Asianet News TeluguAsianet News Telugu

ఈ వారం(జనవరి25 నుంచి 31వరకు) రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this week jan25th to jan 31st your horoscope
Author
Hyderabad, First Published Jan 25, 2019, 9:30 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనుకోని ఇబ్బందులు ఉంటాయి. సంతృప్తిలోపం ఉంటుంది. గౌరవం తగ్గే సూచనలు ఉంటాయి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. పనులు వాయిదా వేయడం మంచిది. ప్రవర్తనలో మార్పు ఉంటాయి. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. అధికారిక వ్యవహారాల్లో లోపాలు ఉంటాయి. ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పరిచయాలు విస్తరిస్తాయి. లాభాలు పెంచుకుటాంరు.  అనుకోని సమస్యలకు అవకాశం ఉంటుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో ఆనందకర వాతావరణం ఉంటుంది. భాగస్వాములతో అనుకూలత పెరుగుతుంది. పనుల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. గృహ, వాహనాదులపై దృష్టి ఉంటుంది.  శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చాంచల్యం కూడా ఉంటుంది. చాంచల్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. భాగస్వాములతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆహార విహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మాట విలువ తగ్గుతుంది. కమ్యూనికేషన్స్‌ పెంచుకుటాంరు. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతానంతో సంతోషంగా వ్యవహరిస్తారు. సృజనాత్మకతతో పనులు పూర్తిచేస్తారు. వ్యతిరేకులు ఉన్నా విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. అనుకోని ఇబ్బందులు ఉంటాయి. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. మాటల్లో నిరాశ ఏర్పడుతుంది. అధికారిక ఒత్తిడులు ఉంటాయి. నూతనపరిచయాల వల్ల ఒత్తిడులు. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : లాభాలు సంతోషాన్నిస్తాయి. గృహ వాహనాది సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దల ఆశీస్సులుటాంయి. అనుకున్న పనులు శ్రమతో నెరవేరుతాయి. మాతృవర్గంతో సంతృప్తి చెందుతారు.  ఆలోచనల్లోఒత్తిడులు ఉంటాయి.నిర్ణయాదుల్లో లోపాలు ఉంటాయి. పరామర్శలకు అవకాశం ఉంటుంది. విశ్రాంతి లోపాలుటాంయి. సంప్రదింపుల్లో సంతోషం ఉంటుంది. అభీష్టాలు నెరవేరుతాయి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : పెద్దలతో సంప్రదింపులుటాంయి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. నిర్ణయాల్లో అనుకూలత ఉంటుంది.అన్ని పనుల్లో లాభాలు ఉంటాయి. సంతానం వల్ల సమస్యలుటాంయి. నిర్ణయాదుల్లో ఒత్తిడి ఉంటుంది. సౌఖ్యలోపం ఉంటుంది. లాభాలు ఉన్నా సంతృప్తి ఉండదు. పనులు వాయిదా వేయాలి. అనుకున్న పనులు పూర్తి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : కుటుంబ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. విద్య, ఉద్యోగాదుల్లో కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చయాలి. మాట విలువ పెరుగుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాదుల్లో జాగ్రత్తగా మెలగాలి. ఖర్చులు పెట్టుబడులు అధికంగా ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనుకోని ఇబ్బందులు ఉన్నా అధిగమిస్తారు. ఊహించనిసంఘటనలు ఉంటాయి. ఆత్మ విశ్వాసంతో పనిచేస్తారు. తొందరపాటు పనికిరాదు. ఆలోచనలకు శ్రమతో రూపకల్పన వస్తుంది. మాట విలువ తగ్గుతుంది. కుటుంబంలోఒత్తిడులు ఉంటాయి. నిల్వ ధనం తగ్గుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కమ్యూనికేషన్స్‌ బాగా విస్తరిస్తాయి. సంతోషంగా గడుపుతారు. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : గౌరవం కోసం సమయాన్ని వెచ్చిస్తారు. భాగస్వాములతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అనుకూలం ఉంటుంది. నిర్ణయాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. విశ్రాంతి లభిస్తుంది. మాల్లో చమత్కారం ఉంటుంది. అన్ని పనుల్లో లోపాలు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి.  ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యతిరేకతలు ఉన్నా విజయం సాధిస్తారు. గుర్తింపు పెరుగుతుంది. శ్రమ తప్పక పోవచ్చు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకూలత ఏర్పడుతుంది.  వ్యర్థమైన ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. దాన ధర్మాలు చేస్తారు. వ్యాపార వర్గ సహకారం లభిస్తుంది. అనారోగ్య భావనలు పెంచుకుటాంరు. శారీరక ఒత్తిడి తగ్గించుకోవాలి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అభీష్టం నెరవేరుస్తాయి. విజయసాథన ఉంటుంది. గుర్తింపు గౌరవాదులు లభిస్తాయి. శ్రమక తప్పక పోవచ్చు. కొత్త నిర్ణయాలు ఉంటాయి. వ్యతిరేక ప్రభావాలుటాంయి. కొన్ని అనుకోని ఒత్తిడులు ఉంటాయి. ప్రయాణావకాశాలు ఉంటాయి. భాగస్వాములతో అనుకూలత పెంచుకుటాంరు. ఊహించని సంఘటనలు జరుగుతాయి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆహార విహారాల్లో అత్యంత అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  భాగస్వాముల వల్ల అనకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతానంతో ఒత్తిడులు ఉంటాయి. వ్యాపారస్తులతో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios