జీవితాన్ని ఎలాగోలా బతికేద్దామని కొందరు అనుకుంటారు. కానీ... జీవితాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు కొందరు ఉంటారు. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది.
జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం అందరికీ రాదు. జీవితాన్ని ఎలాగోలా బతికేద్దామని కొందరు అనుకుంటారు. కానీ... జీవితాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు కొందరు ఉంటారు. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు మాత్రం జీవితాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
1.మకరం..
మకర రాశివారు జీవితంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. జీవితంలో అనుకున్నది సాధించాలనే కోరిక వీరిలో చాలా బలంగా ఉంటుంది. అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు. వీరు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుంటారు. వాటిని సాధించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తారు.
2.వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు కూడా జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. వీరికి జీవితంలో చాలా గొప్ప ఆశయాలు ఉంటాయి. వీరికి విజయకాంక్ష చాలా ఎక్కువ. వీరు విజయం సాధించడానికి ఎవరితోనైనా పోటీ పడతారు. వీరు తమ లక్ష్యాలను చేరుకోకుండా వీరిని ఎవరూ ఆపలేరు.
3.మేషం
మేష రాశివారికి ధైర్యం ఎక్కువ. వీరు తొందరగా దేనికీ భయపడరు. వీరికి జీవితం పట్ల అవగాహన చాలా ఎక్కువ. చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. వీరు జీవితంలో ఉత్తమంగా ఉండాలని కోరుకుంటారు. వారి లక్ష్యాలను సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తారు.
4.ధనస్సు రాశి...
ధనుస్సు రాశివారు ఆశావాదులు, సాహసవంతులు. వారి ఆశయం తరచుగా కొత్త ఆలోచనలు , అనుభవాలను అన్వేషించాలనే వారి కోరికలో వ్యక్తమవుతుంది. వారు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వారు తమ లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చేస్తారు.
5.సింహ రాశి...
సింహరాశివారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి జీవితంలో ఆశయాలు చాలా ఎక్కువ. జీవితంలో గుర్తింపు సాధించడానికి వీరు ఎప్పుడూ ముందుంటారు. తమను అందరూ గుర్తించాలని వీరు ఆరాటపడుతూ ఉంటారు. జీవితంలో విజయం సాధించాలనే పట్టుదల వీరికి చాలా ఎక్కువ.
ఇక...వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, కుంభం , మీన రాశి వారు తమ జీవితంలోని ఇతర అంశాలను కూడా సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల ప్రతిష్టాత్మకంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.
