1. ఖాదర్‌ బాబా

ప్రస్తుతం ఎలా ఉంది?

15.2.2019 నుంచి 31.3.2022 వరకు శుక్ర మహాథలో శని అంతర్దశ జరుగుతుంది. అన్ని పనులు పోస్ట్‌పోన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. సేవకార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఫ్రీ సర్వీస్‌ చేయాలి. గుర్తింపు ఉండదు. కాని చేయాలి. ఫలితం ఆశించకూడదు. ఉదయం వాకింగ్‌, యోగా, ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ తెలియకపోతే తప్పనిసరిగా నేర్చుకొని చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి ప్రతీరోజూ తప్పనిసరిగా చేసి తీరాలి. దైవ చింతన బాగా పెంచుకోవాలి. ఏ పనుల్లోనూ బద్ధకించకూడదు. వ్యాపారాలు మొదలైన వాటి పైన దృష్టి ఉంచకూడదు.

కందిపప్పు, నూనె, పళ్ళు బాగా దానం చేసుకోవాలి. ఇష్టదేవతారాధన నిరంతరం చేస్తూ ఉండాలి.

2. వెంకటరమణ

ఉద్యోగం మరియు వివాహం

ప్రస్తుత సమయం అనుకూలంగానే ఉంది. ఈ సంవత్సరాంతం నుంచి అనగా నవంబర్‌ 2019 తర్వాత నుంచి ఇంకా మంచి థ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు చేసే ఉద్యోగాదుల్లో ఈ సంవత్సరాంతంలో మార్పులు వస్తాయి. వివాహానికి ప్రయత్నాలు చేయడం మంచిదే.

జాతకరీత్యా వైవాహిక జీవితంలో ఆలస్యం ఉంటుంది. చిన్నచిన్న ఇబ్బందులున్న కారణంగా జాతకాలు బాగా చూసుకొని మాత్రమే జీవిత భాగస్వామిని జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. వైవాహిక జీవితం ఇబ్బందికరంగా ఉన్నదని తెలుసుకొని జపం, దానాలు తప్పనిసరిగా చేసుకోవాలి.

దానం : బియ్యం, పాలు, పెరుగు, కందిపప్పు, మినపప్పు అత్యధికంగా దానం చేయడం మంచిది.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ జపం నిరంతరం తప్పనిసరిగా చేయాలి.

3. మేలక చిరంజీవి

ఉద్యోగం మరియు వివాహం

జీవితంలో ఒక ఉన్నతి అన్ని రకాల మంచి మార్పులు ఉంటాయి. 2020 మార్చి తర్వాత వైవాహిక జీవితంలో మంచి సెటిల్మెంట్ ఉంటుంది.

జపం : దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి వివాహం భాగ్యమారోగ్యం పుత్రలాభంచ దేహిమే

                                శ్రీ రాజమాతంగ్యై నమః అనే జపం నిరంతరం చేసుకోవడం మంచిది.

దానం :  1. నూనె అవసరం ఉన్నవారికి ఇంటి లో వాడుకోవడానికి, / పల్లీలు/ దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి.2. గోధుమరొట్టెలు / గోధుమపిండి / 3. కూరగాయలు  ఆకుకూరలు, / పెసరపప్పు, కాకరకాయలు దానం చేయడం తప్పనిసరి.

4. ఆంజనేయులు

వివాహం మరియు భవిష్యత్తు

26.4.2019 నుంచి 16.9.2020 వరకు మంచి సమయం. ప్రస్తుతం వివాహానికి అనుకూలంగానే ఉంది. గట్టిగా జపం దానం చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. మంచి సమయం ఉన్నప్పుడే మంచి పనులకు ప్రయత్నం చేయాలి.

మీరు దాన ధర్మాలు అధికంగా చేసుకోవాలి. ఎంత ఎక్కువ చేసుకుంటూ అంత తొందరగా మీరు అనుకున్న పనులు పూర్తిచేసుకోగలుగుతారు.

దానం : 1. నూనె అవసరం ఉన్నవారికి ఇంటి లో వాడుకోవడానికి, / పల్లీలు/ దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి.2. పులిహోర/ స్త్రీలకు అలంకరణ వస్తువులు, 3. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు, క్యారెట్, బీట్రూట్ 4. బియ్యం/ పాలు/ పెరుగు/, 5. దైవిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి/, చెట్లు నాటించాలి, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలి. ఈ దానాలు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఫలితం ఉంటుంది.

జపం : పరమేశ్వర వాల్లభ్య దివ్యసౌభాగ్య సుప్రభా, ఇష్టకామేశ్వరీ దద్యాత్‌ మాంగల్యానంద జీవనం. శ్రీ మాత్రే నమః జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

5. అశోక్‌ కుమార్‌

సమస్యలు ఎక్కువగా ఉన్నాయి? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ప్రస్తుతం ఉన్న థలు అంత అనుకూలమైనవి కావు. అన్ని సమస్యలకు ఉగాది తర్వాత నుంచి మంచి పరిష్కారం లభిస్తుంది. అన్ని విషయాల్లోనూ ఉన్నతి ఉంటుంది. ఉగాది వరకు సంయమనాన్ని పాటించాలి. తప్పదు.

దానం : 1. నూనె అవసరం ఉన్నవారికి ఇంటిలో వాడుకోవడానికి, / పల్లీలు/ దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి. 2. బియ్యం/ పాలు/ పెరుగు/, 3. దైవిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి/, చెట్లు నాటించాలి, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలి. 4. గోధుమరొట్టెలు / గోధుమపిండి / 5. కూరగాయలు  ఆకుకూరలు, / పెసరపప్పు, కాకరకాయలు దానం చేయడం తప్పనిసరి. ఈ దానాలు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఫలితం ఉంటుంది.

జపం : శ్రీ దత్త శ్శరణం మమ, శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం నిరంతరం చేసుకోవాలి.

ప్రశ్న సూటిగా స్పష్టంగా అడగండి. వివాహం గురించి అడిగేవారు తమకు అయ్యిందా కాలేదా, వైవాహిక జీవితంలో సమస్యలా అనే విషయం తెలుపండి.