ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మాట విలువ తగ్గుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో అనవసర ఇబ్బందులు వస్తాయి. నిల్వ ధనాన్ని కోల్పోయే అవకాశం. వీరు ఎక్కువగా మాట్లాడకుండా ఎదుటివారిని మాట్లాడడానికి అవకాశాన్ని కల్పించాలి. మాటల వల్ల అపార్థాలు వస్తాయి. కంటి సంబంధ లోపాలు కూడా ఉంటాయి. వీరు నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి.

జ్యోతిషం: 2020లో మీ రాశిఫలాలు ఇలా ఉన్నాయి

ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రమలేని ఆదాయం పైదృష్టి ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో ఒత్తిడిపెరుగుతుంది. నూతన పరిచయస్తులతో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు ఒత్తిడిని కలిగిస్తాయి.

కుటుంబ సంబంధాలు బలపరచుకునే ప్రయత్నం చేయాలి. వాగ్దానాలు చేయరాదు. మధ్యవర్తిత్వాలు పనికిరావు. నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు. అనవసర ఖర్చులు చేస్తారు. తమ పనులు తమకే ఒత్తిడిని కలిగిస్తాయి.  తాము చేసే పనుల్లో నిరాశ, నిస్పృహలు ఉంటాయి.

leo: 2020లో సింహరాశి ఫలితాలు

వీరు పవుపక్షాదులకు ఆహారం వేయడం, నీరు పెట్టడం, యోగా ప్రాణాయామాలు చేయడం, వాకింగ్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. గురువులను సత్కరించుకోవాలి. విద్యార్థులకు పుస్తకాలు పంచిప్టోలి. శనగలు, దానం చేయాలి.  పసుపురంగు, నీలిరంగు, చిత్రవర్ణం వస్త్రాలను దానం చేయాలి.