ఈ వారం( అక్టోబర్19 నుంచి అక్టోబర్ 25 వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

this week horoscope is here

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులుపూర్తి. ఇతరులపై ఆధారపడతారు. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటా యి. సమిష్టి ఆదాయాలు లభిస్తాయి. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. పాదాల నొప్పులు ఉంటా యి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కార్యసాధనలో పట్టుదలఅవసరం. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు చేయాలి. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి. లక్ష్మీఆరాధన, సుబ్రహ్మణ్యారాధన.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. చేసే వృత్తులలో గౌరవం ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. స్త్రీల ద్వారా ఆదాయ మార్గాలు. పరాశ్రయం ఉంటుంది. కళానైపుణ్యం పెరుగుతుంది. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. సుఖం కోసం ఆలోచిస్తారు. అన్ని రకాల ఖర్చులు చేస్తారు. సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీ ఆరాధన, గణపతి పూజ ఉపయోగపడతాయి.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. పరిశోధనలపై ఆసక్తి తగ్గుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. సజ్జన సాంగత్యం ఉంటుంది. పెద్దలతో అనుకూలత కనిపిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకునే ప్రయత్నం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో  అనుకూలత ఉంటుంది. శరీర బలం పెంచుకునే ప్రయత్నం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. దురాశ పెరుగుతుంది. సమిష్టి ఆదాయాలు ఉంటా యి. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : అనుకోని ఇబ్బందులు ఉంటా యి. ఊహించని సమస్యలు ఉంటా యి. ఇతరులపై ఆధారపడతారు. ఆకస్మిక నష్టాలు వచ్చే సూచన ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విదేశ వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. శాస్త్రపరిజ్ఞానంతగ్గుతుంది. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. గౌరవం తగ్గే సూచన ఉంటుంది. రాజకీయ విషయాలపై దృష్టి పెడతారు. అధికారం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. శారీరక బలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఉంటుంది. పదిమందిలో గౌరవం కోసం చూస్తారు. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. భాగస్వాములతో సంతోషం ఏర్పడుతుంది. మిత్రులతో సంతోషం ఉంటుంది. అనారోగ్య భావనలు ఉంటా యి. క్రయ విక్రయాలపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. అవమానాల పాలు కాకుండా జాగ్రత్త పడాలి. లాభనష్టాలు సమానంగా ఉంటాయి. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదనకై ప్రయత్నం. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం ఉంటుంది. ఋణసంబంధ ఆలోచనల్లో ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి విద్యలపై దృష్టి పెడతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నూతన పరిచయస్తులతో అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామ్య అనుబంధాలు వృద్ధి చెందుతాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. అనుకోని ఇబ్బందులు ఉంటా యి. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. క్రయ విక్రయాల్లో లోపం ఉంటుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిత్త చాంచల్యం తగ్గుతుంది. విద్యార్థులకు ఒత్తిడి సమయం. సంతాన సమస్యలు అధికంగా ఉంటుంది. కళాకారులకు అనుకూల సమయం.  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. శారీరకబలం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆహార ధాన్యాలు అనుకూలం. పదిమందిలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. సామాజిక అభివృద్ధి ఉంటుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విద్యార్థులకు అనుకూల సమయం. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం.  ఆహారంలో సమయ పాలన అవసరం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచన ఉంటుంది. మాతృసౌఖ్యం లోపిస్తుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడితో కార్యసాధన ఉంటుంది. సంతాన సమస్యలు ఉంటా యి. చిత్త చాంచల్యం ఎక్కువగా ఉంటుంది.  పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. ఒత్తిడితో కార్య సాధన ఉంటుంది. శత్రువులపై విజయం చేకూరుతుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తాయి. వాక్‌ చాతుర్యం పెరుగుతుంది. మాతృవర్గీయుల, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. సంప్రదింపుల్లో అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. గృహ సంబంధ విషయాల్లో అనుకూలత లభిస్తుంది. కార్యసాధన ఉంటుంది. శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కుటుంబంకోసం తాపత్రయ పడతారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట వలన సంతోషం ఉంటుంది. సహకారాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రచార, ప్రసార సాధనాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. ఆహారంలో సమయ పాలన అవసరం. చిత్త చాంచల్యం తగ్గించుకోవాలి.  శివారాధన, గణపతి ఆరాధన, దుర్గాస్తోత్రపారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. మృష్టాన్న భోజనంపై దృష్టి ఉంటుంది. శారీరక శ్రమ ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావారణం ఉంటుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. శివారాధన, గణపతి ఆరాధన, దత్తాత్రేయ స్త్తోత్ర పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. చిత్త చాంచల్యం ఉంటుంది. దేహసౌఖ్యం లోపిస్తుంది. మానసిక ఒత్తిడి అధికం. పరాధీనత ఉంటుంది.  పాదాల నొప్పులు ఉంటా యి. శారీరక శ్రమ అధికం. కార్యసాధనలో పట్టుదల అవసరం. ఆలోచనల్లో మార్పు ఉంటుంది. అభిరుచులకు అనుగుణంగా ఆలోచనలనల మార్పు.  శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన. నిల్వధనాన్ని కోల్పోతారు. వాగ్దానాలవల్ల ఒత్తిడి ఉంటుంది. సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, గణపతి ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.

డా.ఎస్.ప్రతిభ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios