కుజుడు కుంభరాశినుంచి మీనరాశికి 24.12.2018న మారతాడు ఈ గ్రహం మీన రాశిలో 5.2.2019 వరకు మీన రాశిలోనే ఉంటాడు. కుజుడు సహజంగా పాప గ్రహం ఒక పాపగ్రహం ఏ స్థానంలో ఉన్నా అనగా శుభ స్థానంలో ఉంటే   ఆ స్థానం పాడవుతుంది. తన సొంత ఇంటిని బాగుచేసుకుంటుంది. అదే పాప స్థానంలో ఉంటే ఎలాగూ పాప గ్రహమే కాబట్టి ఆ స్థానం పాడవుతుంది. శరీరంలో కండర కణజాలాలకు కుజుడు ప్రతీక. అలాగే శరీరంలో ఎరుపు రక్త కణాలకు, ఎముకలకు కూడా కుజుడు కారకత్వం వహిస్తాడు. ద్వాథ రాశులవారికి కుజుని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

మేషరాశి : సోదరవర్గీయుల సహకారం అందుతుంది. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి చూపుతారు. తాము చేసే పనుల వల్ల తమకు కష్టాలు ఉంటాయి. ఆ పనుల వల్ల అధిక ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోటీ ల్లో గెలుపొందాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. నూతన దంపతులు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో కూడా వీరికి తొందరపాటు పనికిరాదు. ఆచి, తూచి వ్యవహరించాలి.

వృషభం : మాటల్లో కఠినత్వం ఉంటుంది. వాగ్దానాలు నెరవేర్చడానికి కష్టపడతారు. మధ్యవర్తిత్వాలు పనికిరావు. కుటుంబంలో  ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది. సంతాన సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. సంతాన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు.

మిథునం : వీరు అధిక శ్రమతో లాభాలు సంపాదిస్తారు. కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం రాకపోవచ్చు. కాని పనుల్లో నైపుణ్యం సంపాదిస్తారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పై ఉద్యోగస్తులు తొందరపాటుకు జాగ్రత్త అవసరం. తమకు అవసరం లేని పనులు కూడా తమపైకి న్టెటివేయబడతాయి. చూసుకొని ఆలోచించి అడుగులు వేయాలి.

కర్కాటకం : సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మానసిక ఒత్తిడి కొంత అధికంగానే ఉంటుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కీర్తి ప్రతిష్టలపై దృష్టి పెడతారు. అనవసర ఖర్చులు చేస్తారు. అనవసర ప్రయాణాలు ఉంటాయి.పాదాల నొప్పులు వచ్చే సూచనలు. విశ్రాంతికోసం ప్రయత్నం చేస్తారు.

సింహం : వీరు అనుకున్న పనులు తొందరగా పూర్తిచేయలేరు. మొదలుప్టిెన అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి.   కోపం, విసుగు, చికాకులు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్త అవసరం. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆహారంలో సమయపాలన మంచిది. దూర దృష్టి తగ్గుతుంది. మాతృసౌఖ్యం తక్కువగా ఉంటుంది.

కన్య : వీరికి వైవాహిక జీవితంలో ఈ నెలరోజులు ఒత్తిడి తప్పదు. జీవిత భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తొందరపాటు పనులు పనికిరాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వివాహం కోసం ప్రయత్నించేవారికి వివాహం ఆలస్యం అయ్యే సూచనలు. సహకారాలు లోపం జరుగవచ్చు. అధికారులతో జాగ్రత్త అవసరం.

తుల : మాటల్లో కొంత చురుకుదనం ఉంటుంది. సామాజిక అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మధ్యవర్తిత్వాలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబంలో జాగ్రత్తగా చూసుకోవాలి.

వృశ్చికం : విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాల సాధన ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. ఆలోచనల్లో అలజడి ఉంటుంది. తాము చేసే పనులు ఒకికి రెండుసార్లు ఆలోచించి ఒత్తిడి లేకుండా చేసుకోవాలి.  తాము చేసే పనుల్లో ఉన్నతివైపు ఆలోచించాలి.

ధనుస్సు : సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. సంఘంలో గౌరవం నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఒత్తిడితో సహకారాలు లభిస్తాయి. తల్లితో అనుబంధాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. గృహ, ఆహార, విహారాల్లో అనుకున్నంత సంతృప్తి లభించదు. ఏదో వెలితి కనిపిస్తుంది. వాటికోసం ఎక్కువ ఆరాట పడరాదు. ఆహారంలో సమయపాలన మంచిది. తక్కువ ఆహారాన్ని స్వీకరించడం మంచిది.

మకరం : చిన్న చిన్న ప్రయాణాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. సోదర వర్గీయుల సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. కష్టపడే తత్వం కలవారు. కమ్యూనికేషన్స్‌నుజాగ్రత్తగా కాపాడుకోవాలి. అనుకోని ఒత్తిడులు వచ్చే సూచనలు ఉన్నాయి.

కుంభం : వాగ్దోధరణిలో ఉండే వేగాన్ని తగ్గించుకోవాలి. తొందరపాటు పనికిరాదు. కుటుంబంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు. మధ్యవర్తిత్వాలు చేయరాదు. వాగ్దానాల జోలికి పోరాదు. సహకారం కోసం ఎదురు చూపులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.

మీనం : పనుల్లో పట్టుదలతో పూర్తిచేస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులకు అనుగుణంగా ఆలోచనలు మార్చుకుంటారు. తమకు అప్పగించిన పనిని పూర్తిచేసేవరకు వదిలిపెట్టరు. పట్టుదల అధికంగా ఉంటుంది. పనికి తగినట్లు ఆలోచనలు మార్చుకుంటారు. నిల్వ ధనాన్ని కొంత తమకోసం వినియోగించుకుంటారు. సౌకర్యాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి.

అన్ని రాశుల వారికి కూడా కొంత ఒత్తిడితో కూడుకున్న కుజుని ప్రభావం ఏదో రకంగా ఉంటుంది. కావున అన్ని రాశులవారు సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీనృసింహస్వామి ఆరాధన, లక్ష్మీ ఆరాధన మంచిది. వీరు ఆహారం స్వీకరించే సమయంలో దానిమ్మపళ్ళు, సపోటాలు మంచివి. ఇవి లేనివారికి దానం ఇస్తూ ఉండాలి.

డా.ఎస్.ప్రతిభ