ఈ వారం( 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : భాగస్వామ్య అనుబంధాలు పెరుగుతాయి. స్నేహితులతో అనుకూలత ఉంటుంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంటుంది. తమకన్న ఉన్నత వ్యక్తులతో ఆత్మీయత ఏర్పడుతుంది. అనుకోని ఇబ్బందులు ఏర్పడే సూచన. ఆకస్మిక ప్రమాదాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి. పూర్వపుణ్యం పెంచుకునే సమయం ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి సారిస్తారు. కీర్తి ప్రతిష్టలకు అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యలపై దృష్టి సారిస్తారు. శుభకార్యాల్లో పాల్గొనే సూచన ఉంటుంది. 19,20 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వీరికి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేసుకోవడం ఉత్తమ ఫలితాలనిస్తుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీల్లో గెలుపుకోసం తపన ఉంటుంది. అప్పులు తీసుకోవడంలో ఆలోచించాలి. అనారోగ్య భావన ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఔషధ సేవనం అవసరం. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య అనుబంధాల్లో సంతోషం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు ఉంటాయి. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఏర్పడతాయి. 21,22,23 తేదీల్లో ముఖ్య నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీరికి దత్తాత్రేయ స్వామి, సాయిబాబా ఆరాధన మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఆలోచనల్లో ఉన్నతి ఏర్పడుతుంది. ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. తమకన్న పెద్దవారితో పరిచయాలు అనుకూలిస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పోటీల్లో విజయం ఉంటుంది. తీసుకున్న అప్పులు తీరుస్తారు. నిత్యావసర ఖర్చులపై దృష్టి అధికంగా ఉంటుంది. సేవకజనులతో అనుబంధాలు పెరుగుతాయి. భాగస్వాములతో అనుకూలత ఏర్పడుతుంది. కొంత జాగ్రత్త అవసరం. వీరికి దత్తాత్రేయ మరియు సుబ్రహ్మణ్య ఆరాధనలు శ్రేయస్సును కలిగిస్తాయి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : గృహ సౌఖ్య లోపం ఉంటుంది. ఆహారంలో సమయ పాలన అవసరం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. సంతాన సంబంధ ఆలోచనల్లో ప్రశాంతత ఉంటుంది. కళలపై దృష్టి ఏర్పడుతుంది. ఉన్నత విద్యలపై ఆసక్తిపెరుగుతుంది. అతీంద్రియ విద్యలపై దృష్టి ఏర్పడుతుంది. పరామర్శలకు వెళుతారు. శారీరక బలం తగ్గుతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మాతృవర్గీయుల సహకారం ఏర్పడుతుంది. స్త్రీలకు అనుకూలత ఏర్పడుతుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రచార ప్రసార సాధనాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో అననుకూలత ఉంటుంది. సౌకర్యాలు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆలోచనల్లో వైవిధ్యం ఉంటుంది. చిత్త చాంచల్యం ఎక్కువ. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. సంతానం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. సృజనాత్మకత లోపిస్తుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మాట వల్ల గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతృప్తి లభిస్తుంది. నిల్వ ధనంపై ఆసక్తి ఏర్పడుతుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. గుర్తింపు లభిస్తుంది. సమీప వ్యక్తులతో అనుబంధాలు ఏర్పడతాయి. సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. అనుకూల సమాచారం లభిస్తుంది. తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం కాదు. మంచినీరు అధికంగా తీసుకోవాలి. ప్రాథమిక విద్యల వల్ల ఒత్తిడి లభిస్తుంది. అనారోగ్య భావన ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో అలసత్వం ఏర్పడుతుంది. ఆలోచనల్లో మార్పులు ఏర్పడతాయి. పట్టుదలతో కార్య సాధన చేయాలి. మాటల వల్ల గౌరవం పెరుగుతుంది. విద్యలో కృషి అవసరం. బ్యాంకు నిల్వలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కంటి సంబంధ లోపాలు ఏర్పడే సూచన. సంప్రదింపుల్లో అనుకూలత ఉంటుంది. సేవకుల సహకారం లభిస్తుంది. స్త్రీల ద్వారా అనుకూలత పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి సారిస్తారు. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : నిత్యావసర ఖర్చులకై ప్రయత్నం అధికం చేస్తారు. విహార యాత్రలపై దృష్టి ఏర్పడుతుంది. విశ్రాంతికై ప్రయత్నం ఉంటుంది. పాదాల సంబంధ నొప్పులు ఉంటాయి. శారీర శ్రమ వల్ల అలసట ఏర్పడుతుంది. పట్టుదల లోపిస్తుంది. అభిరుచుల్లో మార్పులు ఏర్పడతాయి. మాట్లాడేటప్పుడు ఆచి, తూచి వ్యవహరించాలి. దాని వల్ల మాట విలువ పెరుగుతుంది. స్నేహితులకోసం ఆరాటం పెరుగుతుంది. బ్యాంకు నిల్వలపై దృష్టి ఏర్పడుతుంది. శివునికి పూజ చేసుకోవడం సుబ్రహ్మణ్యారాధన మంచి ఫలితాలిస్తాయి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : స్త్రీల ద్వారా ఆదాయం పెరుగుతుంది. సమిష్టి ఆదాయంపై దృష్టి ఉంటుంది. కళలపై ఆసక్తి ఉంటుంది. ఆదర్శవంతమైన జీవితం. ఇతరులపై ఆధారపడి పనిచేస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి సారిస్తారు. విహార యాత్రలు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కష్టపడతారు. అభిరుచులు మారుతూ ఉంటాయి. సేవకులతో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీ దత్తశ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంఘంలో గౌరవం కోసం ఆరాటం ఉంటుంది. గౌరవం లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. విశ్రాంతి లోపిస్తుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. జాగ్రత్త అవసరం. సమిష్టి ఆదాయాలు లభిస్తాయి. ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది. ఉపాసనపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడి జీవిస్తారు. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : తమకంటే ఉన్నతులతో పరిచయాలు ఏర్పడతాయి. పూర్వపుణ్యాన్ని పెంచుకునే దిశగా ఆలోచిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్య నేర్చుకోవడం ద్వారా గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే ఆలోచన ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకోవాలనే ఆలోచన ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులతో అనుకూలత ఉంటుంది. కళలపై ఆసక్తి ఉంటుంది. అన్ని రకాల అభివృద్ధులు ఏర్పడతాయి. సేవకులతో అనుకూలత ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేయడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శ్రమలేని సంపాదనపై దృష్టి ఏర్పడుతుంది. చెడు మార్గాల ద్వారా ఆదాయం పై దృష్టి ఉంటుంది. అనారోగ్య భావన ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. ఊహించని ఆదాయాలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలపైదృష్టి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్య నేర్చుకోవడం ద్వారా గౌరవం పెరుగుతుంది. గురువులపై భక్తి పెరుగుతుంది. చేసే వృత్తుల్లో సేవకులు అనుకూలిస్తారు. ఉద్యోగం ద్వారా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. 17, 18 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
మేష, వృషభ, మీన రాశుల వారు అన్నదానం, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు దానం చేయడం మంచిది.
డా|| ఎస్. ప్రతిభ