ఆన్షిక సూర్య గ్రహణంగా పిలవబడే ఈ సూర్యగ్రహణం.. చంద్రుడు భూమికి, సూర్యుడికి అడ్డురావడం వల్ల సంభవిస్తోంది.
ఇటీవల చంద్ర గ్రహణం సందర్భంగా ఏర్పడిన బ్లడ్ మూన్ ని ప్రపంచ వ్యాప్తంగా వీక్షించారు. కాగా.. ఈ రోజు సూర్యగ్రహణం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఇది భారతదేశంలో మాత్రం కనిపించదు. ఆన్షిక సూర్య గ్రహణంగా పిలవబడే ఈ సూర్యగ్రహణం.. చంద్రుడు భూమికి, సూర్యుడికి అడ్డురావడం వల్ల సంభవిస్తోంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రమే దీన్ని వీక్షించగలుగుతారు. ఉత్తర, తూర్పు ఆసియా, యూరప్‌లోని స్కాండినేవియా, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్, కెనడాలోని మంచు ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపించనున్నది. భారతదేశంలో నేరుగా ఈ గ్రహణం కనిపించకపోవచ్చు. ఒకవేళ సాంకేతిక పరికరాలతో చూస్తే వీక్షించే వీలుంది. భారతదేశంలో ఈ పాక్షిక సూర్యగ్రహణం మధ్యాహ్నం 1.32గం.లకు మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలకు గ్రహణం పూర్తవుతుంది.
