శ్రీ శోభకృత్ నామ ఉగాది: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండనుందంటే...!
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన అవగాహన ఏర్పడుతుంది. ప్రజా సంక్షేమ పథకాలు కేంద్ర రాష్ట్రాలు పోటా పోటీగా అమలు చేస్తారు. ప్రజల మన్ననలు పొందగలరు.
ప్రతి ఏడాది ఉగాది చైత్ర మాసం శుక్ల పక్షం రోజున వస్తుంది. ఈ ఏడాది ఉగాది ఈ నెల 22 న వచ్చింది. ఈ పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాదిని శ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా పిలుస్తాం. మరి ఈ తెలుగు సంవత్సరం ప్రకారం... ఈసంవత్సరం మన దేశ, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
ఈ నవ నాయకులలో 8 ఆధిపత్యము లు శుభలకు ఒక ఆధిపత్యం పాపులకు వచ్చుటచే దేశ పరిస్థితులు బాగుండును. సుస్థిరపరిపాలన ప్రజారంజకంగా పరిపాలన చేయుదురు. ప్రపంచమంతా ఆర్థికమాన్యం ఉన్నప్పటికీ మన దేశ పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక రంగం పురోభివృద్ధి చెందుతుంది. వృద్ధి శాతం పెరుగును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన అవగాహన ఏర్పడుతుంది. ప్రజా సంక్షేమ పథకాలు కేంద్ర రాష్ట్రాలు పోటా పోటీగా అమలు చేస్తారు. ప్రజల మన్ననలు పొందగలరు. ప్రతిపక్షం వారు విమర్శలు చేసినప్పటికీ ప్రజలు పాలక పక్షం వైపు ఉంటారు.
ప్రభుత్వము నందు తన వర్గీయ వారితో కొన్ని వ్యతిరేకతలు ఏర్పడవచ్చును. ఆయనను సమర్ధించుకోగలరు. భారతదేశ ఖ్యాతి పెరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి. క్రీడారంగంలో అనేక విజయాలు లభించును. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. పర్యాటక రంగం బాగుంటుంది. ఈ సంవత్సరం మూడు కొంచెం కాబట్టి దేశమంతా మంచి వర్షాలు కురుస్తాయి. జలాశయాలు సంపూర్ణముగా నిండగలవు. జల వివాదములు పరిష్కారములు ఏర్పడగలవు. విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయదురు. గృహ నిర్మాణాధి వ్యవహారములు మందగించును.
తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే...
తెలంగాణా విషయానికి వస్తే... ముఖ్యమంత్రి తమ ప్రభావాన్ని పెంచుకునే దిసగా పావులు కదుపుతారు. ప్రతిపక్షాలు నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా కొన్ని సార్లు తమ మొండి పట్టుదల వీడరు. కేంద్రంలో సమన్వయం కొరవటంతో కొన్ని సమస్యలు వస్తాయి. కొన్ని వ్యూహాలతో రాజకీయంగా ఎదుగుదల కనిపించినప్పటికి అది శాశ్వతమైన ఫలితాలు ఇవ్వదు. ఆగస్ట్ తర్వాత జరిగే కొన్ని సంఘటనలు పాలక పక్షంలో కొన్ని కీలకమైన మార్పులకు దోహదం చేస్తాయి. దిష్టిదోషం కనపడుతోంది. అది యజ్ఞ యాగాలుతో కాస్త మందగించినా కొన్ని ముఖ్యమైన మార్పులకు దారి తీస్తుంది. ఈ సంవత్సరం కొంత అలజడిగా ఉన్నా మంచి ఫలితాలే తీసుకు వస్తుంది.
ప్రభుత్వము తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆలస్యము అయినా అమలు చేస్తారు. ప్రకృతి వైపరీత్యలు ఎక్కువ అగుడిచే ధనాన్ని మరియు సమయాన్ని ఎక్కువ చేయవలసి ఉంటుంది. ప్రతిపక్షపు పాత్రలు అంతంత మాత్రమే ఉండగలవు. ప్రభుత్వం వారు ప్రతిపక్షం నుండి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వం వారు తన వర్గీయులను కొందరిని బలవంతముగా బయటకు పంపవలసి రావచ్చు.
పురోహితః :-చంద్రః
పరీక్షకః:-రవి
గనకః:-కుజః
గ్రామ పాలకడు:-శుక్రః
దైవజ్ఞః:-గురువు
రాష్ట్ర అధిపతి:-బుధః
సర్వదేశోద్యోగధిపతి:-శుక్రః
అస్వాధిపతి:-శుక్రః
గజాధిపతి:-చంద్రః
పశ్వాధిపతి:-గురువు
దేవాధిపతి:-చంద్రః
నరాధిపతి:-గురువు
గ్రామాధిపతి:-రవిః
వస్త్రాధిపతి:-బుధః
రత్నాధిపతి:- శుక్ర
వృక్షాధిపతి:- శనిః
జంగమాధిపతి:-గురుః
సర్పాధిపతి:-కుజః
మృగాధిపతి:-గురుః
శుభాధిపతి:-ఋధః
స్త్రీణామధిపపతిః:-గురుః
రాజా నవనాయకులు:-8 శుభులు 1 పాపి
పురోహితాది నాయకులు:-16 శుభులు 5 పాపులు
30 మంది నాయకులు యందు 24 గురు శుభులు 6 పాపులు