ఈ వారం( ఆగస్టు31వ తేదీ నుంచి సెప్టెంబర్వ6 తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శారీరక శ్రమ ఉంటుంది. పనుల్లో ఆలస్యం జరుగుతుంది. ఆలోచనల్లో మార్పులు వుంటాయి. ప్రణాళికా రూపకల్పన చేసుకోవాలి.
మాటల్లో సున్నితత్వం ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. నిల్వ ధనంపై దృష్టి పెడతారు. స్త్రీల సహకారం లభించే సూచన కనపడుతుంది.
కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలనిస్తాయి.
వృషభం :(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నిస్తారు. నిత్యావసర ఖర్చులపై దృష్టి సారిస్తారు. విహారయాత్రలపై దృష్టి ఉంటుంది. శ్రమతో కూడిన ఆనందం లభిస్తుంది. చిత్త చాంచల్యం కనిపిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మాటల్లో సంతోషం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. కొంత కంటి సంబంధ ఆలోచనలు ఉంటాయి. జాగ్రత్త అవసరం. లక్ష్మీపూజ చేసుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణం వినడం.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : కళలపై ఆసక్తి పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటాయి. ఆదర్శవంతమైన జీవితం కోసం ఆరాటపడతారు.
మానసిక వ్యధ ఎక్కువౌతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు. శారీరక శ్రమ
అధికమౌతుంది. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. పట్టుదలతో ప్రణాళికా రూపంగా పనులు చేసుకోవాలి. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : చేసే పనుల్లో జాగ్రత్త వహించాలి. అధికారులతో అప్రమత్తత అవసరం. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. అనుకోని ఇబ్బందులు వచ్చే సూచన. పెద్దలంటే గౌరవం ఉంటుంది. అధికారం కోసం ఆరాటపడతారు. మాతృవర్గీయుల ద్వారా ఆదాయాలు. అన్ని రకాల లాభాలపై దృష్టి పెడతారు. ఆశయాలకు అనుగుణంగా ఆలోచనలు మారుతాయి. విశ్రాంతికోసం ప్రయత్నిస్తారు. శత్రువుల వలన భయం. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఉన్నత విద్యలకై ప్రయత్నిస్తారు. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. సజ్జన సాంగత్యం లభిస్తుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులపై దయ, జాలి లాటి వి పెరుగుతాయి. కళలపై ఆసక్తి ఉంటుంది. సంఘ వ్యవహారాలను ప్టించు కుంటా రు. మానసిక చికాకు అధికంగా ఉంటుంది. పరాధీనత ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఎదురౌతాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. కొంత వ్యాపార
ధోరణి ఉంటుంది. దూరదృష్టితో ఆలోచిస్తారు. పెద్దలంటే గౌరవం ఏర్పడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. సంఘంలో
గౌరవం కోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలు పెరచుకునే ఆలోచనల చేస్తారు. వీరు 31, 1 తేదీల్లో ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. దానాలుచేయాలి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుకూల పెంచు కుంటారు. భాగస్వామ్య అనుబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పరిచయాల వల్ల సంతోషం కలుగుతుంది. వ్యాపారస్తులు కొంత జాగ్రత్త వహించాలి. చెడు పనులవైపు ఆలోచన వెళుతుంది. మానసిక అవమానాలు ఎక్కువ. ఇతరులపై ఆధారపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. 2,3,4 తేదీల్లో ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనారోగ్య భావన ఏర్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పదిమందిలో పలుకుబడికోసం ఆరాటపడతారు. వస్తువుల అమ్మకాలు కొనుగోలుపై దృష్టి పెడతారు. చెడు పనులంటే ఆసక్తి కలుగుతుంది. అవమానాన్ని తట్టు కుంటా రు. 5,6 తేదీల్లో ముఖ్యనిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కళలపై ఆసక్తి
ఏర్పడుతుంది. అందరితో ఆత్మీయ అనురాగాలు పెంచు కుంటా రు. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి.
పలుకుబడికై ఆరాటపడతారు. భాగస్వామ్య అనుబంధాలు విస్తరిస్తాయి. మానసిక చింత ఎక్కువగా ఉంటుంది. శ్రీ దత్తశ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : మాతృసౌఖ్యంకోసం ఆరాటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారం విషయాలో సమయాన్ని పాటించాలి. విద్యార్థులకు ఒత్తిడి సమయం. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఆత్మీయులతో జాగ్రత్త అవసరం. సృజనాత్మకతను కోల్పోతారు. పరిపాలన సమర్ధత తక్కువౌతుంది. కళలపై ఆసక్తి తగ్గుతుంది. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణ బాధలు తీరుతాయి. శ్రీదత్తశ్శరణం మమ జపంమంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. పరాక్రమంతో పనులు పూర్తి. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. సౌకర్యాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారం సమయానికి తీసుకోవాలి. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. సంతానం వల్ల అననుకూలత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మాటల్లో కొంత అలసత్వం కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంతతను కోల్పోతారు. నిల్వ ధనంపై ఆసక్తి పెరుగుతుంది. రచనలపై దృష్టి సారిస్తారు. తోటి వ్యక్తుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలపై దృష్టి పెడతారు. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పరామర్శలు చేస్తారు. చిత్త చాంచల్యం ఉంటుంది. జాగ్రత్త అవసరం. శ్రీ రామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.
read more news
31 ఆగస్టు 2018 శుక్రవారం మీ రాశిఫలాలు