Asianet News TeluguAsianet News Telugu

శోభ కృత్ నామ సంవత్సర ఉగాది ఫలితాలు

ఈ నవయుగాది మీయింట.. సుఖసంతోషాలు, ఆయుఃరారోగ్యాలు.. వెల్లివిరియాలని.... కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ శోభకృత్ నామ సంవత్సరాది ఉగాదిపర్వదిన శుభాకాంక్షలు

Sri Subhakritu Nama Samvatsara Panchangamu 2023
Author
First Published Mar 22, 2023, 9:14 AM IST

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఫలితాలను  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం వారు వివరించారు  వారు చేసిన పంచాంగ గణనం ఆధారంగా ఈ ఫలితాలు ఉంటాయి.

వారిని సంప్రదించాలనుకున్న వారు  - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను).
 
షడ్రుచుల సమ్మేళనం.. ఈ నవయుగాది మీయింట.. సుఖసంతోషాలు, ఆయుఃరారోగ్యాలు.. వెల్లివిరియాలని.... కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ శోభకృత్ నామ సంవత్సరాది ఉగాదిపర్వదిన శుభాకాంక్షలు

రాజా బుధః:-
సుడిగాలులు తుఫానులు అధిక గాలి భయము ఉండును. స్త్రీ పురుష సంగమం ఉండదు. పూర్వసస్యములు మధ్యమ గాను రెండవ పంట బాగా పండును. వర్షాలు మద్యస్థంగామద్యస్థంగా కురియును.పరిపాలన వ్యవహారం యందు ఖర్చు యందు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వాణిజ్యరంగం అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ ధర్మ కార్యములందు ఆసక్తి చూపుతారు. ప్రజలు క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు.

మంత్రి శుక్రః:-
విశేషంగా ధాన్యాలు పండుతాయి. గోవుల అధికంగా పాలు ఇచ్చును. ప్రతి వ్యవహారమనందు స్త్రీల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. స్త్రీ పురుషులలో భావోద్రేకం అధికంగా ఉండును. పంటలకు ఈతి బాధలు మూషిక బాధలు. గేదె ఆవులకు హాని. సస్యానకుల వర్షములు కురుస్తాయి. ధాన్యాధుల ధరలు సరసముగానులను. చెరువులు నిండునట్టి వర్షములు కురియును.

సేనాధిపతి గురుడు:-
జనులకు అత్యంత అనురాగము కలుగును. జనాలు ఏ విధంగా పరిపాలన కోరుకుంటారో  ఆ విధంగా పరిపాలన చేయుదురు. గ్రామ వాసులు సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారు. పాలకులకు అధికారులకు సుఖ జీవనం అనుభవించెదరు. దేశమంతా చక్కని వర్షాలు కురుస్తాయి. ప్రజలు సుఖ సంతోషాలతో అత్యంత అనురాగము గా ఉంటారు. పాలకులు ధర్మమార్గం పై ఆసక్తి చూపుతారు. బ్రాహ్మణులు యజ్ఞ యాగాదుల యందు దేవతా ఉత్సవములు యందు ఆసక్తి చూపుతారు.

అర్గాదిపతి గురువు:-
భూమి అంతయు సువృష్టిగా ఉండును. ధన ధాన్యములు సమృద్ధిగా పండగలవు. బ్రాహ్మణులకు యజ్ఞ యాగాదుల  క్రతువులు యందు ఆసక్తి పెరుగుతుంది. దేశమంతా ఉత్సవాలతోను జాతర్లతోనూ మంగళవాద్యాలతోనూ చూడ ముచ్చటగా ఉంటుంది.
మేఘాధిపతి గురుః:-
మంచి వర్షముల  కురియును. భూమి అంతయు సస్యవంతమై ధాన్యములు సమృద్ధిగా పండును. జనులకు రోగములు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు.

సస్యాధిపతి చంద్రః:-
సస్యాధిపతి చంద్రుడు అయినందున నీటి ద్వారా పండే పంటలు మాగాని మెట్ట పంటల బాగా ఫలించును. ఫలవృక్షజాతులు  పుష్కలంగా ఫలించును.

ధాన్యాధిపతి శనికి:-
శని ధాన్యాధిపతి అయినందున సమస్తమైన సూక్ష్మ ధాన్యములు (అనగా చిన్నవి ధాన్యములు) నల్లని భూములు నల్లని ధాన్యములు సమృద్ధిగా లభించును.

రసాధిపతి ఋధః:-
రసాధిపతి బుధుడు అయినందున మగధి .మాలతి. జాజికాయ.కర్పూరం. గుగ్గిలం. పిప్పలి సొంటి. నెయ్య. అగరు .బెల్లము .ఇంగువ. నూనెలు. రసవస్తులు సమృద్ధిగా లభించిను.

నీరసాధిపతి చంద్రః:-
నీరసాధిపతి చంద్రుడు అయినందున ముత్యాలు బంగారం కంచు వస్త్రాలు నగలు బంగారం వెండి కంచు లోహములు అలంకార వస్తువులు సమృద్ధిగా ఉండి ధరలు అనుకూలంగా ఉండును.

పురోహితః :-చంద్రః
పరీక్షకః:-రవి
గనకః:-కుజః
గ్రామ పాలకడు:-శుక్రః
దైవజ్ఞః:-గురువు
రాష్ట్ర అధిపతి:-బుధః
సర్వదేశోద్యోగధిపతి:-శుక్రః
అస్వాధిపతి:-శుక్రః
గజాధిపతి:-చంద్రః
పశ్వాధిపతి:-గురువు
దేవాధిపతి:-చంద్రః
నరాధిపతి:-గురువు
గ్రామాధిపతి:-రవిః
వస్త్రాధిపతి:-బుధః
రత్నాధిపతి:- శుక్ర
వృక్షాధిపతి:- శనిః
జంగమాధిపతి:-గురుః
సర్పాధిపతి:-కుజః
మృగాధిపతి:-గురుః
శుభాధిపతి:-ఋధః
స్త్రీణామధిపపతిః:-గురుః
రాజా నవనాయకులు:-8 శుభులు 1 పాపి
పురోహితాది నాయకులు:-16 శుభులు 5 పాపులు
30 మంది నాయకులు యందు 24 గురు శుభులు 6 పాపులు

దేశ,కాల మాన పరిస్దితులు చూస్తే...సంవత్సర ఫలితము:-

ఈ నవ నాయకులలో 8 ఆధిపత్యము లు శుభలకు ఒక ఆధిపత్యం పాపులకు వచ్చుటచే దేశ పరిస్థితులు బాగుండును. సుస్థిరపరిపాలన ప్రజారంజకంగా పరిపాలన చేయుదురు. ప్రపంచమంతా ఆర్థికమాన్యం ఉన్నప్పటికీ మన దేశ పరిస్థితి బాగుంటుంది. ఆర్థిక రంగం పురోభివృద్ధి చెందుతుంది. వృద్ధి శాతం పెరుగును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన అవగాహన ఏర్పడుతుంది. ప్రజా సంక్షేమ పథకాలు కేంద్ర రాష్ట్రాలు పోటా పోటీగా అమలు చేస్తారు. ప్రజల యొక్క మన్ననలు పొందగలరు. ప్రతిపక్షం వారు విమర్శలు చేసినప్పటికీ ప్రజలు పాలక పక్షం వైపు ఉంటారు.

ప్రభుత్వము నందు తన వర్గీయ వారితో కొన్ని వ్యతిరేకతలు ఏర్పడవచ్చును. ఆయనను సమర్ధించుకోగలరు. భారతదేశ ఖ్యాతి పెరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి. క్రీడారంగంలో అనేక విజయాలు లభించును. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. పర్యాటక రంగం బాగుంటుంది. ఈ సంవత్సరం మూడు కొంచెం కాబట్టి దేశమంతా మంచి వర్షాలు కురుస్తాయి. జలాశయాలు సంపూర్ణముగా నిండగలవు. జల వివాదములు పరిష్కారములు ఏర్పడగలవు. విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు చేయదురు. గృహ నిర్మాణాధి వ్యవహారములు మందగించును.

ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ పధకాలు జోరు పెరుగుతుంది.  ప్రభుత్వం అధికారులతో కూడి సమన్వయంతో ప్రజల మనస్సుని చూరుగొనేందుకు కొత్త ఆలోచనలు చేస్తుంది. గత సంవత్సర పాలనకు ఇప్పటికి పూర్తి తేడా కనపడుతుంది. అయితే ఎంత చేసినా లోపాలు కనపడుతూనే ఉంటాయి. వాటిని చిన్న దాన్ని పెద్దది చేసేందుకు ఎదురుచూసేవారు ఇప్పుడు మరింత ఎక్కువ మంది ఉంటారు. మార్పులు కొన్ని అనివార్యము అన్న విషయం అర్దమవుతుంది. సంవత్సరం మధ్యలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజామోదం పొందకపోవచ్చు. ఆచి,తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి. కొన్ని సార్లు చేయని వాటికి నిందలు పడతారు. గ్రహాల శుభదృష్ణి తో వాటిని కొంతవరకూ జయించవచ్చు.

