Asianet News TeluguAsianet News Telugu

ధనుర్మాసంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు?

రవి ధనుస్సులోకి ప్రవేశించే కాలం ధనుర్మాసం. ఈ ధనుస్సు రాశి మన్మథునికి ప్రతీక. జ్యోతిషశాస్త్రరీత్యా రవి ఏ రాశిలో ఉంటే ఆ రాశి అస్తమిస్తున్నట్లు అర్థం. రవి ధనుస్సురాశిలోకి ప్రవేశించే సమయంలో ధనుస్సురాశి అస్తమిస్తుంది. 

special story of dhanurmasam
Author
Hyderabad, First Published Dec 24, 2018, 3:36 PM IST

రవి ధనుస్సు రాశిలో ప్రవేశించే మాసం ధనుర్మాసం. ఈ మాసం శుభకార్యాలు కొన్నింకి నిషిద్ధం కాని దైవారాధనకు అనువైన మాసం. ఈధనుర్మాసంలో వైష్ణవాలయాలలో జనాలు కిటకిటలాడుతూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో ఆండాల్‌ దేవి అనే ఆవిడ 30 పాశురాలు రచించి పాడింది. వీిని తమిళంలో పాశురాలు అంటారు. 30రోజులు భగవదారాధన చేసి అందులో విలీనమై చివరికి సంక్రాంతి ముందు భోగిరోజున విష్ణువునే వివాహం చేసుకుంది. దానికి సంబంధించిన చిన్న పురాణ కథ.

విష్ణుచిత్తుని కూతురు రోజూ మూలమాల క్టి ఆ మాలను తాను ధరించి అద్దంలో చూసుకుని రంగనాథునే తన భర్తగా ఊహించుకుని రంగనాథునికి పంపించేది. ఎప్పుడైన ఒకరోజు గోదాదేవి ఆ మాలను ధరించకపోతే రంగనాథుడు ఒప్పుకునేవాడు కాదట. ఒకరోజూ ఈ సంగతిని విష్ణుచిత్తుడు చూసి గోదాదేవిని బెదిరించాడట. అప్పుడు రంగనాథుడే స్వయంగా వచ్చి ఈమె ఈ పని చేయడం నాకు ఇష్టమే అని చెప్పి వెళ్ళాడు. తరువాత 30 రోజులకు వివాహం చేసుకుంటారు. అసలు కథ ఇది.

దీని వెనుక ఉన్న జ్యోతిష, వైజ్ఞానిక కథ ఏమి అనుకుంటే రవి ధనుస్సులోకి ప్రవేశించే కాలం ధనుర్మాసం. ఈ ధనుస్సు రాశి మన్మథునికి ప్రతీక. జ్యోతిషశాస్త్రరీత్యా రవి ఏ రాశిలో ఉంటే ఆ రాశి అస్తమిస్తున్నట్లు అర్థం. రవి ధనుస్సురాశిలోకి ప్రవేశించే సమయంలో ధనుస్సురాశి అస్తమిస్తుంది. అస్తమించడం అంటే ప్రకృతిలోను మరియు శరీరంలోను మార్పులు వచ్చే సమయం. పైగా ఇది చలికాలం కూడా కావడం వలన వైవాహిక జీవన భావనలు అధికంగా వచ్చే కాలం. భావనలు వస్తాయి కాని అవి పూర్తిగా అమలుకావు. కాని అన్ని విషయాల్లో తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఈ మాసంలో తెలుగు ప్రాంతంలో వివాహాలు మాత్రం నిషిద్ధం. 

ఇది అత్యంత పవిత్రమైన మాసం కాబ్టి ఈ అత్యంత పవిత్రమైన మాసాన్ని వృథాకానివ్వరాదని గోదాదేవి ప్రతీరోజూ చేసే పనిని ఇంో్ల అందరూ తప్పనిసరిగా చేయాలి. ఆమె ఏం చేసింది అంటే సూర్యోదయం కంటే పూర్వం నిద్రలేచి పూజలు వ్రతాలు చేసేది. అందరూ ఆ పనిని తప్పనిసరిగా అమలు చేయాలి. వీరు విష్ణుమూర్తికి ఉదయమే పొంగలి నైవేద్యం కూడా పెడతారు. ఆ పొంగలిలో మిరియాలు నువ్వులు తప్పనిసరిగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

కారణం చలికాలంలో తొందరగా జీర్ణమవడానికి శరీరంలో వేడి పుట్టుడానికి, జీర్ణశక్తి పెరగడానికి, మిరియాలు, నువ్వులు తోడ్పడతాయి. కాబ్టి వాినే ఇందులో వినియోగిస్తారు. ఈ మాసంలో పగలు తక్కువగ, రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టే ఉదయకాలమే భోజనం చెప్పినారు. ఇది ఆయుర్వేదం ప్రకారం కూడా చాలా మంచిది. కాబట్టే ఈ కాలంలో ఉదయమే కట్టె పొంగలి, లేదా చక్కెర పొంగలిని తినే సంప్రదాయం వచ్చింది. అలాగే భూశయనం, ఏకభుక్తం కూడా చేయాలి. నియమ నిష్ఠలతో ఉండాలి.

లౌకిక వ్యవహారాలను తగ్గించుకొని ఆధ్యాత్మిక విషయాలపై మనస్సు లగ్నం చేయాలంటే కొంత సాధన తప్పనిసరి. కాబ్టి కొన్ని నియమ నిష్టలు తప్పనిసరి. ఈ మాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు మాత్రమే నిషిద్ధం కాని మిగిలిన అన్ని శుభకార్యాలు చేయవచ్చును. పూర్వం నుంచి ప్టిెన ఆచార, వ్యవహారాలు తప్పేమీ కావు. ప్రకృతికి అనుగుణంగా, ప్రకృతిలో మార్పులను అనుసరించి ఆయా పూజలు, వ్రతాలు, నియమాలు పెట్టుకుని ఆచరించేవారు. 

ఒక్కోమాసానికి ఒక్కోవారం ప్రత్యేకంగా ఉంటుంది. కార్తిక మాసంలో సోమవారాలు, మాఘమాసానికి ఆదివారాలు, శ్రావణమాసానికి మంగళ, శుక్ర, శనివారాలు, అలాగే మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకం ఉంటుంది. ఒక్కోవారం ఒక్కో నైవేద్యం పెడతారు. ఈ గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios