ఈ వారం(15ఫిబ్రవరి నుంచి 21వరకు) రాశిఫలాలు
ఈ వారం(15ఫిబ్రవరి నుంచి 21వరకు) రాశిఫలాలు
--డా. ఎస్. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. మాటల్లో చమత్కారధోరణి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలపైదృష్టి ఉంటుంది. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. సౌకర్యాలపై దృష్టి ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలత ఉంటుంది. సంతానం వల్ల కొంత ఒత్తిడి అనంతరం ప్రశాంతత ఏర్పడుతుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు ఉంటాయి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలపైదృష్టి పెంచుకుటాంరు. చమత్కార ధోరణి ఏర్పడుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు.విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. శ్రమతో సౌకర్యాలను సాధిస్తారు. ఆహారంలో సమయ పాలన అవసరం. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : లాభాలు ఉన్నా సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఆచి, తూచి వ్యవహరించాలి. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి. శ్రమతో కార్యసాధన చేస్తారు. అనుకున్న పనులు ప్రణాళికల ద్వారా పూర్తిచేస్తారు. ఒత్తిడి ఉన్నా అనంతరం సంతోషం ఉంటుంది. వాక్ చాతుర్యం పెరుగుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పెట్టుబడులు విస్తరిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. విశ్రాంతికై ప్రయత్నం ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. శారీరక శ్రమ ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పట్టుదలతో కార్యసాధన అవసరం. వాక్‌ధోరణి వల్ల ఇబ్బందులు వస్తాయి. కుటుంబంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు ఉన్నాయి. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. ఒత్తిడి ఉన్నా పనులు సానుకూల పరుచుకుటాంరు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. గౌరవం కోసం ఆరాటపడతారు. పెట్టుబడులు విస్తరిస్తాయి. అనుకున్న లాభాలు సంపాదిస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. విశ్రాంతి లభిస్తుంది. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దానధర్మాలు అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంతృప్తి లోపం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు.వృత్తి ఉద్యోగాదులు అనుకూలిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు అనుకూల సమయం ఏర్పడుతుంది. చేసే పనులు ఆనందం ఉంటుంది. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఆకస్మిక ఇబ్బందులు ఉంటాయి. శ్రమలేని ఆదాయం ఆశ పెరుగుతుంది. ఊహలు ఎక్కువగా ఉంటాయి. పని తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా మెలగాలి. పనులు తొందరగా పూర్తి కావు. పూర్తి అయినా వాటిలో సంతృప్తి తక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాలపై ఆలోచన పెరుగుతుంది. ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. అన్ని పనుల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు ఉన్నా కొంత ఆలోచించాల్సి ఉంటుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. ఊహించని ఇబ్బందులు, ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతృప్తి తక్కువగా ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శ్రమతో గెలుపు సాధిస్తారు. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. రోగనిరోధకశక్తి పెంచుకుటాంరు. సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులు విస్తరిస్తాయి. నూతన పరిచయాలు అనుకూలం ఏర్పడుతుంది. విద్యార్థులకు కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. పెట్టుబడులు ఉన్నా ఊహించని ఇబ్బందులు ఉంటాయి. సంతృప్తి లోపం ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సంతానం వల్ల సమస్యలు పెరుగుతుంది. సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో గెలుపు సాధిస్తారు. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడుల వల్ల లాభం చేకూరుతుంది. అనుకోని ఖర్చులు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడి సమయం అధికంగా ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : శ్రమతో సౌకర్యాలను సమకూర్చుకుటాంరు. ఆహార విహారాదుల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. క్రియేటివిటీని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మానసిక ప్రశాంతత తక్కువౌ తుంది. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. విజయం సాధిస్తారు. రోగనిరోధక శక్తి ఉంటుంది. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడులు అభివృద్ధి చెందుతాయి. నూతన పరిచయాలు అనుకూలం. శ్రీ మాత్రే నమః జపం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి చేస్తారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించాలి. సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ప్రశాంతత అవసరం. పరిపాలన సమర్ధత తక్కువగా ఉంటుంది. సంతానంతో కొంత ఒత్తిడి, చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.