తెలంగాణా విషయానికి వస్తే... ముఖ్యమంత్రి తమ ప్రభావాన్ని పెంచుకునే దిసగా పావులు కదుపుతారు. ప్రతిపక్షాలు నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా కొన్ని సార్లు తమ మొండి పట్టుదల వీడరు. కేంద్రంలో సమన్వయం కొరవటంతో కొన్ని సమస్యలు వస్తాయి. కొన్ని వ్యూహాలతో రాజకీయంగా ఎదుగుదల కనిపించినప్పటికి అది శాశ్వతమైన ఫలితాలు ఇవ్వదు. ఆగస్ట్ తర్వాత జరిగే కొన్ని సంఘటనలు పాలక పక్షంలో కొన్ని కీలకమైన మార్పులకు దోహదం చేస్తాయి. దిష్టిదోషం కనపడుతోంది. అది యజ్ఞ యాగాలుతో కాస్త మందగించినా కొన్ని ముఖ్యమైన మార్పులకు దారి తీస్తుంది. ఈ సంవత్సరం కొంత అలజడిగా ఉన్నా మంచి ఫలితాలే తీసుకు వస్తుంది.

 ప్రభుత్వము తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆలస్యము అయినా అమలు చేస్తారు. ప్రకృతి వైపరీత్యలు ఎక్కువ అగుడిచే ధనాన్ని మరియు  సమయాన్ని ఎక్కువ చేయవలసి ఉంటుంది. ప్రతిపక్షపు పాత్రలు అంతంత మాత్రమే ఉండగలవు. ప్రభుత్వం వారు ప్రతిపక్షం నుండి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వం వారు తన వర్గీయులను కొందరిని బలవంతముగా బయటకు పంపవలసి రావచ్చు.

పశుపాలకుడు బలరాముడు
గోష్ఠమునందు ఉంచువాడు శ్రీకృష్ణుడు
గోష్ఠము నుండి వదిలిపెట్టు వాడు శ్రీకృష్ణుడు
పశువులు యందు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. పాడిపంటల సమృద్ధిగా లభిస్తాయి. పంటలు బాగా పండును. వర్షం సమృద్ధిగా కురియును.
మూడు కుంచముల వర్షము అందు ఏడు భాగములు సముద్రము నందు పది భాగములు పర్వతములపై నాలుగు భాగములు భూమి మీద కురియను.

16 వీసము లందు పంటకు 11 వీసము ల  పంట లభించును .

తొలకరి పంటల సమృద్ధిగా పండును. నల్ల భూములు నల్ల ధాన్యముల పంటలు సమృద్ధిగా పండును.


డొల్లకర్తరి ప్రారంభం:-
5-52023 శుక్రవారం ఉ॥6.24 ని॥లకు డొల్ల కర్తరిప్రారంభం


నిజ కర్తరి ప్రారంభం

11 -5-2023 గురువారం రాత్రి 4.11 ని॥లకు ప్రారంభం

కర్తరిత్యాగం 29-5-2023 మ॥1-21 ని॥ కర్తరి త్యాగం

మౌడ్యమి


29-03-2023 చైత్ర శుద్ధ అష్టమి బుధవారం సా॥5.01 ని॥లకు గురుమూఢమి ప్రారంభం


25-04-2023 వైశాఖ శుద్ధ షష్టి మంగళవారం సాయంత్రం 5.09 ని॥ల కు గురుమూఢమి త్యాగము అవును.


8.08.2023 అధిక శ్రావణ బహుళ అష్టమి మంగళవారం మ॥1.58 ని॥ల కు శుక్ర మూఢమి ప్రారంభం.


18-08-2023 నిజ శ్రావణ శుద్ధ తదియ శుక్రవారం రాత్రి 7.21 ని॥ల కు శుక్ర మూఢమి త్యాగం.

గ్రహణములు:-

చంద్రగ్రహణం 28.10.2023 శనివారం పూర్ణిమ అశ్వినీ నక్షత్ర యుక్త  చంద్ర గ్రహణ రాహు గ్రస్త
స్పర్శ:-రాత్రి 1.06 ని॥లకు
మధ్యకాలం:-రాత్రి1.44 ని॥లకు
మోక్షకాలం:-రాత్రి 2.22 ని॥లకు
గ్రహణ పుణ్యకాలం:-రాత్రి 1.16 ని॥లకు
ఈ గ్రహణం ఆ సునీ నక్షత్రం అశ్విని నక్షత్రం మేషరాశిలో పట్టడం వలన  అశ్వినీ నక్షత్రం మేషరాశి జాతకులు ఈ గ్రహణాన్ని చూడరాదు.

Follow Us:
Download App:
  • android
  • ios