సాధారణంగా హిందువులు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే వారు చేసే ప్రతి పని విషయంలోనూ వాస్తు ప్రకారమే పనులను చేస్తూ ఉంటారు.ఇలా వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో విశ్వసించేవారు వారి ఇంట్లో అలంకరించుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తును అనుసరించి విగ్రహాలను బొమ్మలను అలంకరించుకుంటూ ఉంటారు.ఇకపోతే ఏ ఇంట్లో అయితే నిత్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారో అలాంటివారు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే వాస్తు ప్రకారం ఈ విగ్రహాలు ఇంట్లో ఉండాల్సిందే. 

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల విగ్రహాలను ఇంట్లో సరైన దిశలో పెట్టి పూజించడం వల్ల ఆ ఇంట్లో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ కలహాలు కానీ ఉండవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు ఇంట్లో ఈ విగ్రహాలను పెట్టుకోవడం శుభసూచకం. ఈ విగ్రహాలు కనుక మన ఇంట్లో ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనవంతులు అవుతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి ఆ విగ్రహాలు ఏంటి అనే విషయానికి వస్తే....

వెండి ఏనుగు విగ్రహం: ఇంట్లో ఏనుగు విగ్రహం ఉండడం శుభసంకేతం అయితే ఎవరి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారు ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసుకోవచ్చు కొందరు వెండి ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేయగా మరికొందరు ఇతడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏనుగు విగ్రహాలలో తొండం ఎప్పుడు పైకి ఎత్తినవి ఉండడం మంచిది. ఇలాంటి ఏనుగు విగ్రహాలు ఇంట్లో ఉండడం వల్ల రాహు దోషాన్ని తొలగించడంతోపాటు అపారమైన సంపదను కూడా కలిగిస్తాయి.

తాబేలు విగ్రహం: మన హిందూ సంప్రదాయాల ప్రకారం తాబేలును సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. కనుక ఈ విగ్రహం ఇంట్లో ఉండటం వల్ల సకల సంపదలకు ఏమాత్రం లోటు ఉండదు. ఇక ఈ తాబేలు విగ్రహాన్ని ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం ఎంతో మంచిది.

చేప విగ్రహం: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చేప విగ్రహం వెండిది లేదా ఇత్తడిది కనుక ఉంచినట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ చేప విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టడం ఎంతో శుభ సూచకం. ఇలా ఈశాన్య దిశలో పెట్టడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో గడుపుతారు.