Asianet News Telugu

జాతకం.. ప్రేమ పెళ్లి జరుగుతుందా?

మాకు పంపిన కొందరు జాతకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి

My Marriage will be Love or Arranged
Author
Hyderabad, First Published Feb 23, 2019, 2:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

1. మనోజ్‌

ఇష్టమైన అమ్మాయితో వివాహం అవుతుందా? భవిష్యత్తు ఎలా ఉంది?

ప్రస్తుతం జాతకరీత్యా అంత అనుకూల సమయం లేదు. 2019 జూన్‌ నుంచి రాబోయే 6 సం||లు కూడా అంత అనుకూలం కాదు. రవి థ మొత్తం కూడా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. అన్ని పనుల్లో జాగ్రత్త చాలా వహించాలి. ఇష్టమైన అమ్మాయితో వివాహ యోగాలు కూడా అంతంత మాత్రమే. దూర ప్రయాణాల్లో స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మీకు ఉండే మంచి సమయాలు : 9.9.2019 నుంచి 7.3.2020 వరకు మరియు 31.5.2021 నుంచి 15.3.2022 వరకు. కొంత శుభ సమయంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే మీరు వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి.

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం నిరంతరం చేసుకోవాలి. ఆదిత్యహృదయ పారాయణం కూడా మంచిది. చదవడం రాకపోతే వినడం అయినా తప్పనిసరిగా చేయాలి.

దానం : 1. నూనె అవసరం ఉన్నవారికి ఇంటిలో వాడుకోవడానికి, / దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి  పల్లీలు. 2. గోధుమ పిండి / గోధుమరవ్వ/ గోధుమ రొట్టెలు దానం చేయాలి. ప్రతీ వారం తప్పనిసరిగా చేయాలి. వారానికి 4 నుంచి 5 గురికి ఇవ్వండి.

2. సుధీర్‌ రెడ్డి

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

మీనరాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర

ప్రస్తుతం సమయం అనుకూలంగానే ఉంది. 2020 ఆగస్టు వరకు అన్ని పనుల్లో అనుకూలత కనిపిస్తుంది. ఆ తర్వాత బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. దానాలు నిరంతరం చేసుకుంటూ ఉంటే తప్ప జీవితంలో ఆనందం ఉండదు. లేకపోతే వేరు వేరు రూపాల్లో నష్టపోయే అవకాశం అధికంగా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ దానాలు చేస్తే అంత మంచిది.

జపం : శ్రీ మాత్రేనమః నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానం : 1. కందిపప్పు, కర్జూరాలు, దానిమ్మపళ్ళు, 2. గోధుమ పిండి / గోధుమరవ్వ/ గోధుమ రొట్టెలు, 3. అన్నదానం/ పాలు/పెరుగు దానం చేయాలి. ఈ దానాలు తప్పనిసరిగా అధిక సంఖ్యలో చేయాలి.

ఈ దానాలు చేయడం వల్ల మాత్రమే  అనవసర ఖర్చులనుంచి తప్పించుకోగలుగుతారు.

3. ఎల్లాగౌడ్‌

ఉద్యోగం, వివాహం మరియు భవిష్యత్తు ఎలా ఉంది?

జాతకం బాగానే ఉంది. ప్రస్తుతం వివాహానికి చాలా అనుకూల సమయం. జపం, దానం బాగా చేసుకునేటట్లైతే అన్ని పనులు అనుకూలిస్తాయి.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః,

కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ జపాలు నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానం : ఇడ్లీ, వడ, మినప సున్ని ఉండలు, మినపప్పు/ బెల్లం / పంచదార/ విద్యార్థులకు పుస్తకాలు / నూనె అవసరం ఉన్నవారికి ఇంటిలో వాడుకోవడానికి, / దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి  పల్లీలు మొదలైనవి దానం చేస్తూ ఉండాలి.

4. చెన్న కేశవ రెడ్డి

ఉద్యోగం మరియు భవిష్యత్తు ఎలా ఉంది?

2021 నుంచి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీరు వాకింగ్‌, యోగా, ప్రాణాయామాలు చేయడం, నీరు అధికంగా తాగటం చేయాలి.

ప్రస్తుతం ఉద్యోగం సాధారణంగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. 2021 తర్వాత ఉద్యోగంలో మార్పు వస్తుంది. ప్రవర్తనలో తొందరపాటు పనికిరాదు. భవిష్యత్తులో ధార్మిక జీవనానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో సిెల్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వివాహ విషయంలో తొందరపాటు పనికిరాదు. ఆలస్య వివాహం సూచన ఉంది.

జపం : హరహర శంకర జయజయ శంకర జపం

                                శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.

దానం : బియ్యం / పాలు/ పెరుగు/ 2. కందిపప్పు / ఖర్జూరాలు / దానిమ్మపళ్ళు/ 3.నూనె అవసరం ఉన్నవారికి ఇంటిలో వాడుకోవడానికి, / దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి / పల్లీలు మొదలైనవి దానం చేయాలి.

5. అన్నపురెడ్డి బాబు

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

మీ నక్షత్రం రోహిణి 4వ పాదం, వృషభరాశి.

2019 మే నుంచి 1 సం||రం పాటు అనగా 2020 ఆగస్టు వరకు అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. నిరాశ నిస్పృహలు వచ్చే సూచనలు. అన్నీ కోల్పోయే సమయం దగ్గరలో ఉంది. కావున జాగ్రత్త అవసరం. జాగ్రత్త అంటే వస్తువులు డబ్బులు దాచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. ముందుగానే దాన ధర్మాలకు అధికంగా ఖర్చు చేయాలి. అలా చేయడం వలన అనవసర ఖర్చులు వైద్యశాలలు, డబ్బులు పోవడం, దొంగతనం జరగడం లాటింవి జరుగకుండా ఉంటాయి.

దానం : గోధుమరొట్టెలు / గోధుమపిండి/ గోధుమరవ్వ/ 2. వండుకునే వారికి 5 నుంచి 10 కిలోలు బియ్యం/ అన్నదానం / పాలు/ పెరుగు / 3. పశుపక్షాదులకు ఆహారం, 4. నూనె వినియోగించుకోవడానికి, దీపారాధనకు దేవాలయాల్లో / పల్లీలు మొదలైనవి నిరంతరం ఎక్కువగా దానం చేస్తూ ఉండాలి.

జపం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ; హర హర శంకర జయజయ శంకర నిరంతరం చేస్తూనే ఉండాలి.

6.శివశంకర్‌

విదేశీ, ఉద్యోగం, ప్రేమ వివాహం సాధ్యమేనా?

మీ నక్షత్రం పూర్వాషాఢ 3, ధనుస్సురాశి.

గోచార రీత్యా ఏలినాటి శని నడుస్తుంది కావున బద్ధకం, చికాకులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్న థలు కూడా అంత అనుకూలమైనవి కావు. మీరు ప్రతీరోజూ యోగాసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం, ఉదయం కాని సాయంకాలం కాని వాకింగ్‌ చేయడం తప్పనిసరి అలవాటు చేసుకోవాలి. నీరు బాగా తీసుకోవాలి. తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మీకు ఈ 2019 సం||లో అన్నిలో ఒత్తిడి ఉన్న కారణంగా ఎక్కువగా దైవధ్యానంలో కాలం గడపాలి. వైవాహిక జీవితంలో కొంత ఆలస్యం తప్పదు. చాలా ప్రయత్నం చేస్తే తప్ప ప్రేమ వివాహానికి అవకాశం లేదు.

విదేశీ వ్యవహారాల విషయంలో అంత బలమైన స్థితిలేదు. ప్రస్తుతం ఉద్యోగం చిన్నదే వచ్చినా అందులోనే కొనసాగండి. 2020 తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది. ప్రస్తుతం సమయం సాధారణంగా ఉన్నా మొత్తంపై జాతకం మొత్తం బావుంటుంది.  మంచి ఉద్యోగానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేసుకోవాలి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ ; శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడంమంచిది.

దానాలు : కందిపప్పు/ కర్జూరాలు/ దానిమ్మపళ్ళు/ 2. నూనె వంటలకు వాడుకోవడానికి దీపారాధనకు/ మరియు పల్లీలు దానం చేయాలి.

7. చైతన్య కుమార్‌ రెడ్డి

ఉద్యోగం మరియు వివాహం

ప్రస్తుతం మీకు అన్నివిధాల సమయం అనుకూలంగానే ఉన్నది. ఉద్యోగం వస్తుంది. ప్రయత్నం చేస్తే వివాహం కూడా అవుతుంది. మంచి సమయంలో మంచి పనులు పూర్తి కావడానికి దానం జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః / కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ జపాలు నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానాలు : 1. పశుపక్ష్యాదులకు ఆహారం నీరు పెట్టడం; 2. గోధుమ పిండి / గోధుమ రొట్టెలు / గోధుమ రవ్వ అధికంగా దానం చేస్తూ ఉండాలి. అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios