ఈ రాశుల వారికి పెళ్లంటే పుట్టెడు భయం

ప్రతి ఒక్కరూ లైఫ్ లో పెళ్లి చేసుకోవాల్సిందే. జీవిత భాగస్వామితో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల్సిందే. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు పెళ్లి పేరు చెప్పగానే అక్కడి నుంచి పారిపోతారు. వాళ్లు ఏయే రాశులవారంటే?
 

people of these zodiac signs run away from marriage rsl

ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి ఖచ్చితంగా చేసుకుంటాం. అందులోనూ కక్కు వచ్చినా.. కళ్యాణం వచ్చినా ఆగదన్న సామేతా పెద్దలు అంటుంటే వినే ఉంటారు. నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన ఘట్టం. అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి చేసుకునే వారిపై ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి.  ఇది సహజం. అందులోనూ ఒక  ఏజ్ లో ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారికి పెళ్లి అంటే చాలా భయం. అందుకే పెళ్లి పేరు చెప్పగానే అక్కడి నుంచి పారిపోతారు. వాళ్లు ఏయే రాశుల వారంటే? 

మిథున రాశి: మిథున రాశి వారికి పెళ్లి అంటే చాలా చాలా భయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వీరి మూడ్ క్షణ క్షణానికి మారుతుంటుంది. వీరు సంబంధంలో అయినా.. మరేదానిలో అయినా సరే ఎక్కువ కాలం ఉండలేరు. అందుకే వీళ్లు పెళ్లి చేసుకోవాలంటే చాలా భయపడతారు. 

ధనుస్సు రాశి:  ధనస్సు రాశి వారికి కూడా పెళ్లి అంటే పుట్టెడు భయం. ఈ ధనుస్సు రాశి జాతకులు పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇంట్రస్ట్ చూపరు. ముఖ్యంగా ఈ రాశి అమ్మాయిలు పెళ్లి పేరు వింటేనే భయపడిపోతుంటారు.

ధనుస్సు రాశి వారు పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటారు?

ధనుస్సు రాశి వారు చాలా స్వేచ్ఛగా బతకాలనుకుంటారు. పెళ్లి చేసుకుంటే ఈ స్వచ్ఛ దూరమవుతుందని వీళ్లు భావిస్తారు. అందుకే పెళ్లి అనే పవిత్ర బంధంతో ముడిపడటానికి అస్సలు ఇష్టపడరు. వీరు తమ స్వేచ్ఛను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. 

కుంభ రాశి: కుంభ రాశి వారికి కూడా పెళ్లి అంటే అస్సలు ఇష్టం ఉండదు. పెళ్లి పేరు చెప్పగానే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండరు. నిజానికి కుంభరాశివారు స్వభావరీత్యా చాలా నిగూఢంగా ఉంటారు. ఈ రాశివాళ్లు ఇతరులకు ఏం చెప్పరు. అందుకే వీరు ఎవరితోనూ మాటలు పడాలనుకోరు. 

కర్కాటకరాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రాశి వారు ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశి వారు తమ మాటలను ఇతరులతో అస్సలు పంచుకోరు. ఈ కారణంగానే వీళ్లు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటారు. 

కర్కాటక రాశి వారు పెళ్లికి ఎందుకు భయపడతారు?: ఈ రాశి వారు పెళ్లి చేసుకుంటే భాగస్వామితో తమ విషయాలను పంచుకోవాల్సి ఉంటుందని అనుకుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు.  వీరు ఒంటరిగా ఉండటానికే ఇంట్రెస్ట్ చూపుతారు. ఈ రాశివారు ఎవ్వరి మాటలను వినరు. 

మకర రాశి : మకర రాశి వారు హింసాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు.ఇలాంటి పరిస్థితిలో వీళ్లు పెళ్లి చేసుకుంటే వారు తమ వైవాహిక జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని భావిస్తారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios