ఈ వారం(జనవరి18 నుంచి 24వరకు) రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this week(jan18th to jagn24th) horoscope is here

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వాక్‌ చాతుర్యం పెరగుతుంది. కుటుంబంలో గౌరవం వృద్ధి చెందుతుంది. నిల్వ ధనంపై ఆసక్తి ఉంటుంది. అనుకోని ఇబ్బందులు వస్తాయి. సంతృప్తిలోపం ఉంటుంది. పెద్దలతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికం. ఆలోచనల్లో ఒత్తిడులు ఉంటా యి. సంతానవ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. సౌకర్యాలు మెరుగుపరుచుకుటా ంరు. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పరిచయాలు విస్తరిస్తాయి. లాభాలు పెంచుకుటా ంరు. అనుకోని సమస్యలకు అవకాశం. కుటుంబ ఆర్థికాంశాల్లో శుబపరిణమాలు. పెరుగుతాయి. భాగస్వామ్య అనుకూలత ఉంటుంది. పనుల్లో జాగ్రత్త అవసరం. ఊహించిసంఘటనలు జరుగుతాయి. సంప్రదింపుల్లో ఇబ్బందులు ఉంటా యి. సహకార లోపాలు ఉంటా యి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. మాటల్లో చమత్కారం. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విశ్రాంతి లభిస్తుంది. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నిస్తారు. శారీరక శ్రమ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. చాంచల్యం కూడా పెరుగుతుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో  ప్రశాంతంగా వ్యవహరించాలి. అనవసర విషయాలను వదిలివేయాలి. దాచుకున్న ధనం కోల్పోతారు. మాట విలువ తగ్గుతుంది. అనారోగ్య భావనలు ఉంటా యి. సమాచారాలు  ఇబ్బందిని కలిగిస్తాయి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.  కళాకారులకు అనుకూల సమయం. సంతానంతో సంతోషంతో గడుపుతారు. క్రియేివిటీతో పనులు పూర్తి చేస్తారు. వ్యతిరేకులున్నా విజయం సాధిస్తారు. సుదూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. గుర్తింపులు ఉన్నా సంతోషం లభించదు. వ్యాపార అనుబంధాలు పెరుగుతాయి. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అధికారులతో అప్రమత్తత అవసరం. అధికారిక ప్రయాణాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా మెలగాలి. ఎన్ని పనులు చేసినా ఒత్తిడి తప్పదు. లాభాలు సంతోషాన్నిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దల ఆశీస్సులు ఉంటా యి. అనుకున్న పనులు శ్రమతో పూర్తిచేస్తారు. పరామర్శలకు అవకాశం ఉంటుంది. ఒత్తిడితో విజయ సాధన ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గిపోయేసూచన. శ్రీమాత్రే నమః జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంతృప్తిలోపం ఉంటుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పెద్దలతో సంప్రదింపులు ఉంటా యి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. మంచివార్తలు వింరు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. ఆశించిన సౌఖ్యం అందకపోవచ్చు. లాభాలున్నా సంతృప్తి ఉండదు. పనుల వాయిదా మంచిది. అభీష్టసిద్ధిలభిస్తుంది. సంతాన సమస్యలు ఉంటా యి. సౌఖ్యలోపం ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : పరామర్శలకు అవకాశం ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటా యి. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభపరిణామాలు వస్తాయి. ఉన్నత వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. సేవకవర్గ సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యవహారాలు చర్చకు వస్తాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆహార విహారాల్లో సంతోషం. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు విస్తరిస్తాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. అనుకోని ఇబ్బందులు ఉన్నా వాిని అధిగమిస్తారు. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. తొందరపాటు పనికారాదు. కమ్యూనికేషన్స్‌ బాగా విస్తరిస్తాయి. లాభాలుఉంటాయి . అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కీర్తి ప్రతిష్టలపై దృష్టి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వ్యతిరేకతులు ఉన్నా విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు ఉంటుంది. గౌరవం కోసం సమయాన్ని కేయిస్తారు. భాగస్వాములతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అనుకూలిస్తాయి. నిర్ణయాదుల్లో అనుకూలత ఉంటుంది. విశ్రాంతి లభిస్తుంది. సమస్యలున్నా నేర్పుతో అధిగమిస్తారు. భాగస్వామాల్లో శుభపరిణామాలు ఉంటా యి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంతానం వల్ల సంతోషం ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. మానసిక ఒత్తిడి ఉన్నా అన్ని పనులను అధిగమిస్తారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యతిరేకతలు ఉన్నా విజయం సాధిస్తారు. గుర్తింపు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనారోగ్య సూచనలుఉంటాయి . పనులు వాయిదా వేయటం మంచిది. నైరాశ్యంగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనారోగ్య సమస్యలు ఉంటా యి. ఆహారంలో సమయపాలన మంచిది. సౌకర్యాదుల విషయంలో ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులున్నా విజయసాధన మంచిది. శ్రమతప్పక పోవచ్చు. ఆశించిన విజయం అందకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కాలం, శ్రమ వ్యర్థం అవుతాయి. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : స్త్రీల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. సౌకర్యాలు పెంచుకుటా ంరు. ఆహార విహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యతి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లో శుభపరిణామాలు చోటుచేసుకుఉంటాయి . ఆలోచనల్లో రూపకల్పన ఏర్పడుతుంది. పెద్దల విషయంలో జాగ్రత్తగా మెలగాలి. వ్యతిరేకతలుఉంటాయి  విజయం సాధిస్తారు. శ్రీరామ జయరామ జయజయరామరామ మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios