Asianet News TeluguAsianet News Telugu

మకర సంక్రమనం.. ఈ నెల మీ రాశిఫలాలు

అన్ని రాశుల వారు వారివారి చికాకులను తగ్గించుకోడానికి సూర్యాష్టకం పారాయణం, ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం చేయాలి. మొత్తం పారాయణ చేయలేనివారు కనీసం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనే శ్లోకాన్ని ఐనా తప్పనిసరిగా పారాయణ చేయాలి.

makara sankramanam on horoscope
Author
Hyderabad, First Published Jan 24, 2019, 2:19 PM IST

నవగ్రహాల్లో చైతన్యానికి మూల చైతన్యం సూర్యునిదే. వేరు వేరు గ్రహాలపై పడిన కాంతి పరావర్తనం వల్ల వాని కాంతిని కలిపి భూమి చుట్టూ చేరుతుంది.

మూలచైతన్యమైన ఆత్మదే వ్యక్తిలోని చైతన్యం. అయితే ఈ చైతన్యం వేరు వేరు ప్రదేశాలలో వ్యాపనం చెందనం ద్వారా వాని లక్షణాలతో మనకు కనిపిస్తుంది. చైతన్యం లేనిది ఏమీ లేదు. అంతా శూన్యమే ఉంటుంది. ఆ చైతన్యానికి ప్రతీక అయినవాడు రవి. అందుకే జ్యోతిషశాస్త్రరీత్యా కూడా రవికి ఉన్నతస్థానానికి ఇవ్వడం జరిగింది. జ్యోతిష శాస్త్ర రీత్యా పితృకారకుడు. హోదాలకు అధికారాలకు కారకుడు. ఆరోగ్య కరాకుడు. సహజంగా పాప గ్రహం కావడం వల్ల రవి, థ అంతర్దశలలో చికాకులు కూడా ఉంటాయి. రవి ధనుస్సు సంక్రమణం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ మాసం మొత్తం కొంత ఒత్తిడి చికాకులు తప్పవు.

మేషం : అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. చేసే ఉద్యోగంలో శ్రమ ఎక్కువ పడతారు. రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెడతారు. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు శ్రమకు తట్టుకోవాలి. విద్యార్థులకు కష్టకాలం. కీర్తి ప్రతిష్టలు కాపాడుకునే ఆలోచన ఉంటుంది.

వృషభం : పరిశోధకులకు కొత్త విషయాలపై ఆసక్తి తగ్గుతుంది. దూర ప్రయాణాలు చేయాలనే తపన ఉంటుంది. విందు భోజనాలపై ఆశ ఉంటుంది. అనవసర కష్టాలు తెచ్చుకోరాదు. ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అధికారంలో ఉన్నవారు జాగ్రత్తపడాలి. విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది.

మిథునం : వీరికి ప్రభుత్వ సంబంధ ఒత్తిడి ఉండే సూచనలు కనబడుతున్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతాన సంబంధమైన ఒత్తిడి ఉండే సూచన. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు. పిల్లలు సృజనాత్మకతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

కర్కాటకం : సామాజిక సంబంధాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. వాివల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయాలు పెంచుకోకపోవడం మంచిది. పరస్పర సహకారాలు లోపిస్తాయి. గౌరవంకోసం ఆరాటం పెరుగుతుంది. సౌకర్యాలకోసం ఒత్తిడిని పెంచుకుటాంరు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది.

సింహం : పోీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. లక్ష్య సాధన ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనల్లో విముక్తి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధికారుల సహకారాలు లభిస్తాయి. పరాక్రమం పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. అన్ని పనుల్లో ఒత్తిడిమాత్రం తప్పదు. జాగ్రత్త అవసరం.

కన్య : విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సంతాన సంబంధ ఆలోచనల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయతలు తగ్గుతాయి. పరిపాలన సంబంధమైన ఒత్తిడులు ఉండే సూచనలు.   కళాకారులు అధిక శ్రమతో తక్కువ ఫలితాలు సాధిస్తారు.

తుల : ఒత్తిడితో సౌకర్యాలను పెంచుకుటాంరు. ప్రయాణ సౌకర్యాలు, చేసే ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. తమకు కావల్సిన సౌకర్యాల కోసం ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారం సమయానికి స్వీకరించడం మంచిది. అనారోగ్య సమస్యలు సూచితం. గౌరవం కోల్పోయే సూచనలు. జాగ్రత్త అవసరం.

వృశ్చికం : అన్ని రకాల సంపదలు లభిస్తాయి. అధికారుల సహకారం లభిస్తుంది. అధికారిక ప్రయాణాలు చేస్తారు. పరాక్రమం పెంచుకునే ప్రయత్నం ఉంటుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. వాిలో కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రచార, ప్రసార సాధనాలు అనుకూలంగా ఉంటాయి.

 

ధనస్సు : మాట వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. బంధువులు దూరమయ్యే సూచనలు. వాగ్దానాలు చేయరాదు. మధ్యవర్తిత్వపు పనులు చేయరాదు. కుటుంబ సభ్యులతో అనుబంధం తగ్గుతుంది. దాచిన ధనం దుర్వినియోగం అవుతుంది. కిం సంబంధ లోపాలు  బయట పడతాయి. ఎక్కువ మౌనం, తక్కువ మ్లాడటం చేయాలి.

మకరం : పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. లక్ష్యసాధన ఉంటుంది. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. సుఖ దుఃఖాలు సమానంగా ఉంటాయి. శరీరంపై దృష్టి పెడతారు. అందంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు.

కుంభం : విశ్రాంతి తగ్గుతుంది. అధిక శ్రమ చేస్తారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. పాదాల నొప్పులు వచ్చే సూచనలు. రక్త ప్రసరణను పెంచుకునే మార్గం చూడాలి.

మీనం :  పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. కళాకారులకు అధిక శ్రమానంతరం సంతోషం లభిస్తుంది. వేరు వేరు కంపెనీల ద్వారా ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కొంత ఆధ్యాత్మికతను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పనులైనా ఒత్తిడి అనంతరం సంతోషం మాత్రమే లభిస్తుంది.

అన్ని రాశుల వారు వారివారి చికాకులను తగ్గించుకోడానికి సూర్యాష్టకం పారాయణం, ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం చేయాలి. మొత్తం పారాయణ చేయలేనివారు కనీసం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనే శ్లోకాన్ని ఐనా తప్పనిసరిగా పారాయణ చేయాలి.

Follow Us:
Download App:
  • android
  • ios