Asianet News TeluguAsianet News Telugu

ఏ వారం ఏ పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది ?

ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, వ్రతాలు, నోములు చేయరు.  మనకు ఉన్న ఏడు వారాల్లో కూడా ఒక్కో రోజుకు ఓక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. వాటి కి సంబంధించిన జపం, హోమం, దానం, తపస్సు మొదలైనవి చేయాల్సి ఉంటుంది.

story of weekly wise prayers
Author
Hyderabad, First Published Jan 25, 2019, 3:35 PM IST

పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అనే సామెత అందరం వింటూనే ఉంటాం. ప్రతీవారు చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనం ఉంాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, వ్రతాలు, నోములు చేయరు.  మనకు ఉన్న ఏడు వారాల్లో కూడా ఒక్కో రోజుకు ఓక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. వాటి కి సంబంధించిన జపం, హోమం, దానం, తపస్సు మొదలైనవి చేయాల్సి ఉంటుంది.

ఆదివారం : ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. ఆరోగ్యం భాస్కరాద్ధిచ్ఛేత్‌ అన్నారు. అనగా సూర్యుడు ఆరోగ్య కారకుడు. ఈరోజున వేద పండితులను, ఇతర దేవతలను పూజించాలి. రవిని పూజించడం వల్ల నేత్రరోగాలు, శిరోబాధలు, కుష్టుబాధలు తగ్గుతాయి. వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజునుంచి ఒక నెల లేదా సంవత్సరం  లేదా మూడు సంవత్సరాలు అనారోగ్య తీవ్రతను బట్టి పూజ చేసుకోవడం వల్ల  సూర్యానుగ్రహం లభిస్తుంది.

సోమవారం : సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని సామెత ఉంటుంది. అనగా ఏది కావాలన్నా ముందు శివుని ఆజ్ఞ తప్పనిసరి కావున ఈ రోజున శివుని అభిషేకించడం మంచిది. శివునితోపాటు సంపద కావాలనుకునేవారు లక్ష్మీదేవిని ఆరాధించి వేద పండిత పూజ భోజనం, దంపతులకు భోజనం పెట్టాలి. సకల సంపదలు కలుగుతాయి.

మంగళవారం :  ఈరోజున సుబ్రహ్మణ్యస్వామి ప్రీతికరమైన రోజు. ఈ రోజున జనాలకు కొంచెం కోపం శాతం ఎక్కువగానే ఉంటుంది. ఆరోజున శాంతిని పొందాలి. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను అనుసరించి ఆరోజు ఉగ్రం తగ్గించుకోవడానికి కాళీదేవతను ఆరాధించాలి. మినపప్పు, కందిపప్పు, పెసరపప్పుతో అన్ని రకాల పప్పులతో చేసిన రుచికరమైన భోజనానికి వేదపండితులకు పెట్టాలి. అనారోగ్య నివృత్తి తగ్గుతుంది.

బుధవారం : బుధవారం గణపతికి ప్రీతికరమైన రోజు. గణపతికి అధిదైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. విష్ణుమూర్తికి పెరుగు అన్నం అంట ప్రీతి ఎక్కువ. కాబట్టి పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. దీనివలన వీరికి సంతానం అనుకూలంగా ఉంటుంది. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. చక్కి ఆరోగ్యం చేకూరుతుంది.

గురువారం : గురువారం గురువులకు ప్రీతికరమైన రోజు. ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరుకునేవారు దక్షిణామూర్తికి కాని సాయిబాబాకు గాని పాలతో అభిషేకం చేయాలి. పాల పదార్థాలు నివేదించాలి. అందరికీ పంచిపెట్టాలి. పసుపు రంగు వస్త్రాలను కూడా దానంగా ఇవ్వాలి.

శుక్రవారం : శుక్రవారం లక్ష్మీప్రదం. ఈరోజున స్త్రీలందరూ అందరగా అలంకరించుకుని శ్రద్ధతో పూజ చేయాలి.  లలితాదేవిని ఆరాధించాలి. దీనివలన సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వేదపండితులకు భోజనం పెట్టాలి. అలంకరణ వస్తువులు దానంగా ఇవ్వాలి. అందమైన వస్త్రాలను బహూకరించాలి.

శనివారం : ఇది కూడా శివునికి ప్రీతికరమైన రోజు. ఈరోజున తప్పనిసరిగా రుద్రాభిషేకం చేయించుకోవాలి. ప్రతీరోజూ అందరూ సూర్యోదయాత్పూర్వమే లేవాలి. అలా వీలుకానివారు తప్పనిసరిగా శనివారం మాత్రం సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి  అన్ని పనులు ముగించుకోవడం మంచిది. శనివారం సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే ఏదో ఒక రకమైన ఇబ్బంది తప్పదు.

అందరికీ అన్నీ కావాలి ఏది ఒక్కి లేకపోయినా వెలితిగానే కనిపిస్తుంది. కావున ప్రతీరోజు ఆ వారానికి సంబంధించిన అధిదైవాన్ని కాని తమ ఇష్టదేవతను కాని పూజించుకొని, దానం చేయడం తప్పనిసరి అని తెలుసుకోవాలి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios