Asianet News TeluguAsianet News Telugu

రథసప్తమి ప్రత్యేకత ఏమి?

ఈ సంవత్సరంలో చేసుకోబోయే సూర్య, చంద్ర, సౌభాగ్య సంబంధ వ్రతాలు ఈ రోజుననే ప్రారంభిస్తారు. ఇదివరకు ప్రారంభించిన వాళ్ళు సమాప్తం చేస్తారు.

radhasaptami speciality is here
Author
Hyderabad, First Published Feb 12, 2019, 9:29 AM IST

శ్రీ సూర్య నారాయణ, వేద పారాయణ... లోక రక్షామణి, దైవ చూడామణి.... అనే పాట అందరికీ తెలిసినదే.

మాఘశుద్ద సప్తమికి రథసప్తమి, జయంతి సప్తమి, మహాసప్తమి అని పేర్లు. తెలుగు దేశంలో రథసప్తమి ఒకప్పుడు ఉగాదిపండుగ అయి ఉండేదనానికి ఆనాడు ప్రారంభమయ్యే అనేక వ్రతాల ఆధారం అవుతున్నాయి. ఈ సంవత్సరంలో చేసుకోబోయే సూర్య, చంద్ర, సౌభాగ్య సంబంధ వ్రతాలు ఈ రోజుననే ప్రారంభిస్తారు. ఇదివరకు ప్రారంభించిన వాళ్ళు సమాప్తం చేస్తారు.

నిత్యశృంగారం, నిత్య అన్నదానం, ఫలతాంబూలం, దంపతి తాంబూలం, పుష్పతాంబూలం, పొడపువ్వుల వ్రతం, చద్దికూటి మంగళవారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, మాఘగౌరి, కాటుకగౌరి, గండాలగౌరి, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు, సౌభాగ్య తదియ, కందవ్రతం, చిత్ర గుప్తుని వ్రతం మొదలైన నోములన్నీ రథసప్తమినాడే పడతారు. పైన పేర్కొన్న వ్రతాలన్నీ స్త్రీల వ్రతాలే.  ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్తని పేర్కొనతగినది. ఆరోగ్య సప్తమి వ్రతం. ఆరోగ్యం మహాభాగ్యాలలో మొదిది. అది ఇచ్చేవాడు సూర్యుడు. కావున రథసప్తమిరోజున అనారోగ్యం ఉన్నవారు ఈ రథసప్తమినాడు సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం, సూర్యస్తోత్రాలు పఠించడం తప్పనిసరిగా చేయాలి. దీనికి ఒక పురాణగాథ ఉన్నది.

పూర్వం కాంభోజదేశాన్ని యశోవర్తముడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి చాలా కాలం తర్వాత ఒక పుత్ర సంతానం కలిగింది. కాని అతను ఎప్పుడూ రోగగ్రస్తుడై ఉండేవాడు. జ్యోతిష్కులను పిలిచి తన కొడుకు ఎప్పుడూ రోగ గ్రస్తుడుగా ఉండడానికి కారణం అడిగి తెలుసుకున్నాడు. వారు ఇలా చెప్పారు.

పూర్వజన్మలో ఒక వైశ్యుడు. అతడు సంపన్నుడు అయి ఉండి కూడా ఎలాటిం దానధర్మాలు చేయలేదు. చివరి థలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమీ వ్రతాన్ని చూసాడు. ఆ వ్రతం చూసిన కారణంగా మీకు కొడుకుగా ప్టుటాడు. కాని అతను ఏరోజూ ఎవరికి దానం చేయలేదు. ఆ కారణాన ఈ జన్మలో రోగగ్రస్తుడై ప్టుటాడు. ఆ మాటలు విన్న రాజు రోగనివారణ మార్గం చెప్పమనగా రథసప్తమినాడు దానధర్మాలు చేయాలి. సూర్యునికి అర్ఘ్యాలు వదలాలి, సూర్యస్తోత్రాలు నిరంతరం పారాయణ చేయాలి అని చెప్పారు. ఆ ప్రకారం రాజు చేయగా కొడుకు రోగం నివారించబడింది. కావున ప్రతీవారికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యప్రదాత సూర్యుడు కనుక రథసప్తమిరోజు సూర్యునికి సంబంధించిన స్తోత్రపారాయణలు   చేయడం తప్పనిసరి.

ఈ రథసప్తమికి ఒక విశిష్టత ఉంది. మేషరాశి సూర్యునికి ఉచ్చస్థానం. చంద్రమంగళ వావారినికి అధిపతి అయిన కుజునితో కలిసి భరణీ నక్షత్రంలో ఉండడం విశేషం. ఇలా 30 సం||ల ముందు వచ్చింది. పగా 1989 ఫిబ్రవరి 12వ తేదీన వచ్చింది.

సూర్యకాంతిలో డి విటమిన్‌ ఉందని, ఆ కిరణాలు సోకిన రక్తదోషాలు పోతాయని సైన్స్‌ చెపుతుంది. సూర్య కిరణాలను కంటితో చూస్తే కంటిదోషాలు నివారణ అవుతాయి. సూర్యుని వేడిమితో అనేక విషక్రములు నాశనం అవుతాయి. సూర్య కిరణాలు క్షయరోగాలను నివారిస్తుంది. హృదయరోగాలు కొన్ని చర్మ రోగాలు పోవాలంటే సూర్య ఉపాసన, సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యునికి ఏడు గుఱ్ఱాలు వాటికి ఏడు పేర్లు ఉంటాయి. అమృత సంభవ, భాష్ప సంభవ, వహ్ని సంభవ, వేద సంభవ, అండ సంభవ, గర్భ సంభవ, సామ సంభవ అని ఏడు గుఱ్ఱాలపేర్లు.

యదంయత్‌ జన్మకృతం పాపం మయా సప్తమ జన్మసు, తన్మేరోగం చ సోకం మాకరీ హంతు సప్తమీ

ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం, మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతంచ యత్పువః

ఓ మకరరాశిలో ఉన్న సూర్యుడా ఈ జన్మలో ఏడు జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టు. రోగాన్ని శోకాన్ని లేకుండా చేయి. తెలిసి తెలియక చేసిన పాపాన్ని మనస్సు, వాక్కు, శరీరం ద్వారా చేస్తున్న పాపాలను పోగొట్టు అని సూర్యుణ్ణి ప్రార్థించాలి.

సూర్యుడు ప్రత్యక్షదైవం. సూర్యుడు లేనిదే సృష్టి క్రమం లేదు. అన్నీ ఆగిపోతాయి. అతడు ఉంటేనే భూమిమీద పగలు రాత్రి ఉంటాయి. సూర్యునివల్లనే కిరణజన్య సంయోగకక్రియ జరిగి ఆకులు, చెట్టులు జీవిస్తాయి. మానవులుకూడా సూర్యోదయం నుంచే అందరికీ మేలుకొలుపు అవుతుంది. సూర్యుడు అందరికీ ఆధారభూతుడు. అతడు లేనిదే ఏమీ లేదు. కావున ప్రతి  రోజు అందరూ సూర్యుడిని ఆరాధించాలి. అది లేకపోతే కనీసం ఆదివారాలైనా సూర్యుని పూజించాలి. విశేషంగా రథసప్తమినాడు  పూజచేయడమైనా చేయాలి. ఈ రథసప్తమిరోజున సూర్యునికి పాయసం నైవేద్యం పెట్టాలి.

Follow Us:
Download App:
  • android
  • ios