయంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థిక చింత పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. లక్ష్మీ ఆరాధన, సూర్యారాధన, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆలోచనలు ప్రణాళికలకు అనుగుణంగా మార్పు చేసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించే ఆలోచనలు చేసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నంలో తప్పటడుగులు వేసే సూచనలు. కుటుంబంలో ఆనాలోచిత ప్రవర్తన ఉంటుంది. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతో ఫలితాలు సాధిస్తారు. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. పరామర్శలు ఉంటాయి. పనుల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీ ఆరాధన, సూర్యారాధన, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం చేస్తారు. అనవసర ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. సహకారం వల్ల సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. గుర్తింపు అనుకున్నంతగా లభించదు. చిత్త చాంచాల్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. నూతన అవసరాలు పెంచుకునే సూచనలు కనబడుతున్నాయి. ధనంపై వ్యామోహం పెరుగుతుంది. వాటి వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. లక్ష్మీ ఆరాధన, శివారాధన అవసరం.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పనుల్లో సంతృప్తి లభిస్తుంది.  అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అన్ని పనుల్లో ఆదరణ లభిస్తుంది. గర్వాన్ని పెంచుకోకూడదు. విశ్రాంతిలోపం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. సమయానికి ఆహారం స్వీకరించాలి. గుర్తింపుకోసం ఆరాట పడకూడదు. ఆలోచనలకు అనుగుణంగా పనులు మార్చుకునే ప్రయత్నం చేయాలి. కార్యసాధనలో పట్టుదల అవసరం. సంతృప్తి లభిస్తుంది. కొంత జాగ్రత్త వహించడం మంచిది. లక్ష్మీ ఆరాధన, సూర్యారాధన, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నంపై దృష్టి అధికంగా ఉంటుంది. అధికారులతో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో ఆచి, తూచి వ్యవహరించాలి.  పెద్దల ఆశీస్సులకై ఎదురు చూపులు ఉంటాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం ఉంటుంది. కొద్ది శ్రమతో అధిక ఫలితాలు సాధిస్తారు. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విశ్రాంతి లభిస్తుంది. లక్ష్మీ ఆరాధన, సూర్యారాధన, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విద్యార్థులకు, పరిశోధకులకు ఒత్తిడి సమయం. అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. నిరాశ, నిస్పృహలు పెంచుకోరాదు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. పెద్దలయందు శ్రద్ధ, భక్తులు ఉంటాయి. శారీరక బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. విశ్రాంతి పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మానసిక అనుకూలతపై దృష్టి పెడతారు. తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. లక్ష్మీ ఆరాధన, సూర్యారాధన, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అనారోగ్య సూచనలు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. చెడు మార్గాలపై దృష్టి పెడతారు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. పరిశోధనలు సానుకూలం చేసుకునే ప్రయత్నం చేస్తారు. చేసే పనిలో ఆత్మవిశ్వాసం పెంచుకుటాఉంరు. శ్రమకు తగిన గుర్తింపుకోసం ఆరాట పడతారు. సంతృప్తి తక్కువగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. అధికారులతో అనుకూలతను పెంచుకునే ప్రయత్నం. పోటీలు అధికంగా ఉంటుంది. లక్ష్మీ ఆరాధన, సూర్యారాధన, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘంలో సానుకూలత పరిస్థితులకై ప్రయత్నిస్తారు. భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం ఉంటుంది. అనవసర ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం శ్రద్ధ అవసరం. ఆహారంలో సమయపాలన పాటిఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు స్వీకరించాలి. ఇతరులపై ఆధారపడతారు.పరిశోధనలపై దృష్టి తగ్గుతుంది. విద్యార్థులు చదువుపై ఆసక్తిని తగ్గించుకుటాఉంరు.  దూర దృష్టి ఉంటుంది. లక్ష్మీ ఆరాధన, సూర్యారాధన, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పోటీల్లో గెలుపుకై అధిక శ్రమచేస్తారు. వృత్తి విద్యలపై దృష్టి పెడతారు. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు పడతారు. శ్రమలేని ఆదాయంపై దృష్టి పెడతారు. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వాములతో కలిసి ఉండే ఆలోచన ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీ ఆరాధన, సూర్యారాధన, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

మకర, కుంభ మీన రాశుల వారు ఈ వారం రోజులు అన్నదానం, తెల్లని వస్త్రాలు దానం చేస్తూ మానసిక ప్రశాంతతను పెంచుకునే ప్రయత్నం అధికంగా చేయాలి. ఏవైనా కొత్త పనులు ప్రారంభించే ముందు ఒకిరెండు సార్లు ఆలోచించి ఇతరులతో సంప్రదించి పనులు మొదలు పెట్టడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

read more news

నవంబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios